Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
తప్పుడు పత్రాలతో ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్న సీఎం కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాలని చేవెళ్ల పార్లమెంట్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం బండ్లగూడ కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి బండ్లగూడలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజుకు చేరినా వారి సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిపట్టుతో వ్యవహరించడం దారుణమన్నారు. జేఏసీ తగ్గినా.. సీఎం కేసీఆర్ చర్చలకు పిలవకపోవడం సిగ్గుచేటని అన్నారు. సొంత లాభాల కోసం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. ఉన్నత న్యాయస్థానానికి సరైన వివరణ ఇవ్వని కేసీఆర్ సర్కారును దించడం ఖాయమన్నారు. ఆరేండ్లుగా రంగారెడ్డి జిల్లా నిధులను తన కొడుకు, అల్లుడు, కూతురి నియోజకవర్గాలకు తరలించారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై టీఆర్‌ఎస్ సర్కారును నిలదీయాలని అన్నారు. బండ్లగూడ కార్పొరేషన్ ఎన్కిల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కమిటీ పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన బండ్లగూడ కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బండ్లగూడల్లో పార్టీ కోసం నిరంతరం పని చేస్తామన్నారు. కేసీఆర్ చేస్తున్న మోసాలను ఎండగట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోగాల శ్రీనివాస్, కొరివి గణేష్, చంద్రశేఖర్, తలారి ప్రేమ్‌కుమార్, విష్ణుకుమార్, లక్ష్మన్, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.