Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు మూడో వార్డులోని బర్సీ లైన్‌లో ఇంటింటి నల్లా కనెక్షన్లకు శనివారం బోర్డు సభ్యురాలు అనిత ప్రభాకర్ ప్రారంభించారు. గత కొన్నేండ్లుగా 120 కుటుంబాలు తాగునీటికి ఇబ్బం దులకు గురవుతున్నారు. అనేక మార్లు సమస్య పరిష్కారానికి బోర్డు సభ్యురాలు అధికారులతో పోరాడి ఎట్టకేలకు ఇంటింటికి పైపులైన్లు ఏర్పాటు చేసి ప్రారంభించారు. గతంలో బస్తీవారు 14 సంవ త్సరాలు నీటి ఎద్దడి ఇబ్బందలను ఎదుర్కొన్నారని తెలిపారు. 150 కుటుంబాలకు తాగునీటి సమస్య తీరిందని బోర్డు సభ్యురాలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యురాలికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు సీఈఓ చంద్రశేఖర్‌రావు, కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు, మాజీ సభ్యులు ప్రభాకర్, స్థానికులు, గోవర్ధన్, నరేష్, రోషన్, సుధీక్, టోఫ్కీ, యూసుఫ్, నీరజ, జయశ్రీ, స్వన్న, అనిత పాల్గొన్నారు.