Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బస్వపాపయ్యగౌడ్
- వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన యువకులు
నవతెలంగాణ-కందుకూరు
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సీఎం కేసీఆర్‌కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గద్దె దించుతారని రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బస్వపాపయ్యగౌడ్ జోస్యం చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు సాద మల్లారెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు యువజన సంఘాల నాయకులు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవేయాలన్నారు. రాబోయో ఎన్నికల్లో మహేశ్వరం గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు కష్టపడి పార్టీ బలోపేతానికీ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, ఎంపీపీ అశోక్‌గౌడ్, జిల్లా కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షులు డేరంగుల కృష్ణయ్య, కడ్తాల్ కిష్టయ్య, బక్క మల్లేష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.