Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుల్కచర్ల
ప్రజలందరి సహకారంతో చౌడపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల పరిధిలోని చౌడపూర్ గ్రామ పంచాయతీ నిధుల నుంచి సర్పంచ్ కొత్త రంగారెడ్డి ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆయనను అభినందించారు. అనంతరం సర్పంచ్ కొత్త రంగారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో తడి, పొడి చెత్తను, వ్యర్ధ పదార్థాలను డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు జిల్లాస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాక్టర్ కొనుగోలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్, ఉపసర్పంచ్ శివకుమార్, భోగిని భీమయ్య, రాజయ్య, మాజీ స్కూల్ చైర్మన్ శ్రీను, వార్డు సభ్యులు పరిగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.