Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
నేటి క్రీడాకారులకు స్ఫుర్తి ప్రదాత ధ్యాన్‌చంద్ అని పరిగి ఎంఈఓ అంజిలయ్య అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయు లు, విద్యార్థులు 30 మీటర్ల జాతీయ జెండాతో బస్టాండ్, బహార్‌పేట్, గంజిరోడ్‌ల మీదుగా మంగళవారం భారీర్యాలీ నిర్వహించారు. ఎంఈఓ అంజిలయ్య, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షు డు కృష్ణ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడారంగంలో చరిత్రను సృష్టించి దేశం పేరును సువర్ణాక్షరాలతో లిఖించాలన్నారు. ఎంతోమంది క్రీడాకారులు తమ ప్రతిభను పాఠశాలలో కనబర్చి దేశానికి కీర్తి ప్రతిష్ఠాలను తీసుకోచ్చా రన్నారు. వీరందరికీ స్ఫుర్తి ప్రదాత హకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ అన్నారు. ఆయన పుట్టిన రోజు ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరు పుకోవడం సంతోషకరమన్నారు. హకీలో తన ప్రతిభను చాటి ఒలంపిక్స్‌లో 3 సార్లు స్వర్ణపథ కం సాధించిపెట్టాడని గుర్తుచేశారు. ఆయన కలలను సాకారం చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్థులు ఏయే క్రీడలపై ఆసక్తి కనబరుస్తారో నైపుణ్యం అందులో శిక్షణ ఇవ్వాలన్నారు. గ్రామాల్లో ఎందరో ప్రతిభావంత మైన క్రీడాకారులు ఉన్నారన్నారు. వారిని ప్రోత్సాహించి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వ్యాయా మ ఉపాధ్యాయులు గంగ్య, మల్లికార్జున్, కృష్ణ మూర్తి, సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యాయులు రాంమో హన్, శ్రీశైలం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనే యులు, పూడూర్ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మధు, జైపాల్, అనితరెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.