Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
మండలంలోని హస్నాబాద్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకూ 350 మంది విద్యార్థులు చదువుతున్నారు, శనివారం ఉదయం విద్యార్థులు ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో పైకప్పు పెచ్చులూడి పడి పెను ప్రయాదం తప్పింది. ఎప్పుడూ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక విద్యార్థులు ,ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు, పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంవల్ల గోడలు పగుళ్లు వచ్చాయి, అధికారులు స్పందించి పాఠశాల నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు, ఈ సందర్భంగా సర్పంచ్ పకీరప్ప మాట్లాడుతూ పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, విషయాన్ని పై అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.