Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిల్లేడు చౌదరిగూడెం
తుంపల్లి శివారు 145 సర్వే నెంబర్‌లోని సమాధులను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని చౌదరిగూడెం గ్రామస్తులు తహసీల్దార్ రాంబాయికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 145 సర్వే నెంబర్‌లో పద్మశాలీల శ్మశాన వాటికలో వందేండ్ల నుంచి సమాధులు ఉన్నాయని తెలిపారు. ఇట్టి సమాధులను తొలగించిన శేఖర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సర్వే నిర్వహించి స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో సర్పంచ్ స్వామి, గ్రామస్తులు నర్సింగ్ రావు, సుధాకర్ రావు, తాడూరి రమేష్, నారాయణలు ఉన్నారు.