Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎల్లేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అనేక సందర్భాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వానికి వినతులు ఇచ్చిన పట్టించుకోవడం లేదన్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. కనీస వేతనం రూ.18000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంటగ్యాస్ సబ్సిడీ ప్రభుత్వమే అందజేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వంట సామాగ్రికి అదనంగా బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్ ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు స్వప్న, నాయకులు రమా, చుక్కమ్మ, అనురాధ, దానమ్మ ఉన్నారు.