Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎల్‌డీఎం మేనేజర్ సుమలత
నవతెలంగాణ-మర్పల్లి
బ్యాంకుల్లో రుణాలు పొందిన లబ్దిదారులు తిరిగి చెల్లిస్తేనే కొత్త వారికి రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సుమలత అన్నారు. సోమవారం మండల పరిషత్తు కార్యాలయం హాలులో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మండలాల బ్యాంకు మేనేజర్లు, ఎంపీడీఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎం మేనేజర్ సుమలత, డీఆర్‌డీఓ అదనపు పీడీ బాలస్వామిలు మాట్లాడుతూ.. బ్యాంకర్లు డ్వాక్రా మహిళా సంఘాలకు, వ్యవసాయదారులకు, స్వయం ఉపాధి లబ్దిదారులకు ఇచ్చిన రుణాలను సకాలంలో వసూలు చేయాలని అన్నారు.దీంతో లబ్దిదారులకు అధిక వడ్డీ భారం ఉండదని సూచించారు. బ్యాంకు రుణాల ద్వారా కొనసాగుతున్న యూనిట్ల పనితీరును ఎప్పటికప్పుడు గమనించాలని, రుణాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలతో యూనిట్లను సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి ఎంపీడీఓ సురేష్ బాబు, బంట్వారం ఎంపీడీఓ అశోక్ మోమిన్ పేట్ మండలాల ఎంపీడీఓలు ఆయా బ్యాంకుల మేనేజర్లు, జిల్లా డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు ఇందిరా మహిళా సమాఖ్య ఏపిఎంలు తదితరులు పాల్గొన్నారు