Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్ నగర్ రూరల్
నాటుసారా నియంత్రించేందుకు ప్రతీ పౌరుడూ బాధ్యత వహించాలని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం షాద్‌నగర్ ఆబ్కారీ కార్యాలయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా విసిట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి కార్యాలయంలో ఆబ్కారీ అధికారులను పలు విషయాలను అడిగి తెలుసుకుని , సూచనలు సలహాలు అందజేశారు. నియోజకవర్గంలో గుడుంబా తయారీ, నల్లబెల్లం విక్రయాల పైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడుంబ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గిరిజన తండాల్లో నాటుసారా విక్రయాలు చేసే వారిని గుర్తించి పునరావాసం కల్పించి నాటు సారా అమ్మకాలు, తయారీని పూర్తిగా అరికట్టినట్టు చెప్పారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ సమయంలో నెల రోజుల పాటు లిక్కర్ విక్రయాలు జరగకపోవడంతో మళ్లీ నాటు సారా తయారీ ప్రారంభమైదన్నారు. ఆబ్కారీ అధికారులు గ్రామాల్లో నాటు సారాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. నల్ల బెల్లం అమ్మకాలపై నిఘాను పెంచినట్టు వివరించారు. సరిహద్దుల్లో లారీలల్లో విస్తతంగా తనిఖీలు నిర్వ హింస్తున్నట్టు తెలిపారు. కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో నాటు సారా అమ్ముతూ పట్టుబడిన గిరిజన వృద్ధుడితో కార్యాలయంలో మాట్లాడారు. ఇకపై నాటు సారా విక్రయించొద్దని హెచ్చరించినట్టు తెలిపారు. ఇప్ప టికైనా నాటు సారా విక్రయించే వారు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు.కార్యక్రమంలో ఆబ్కారీ సీఐ రామకృష్ణ, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, మున్సిపల్ వైస్ చైర్మెన్ నటరాజన్, కౌన్సిలర్ సర్వర్ పాషా, ఆబ్కారీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.