Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దేముల్
పాఠశాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు రావాలని సర్పంచ్ రేగోండి లక్ష్మి సూచించారు. శనివారం మండల పరిధిలోని బుద్ధారం ప్రాథమిక పాఠశాలలో పాఠశాల చైర్మెన్, వైస్ చైర్మెన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాఠశాల చైర్మెన్‌గా అశోక్ వైస్ చైర్మెన్‌గా అనంతయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ మాట్లాడుతూ.... పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్టు తెలిపారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మెన్‌లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు గాయత్రి, ఉపాధ్యా యురాలు సోనీ, విద్యార్థులు పాల్గొన్నారు.