Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సాక్షరభారత్ కోఆ ర్డినే టర్లు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా సాక్షరభారత్ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రాల్లో 2010 నుంచి నేటివరకు నిరంతరాయంగా పనిచేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. దీని ప్రకారం గ్రామస్థాయి కోఆర్డినేటర్లకు రూ.10,500, మండలస్థాయి వారికి రూ.25వేల గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా తమ సమస్యలు పరిష్కరిం చాలని ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కోఆర్డినేటర్లుగా అక్షరాస్యతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు హరితహారం, ఇంటి పన్నుల వసూలు, రైతు సమగ్ర సర్వేలు, బడిబాట, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రభుత్వ కార్యాక్రమాల్లో పాల్గొంటున్నా మన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాక్షరభారత్ కార్యక్ర మాన్ని పటిష్టవంతంగా కొనసాగించాలన్నారు. వయో జన విద్య కేంద్రాలలో పుస్తకాలను అందుబాటు లోకి తెచ్చి మినీ గ్రాంథాలయాలుగా గుర్తించాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించి హెచ్‌ఆర్ పాలసీతో పాటు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిం చారు. పరిగి మండల ఉప అధ్యక్షుడు రాములు, బాల్ రాజ్, వెంకట్, సుభాష్, హరిచందర్, రాధిక, పార్వతి, సంగీతా, సంధారాణి, మంజుల, సావిత్రి పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్ : సాక్షరభారత్ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెకు దిగారు. మండల కోఆర్డినేటర్ కృష్ణంరాజు మాట్లాడుతూ ఏడాదికాలం పాటు సాక్షరభారత్ ఉద్యోగులను ప్రభుత్వ పథకాలలో పనులు చేయించుకుని వేతనాలు ఇవ్వడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా కొడంగల్ ఎంపీటీసీ నందారం రాజేందర్ దీక్షలో కూర్చున్నారు. గ్రామ కోఆర్డినేటర్లు వెంకటయ్య, పకిరప్ప, చిన్నయ్య, శేఖర్, బిమప్ప, ఫరిదాబేగం, జయశాంత, గౌరమ్మ, సావిత్రి, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.