Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుక్కుగూడ
ప్రతిఒక్కరికీ తడి,పొడి చెత్తపై అవగాహన ఉండాలని టీఆర్‌ఎస్ నాయకులుఅన్నారు. శనివారం తుక్కుగూడ 14వ వార్డులో వార్డు ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ శ్రీనివాసులు, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి శ్రీధర్ గౌడ్, మద్దుల చంద్రశేఖర్‌రెడ్డి, సప్పిడి రాజు ముదిరాజ్ మాట్లాడుతూ... మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చెత్త బుట్టలను అందిస్తుందన్నారు. తడి,పొడి చెత్తపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వస్తుందని ప్రధానంగా సీఎం కేసీఆర్ కతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ పట్టణాలలో పంపిణీ చేస్తున్న బుట్టలను ప్రజలు సద్వినియోగం చేసుకొని పారిశుధ్యం సమస్యని పారద్రోలాలని పిలుపునిచ్చారు. పారిశుధ్యంతో కలిగే నష్టాలను వివరించి చెప్పారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి కూడా సహకరించి తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని 14వ వార్డు ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఢిల్లీ విజరు, బుక్క శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది నాగేష్, నరేష్, నారాయణ, మహిళలు వార్డు ప్రజలు మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.