Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
యాచారం మండలం సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎంపీపీ కొప్పు సుకన్యభాష స్పష్టం చేశారు. బుధవారం యాచారం సర్వసభ్య సమావేశంలో ఎంపిపి సుకన్యభాష అధ్యక్షతన వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న అక్రమ వెంచర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసు కోవాలన్నారు. అనుమతి లేని వెంచర్లను కూల్చి వేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. నల్లవెల్లి , గున్‌గల్ గ్రామాల్లో ఏర్పాటవుతున్న అక్రమ వెంచర్లను కూల్చివేయాలని మండల పరిషత్ ఉపా ధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నల్లివెల్లి ఎంటీసీ లక్ష్మిపతిగౌడ్ డిమాండ్ చేశారు. అక్రమ వెంచర్లపై తాము చర్యలు తీసుకుంటామని ఈఓఆర్‌డీ వినోద్‌కుమార్ సభ్యు లకు వివరించారు. మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న వెంచర్లపై నిఘా వేసినట్టు చెప్పారు. మండలంలో ఎల్‌టీ, 11కేవీ పూర్తిగా డీలాగా వైర్లు ఉన్నాయని, ఏ క్షణం ఏ ప్రమాదం ముంచుకోస్తుందని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. మేడిపల్లిలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఎంపిటీటీ మెరుగు శివలీలా వివరించారు. అలాగే తాడిపర్తిలో కరెంట్ సమస్యను పరిష్క రించాలని ఎంపీటీటీ బాబు సభ్యకు తెలిపారు. సమస్యపై త్వరలో ఇస్టిమేషన్ వేసి పాత వైర్లను తొలగిస్తామని, డీలాగా ఉన్న వైర్లను ఏఈ సీతా రాములు సభ్యులకు సూచించారు. మండలంలో విదుత్య్ ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ట్రన్స్‌కో ఏఈ చెప్పారు. కాగా మండలంలో ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రతి రైతుకు కావాల్సిన ఎరువులు అంద జేస్తున్నామని మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ చెప్పారు. ప్రజల నుంచి వివిధ రకాల పన్ను లు వసూలు అయ్యేలా సభ్యులు సహక రించాలని ఈఓఆర్‌డీ వినోద్ కుమార్ చెప్పారు. మండలంలో తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ కింద ప్రతి గ్రామానికి నీరందిస్తున్నామని మిషన్ భగీరథ అధికారి తెలిపారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని ఆయన సభ్యులకు వివరించారు. ఈ సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు ఎవరూ కూడా హాజరు కాలేదు. కార్యక్రమంలో ఎంపీడీఓ వినరుకుమార్, వివిధ గ్రామాల ఎంపిటీసీలు, అధికారులు పాల్గొన్నారు.