Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్‌కేసర్
అనాథలకు దాతలే తల్లిదండ్రులని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ధి శరత్‌చంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని చౌదరిగూడ విష్ణుపూరి కాలనీలో జరు ఫౌండేషన్ నూతనంగా నిర్మించిన ఆనాథశ్రమ భవానాన్ని శనివారం జెడ్పీ చైర్మెన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిóగా పాల్గొని మాట్లాడారు. అనాథలను అదుకోనేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని ఆయన కోరారు. జరు పౌండేషన్ నుండి అనాథలను అమ్మనాన్నగా చూసుకుంటున్న నిర్వహకులు సురేందర్ పాల్ అతని సతీమణి సునితలను ఆయన అభినందించారు. అనాథలకు 150 గజాల స్థలంలో ఆశ్రమం నిర్మించిన బైరు రాములుగౌడ్, బైరు లక్ష్మన్‌గౌడ్ ఆశ్రమానికి కిటికీలకు డోర్లు వేయిస్తానని హమీ ఇచ్చిన ఉప సర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్, పిల్లలు అడుకునేందుకు ఆటస్థలం, ఆట వస్తువులను అందిస్తానన్న ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, మరి కొంత మంది దాతలను ఆయన ఘనంగా సన్మానించారు. అనాథలను ఆదుకునేందుకు దాతల సహాయం అవసరమని అందుకు దాతలు ముందుకు రావాలని ఆయన అన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్ సర్పంచ్ భైరు రమాదేవి, ఉపసర్పంచ్ కుర్ర మహేందర్‌గౌడ్, వార్డు సభ్యులు భైరు లక్ష్మణ్ గౌడ్, స్వామిదాస్, శంకర్‌గౌడ్, సుధాకర్, బోజిరెడ్డి, ఎంపీటీసీలు పులికంటి భాస్కర్‌రెడ్డి, నీరుడి. రామారావు, నాయకులు భైరు రాములుగౌడ్, నర్సింగరావు, వేగానంద్, రాజశేఖర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, నాగేష్‌గౌడ్ పాల్గొన్నారు.