Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
శివారు మున్సిపాలిటీలు అభివృద్ధిలో ముందుండాలని రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం నార్సింగి మున్పిపాలిటీలోని గండిపేట్ గ్రామంలో (జీడబ్ల్యూఎస్) గండిపేట్ వెల్ఫేర్ సొసైటీల్లో ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం, ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గండిపేట్ శివారు ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ప్లాస్టిక్ వాడకంతో వాతవరణం పూర్తిగా కలుషితమై, అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా ఎక్కువ శాతం జ్యూట్ బాగులను వాడాలన్నారు. ప్రతి కాలనీలో విరివిగా మొక్కలు పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ నియంత్రణకు మున్సిపల్ శాఖ నిరంతరం పని చేయాలన్నారు. ఐదేండ్లుగా గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గండిపేట్, ఖానాపూర్, అజీజ్‌నగర్, ఎన్కెపల్లి వెల్ఫేర్ మేనేజ్‌మెంట్ ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేస్తున్నారని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు మున్సిపల్ తరఫున అవగాహన కల్పిస్తామన్నార. వెల్ఫేర్ ద్వారా సేవలందిస్తున్న వారిని డైరెక్టర్ అభినందించి, బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ అధికారి సుఖ్రితారెడ్డి, డీఈ నర్సింలు, మేనేజర్ నర్సింలు, రాజేంద్రనగర్ మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మెన్ చంద్రశేఖర్‌రెడ్డి, మండలాధ్యక్షులు నర్సింహ, మాజీ సర్పంచులు ప్రశాంత్ యాదవ్, వెంకటేష్‌యాదవ్, జి. శివారెడ్డి, రామేశ్వరం విశ్వనాథ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
వ్యాయమాం తప్పనిసరి : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ఆరోగ్యమైన జీవితానికి వ్యాయామం తప్పనిసరని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ అన్నారు. శనివారం నార్సింగి మున్సిపాలిటీలో జీడబ్ల్యూఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాయామంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఆరోగ్య సూత్రాలను తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. చలికాలంలో ప్రతి ఒక్కరూ వ్యాయమం చేయాలన్నారు. యువత, ఉద్యోగస్తులు అందరూ ప్రతిరోజు అరగంట వ్యాయామం చేస్తే.. శరీర అవయవాలకు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందని, చెడు కొలస్ట్రాల్ పెరగకుండా నియంత్రిస్తుందన్నారు. వెల్ఫేర్ తరఫున యువతతో పాటు రాజకీయ నాయకులు పరుగెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచులు నర్సింహా, వెంకటేశ్ యాదవ్, ప్రశాంత్ యాదవ్, శివారెడ్డి, రామేశ్వరం విశ్వనాథ్, డైరెక్టర్లు, మాజీ వార్డు సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.