Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలో పలువురు లబ్ధిదారులకు రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. మండల పరిధిలోని మక్తవెంకటాపూర్ గ్రామానికి చెందిన సీనబారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయలపాలైనాడు. చికిత్స పొందడానికి ఎల్వోసీ ద్వారా రూ 2 లక్షల రూపాయలు, ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందిన అడవివెంకటపూర్ గ్రామానికి చెందిన సంగీత కు రూ. 27 వేల రూపాయలు, అంతారం గ్రామానికి చెందిన గోవింద్‌కు రూ. 25 వేల రూపాయలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
పరిగిలో : తన నివాసంలో పట్టణంలో ఇటీవలే అనారోగ్యంతో చికిత్స పొందిన గండీడ్ మండల పరిధిలోని వెన్నచేడ్ గ్రామానికి చెందిన రఘురాజ్ కు 17 వేల రూపాయలు, అదే గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్‌కు రూ .60 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల పిఎసిఎస్ చైర్మన్ రాంరెడ్డి, తెరాస నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.