Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్డీఓ పీడీ జాన్సన్
నవతెలంగాణ-దోమ
ప్రతి ఇంటికీ తప్పనిసరిగా ఇంకుడు గుంతను నిర్మించుకొని, నీటి వృథాను అరికట్టాలని జిల్లా డీఆర్డీఓ పీడీ జాన్సన్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని దిర్సంపల్లి, బుద్లాపూర్ గ్రామాలలో పర్యటించి, ఇంకుడుగుంతలపై, తడి, పొడి, డంపింగ్ యార్డ్‌లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించాలని కోరారు. గ్రామంలో తడి, పొడిచెత్తను వేరుగా వేసి పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. భూగర్భ జలాలను దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఇంటికీ ఇంకుడు నిర్మించుకోవాలన్నారు. అనంతరం దిర్సంపల్లి పాఠశాల ఆవరణలో మొక్కలకు విద్యార్థులచే నీరు పోయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు శాంతకొండారెడ్డి, మరోనిబాయి, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, శివ కుమార్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.