Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పోలీసు ఉద్యోగం సమాజంలో ఎంతో గురుతర బాధ్యత నేర్పుతుందని పలువురు ఐఏఎస్, ఐసీఎస్ అధికారులు తెలిపారు. శనివారం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో పోలీస్ కానిస్టేబుల్లకు ఎంపికైన వారికి అభినందన సభ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీశ్, యాదాద్రిభువనగిరి జిల్లాల కలెక్టర్ అనితా రామచంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. సమాజంలో పోలీసులు ఉద్యోగాల్లో ఉన్నవారికి ఎంతో గురుతర బాధ్యత ఉంటుందని అన్నారు. నూతనంగా ఉద్యోగాల్లో చేరే ముందు దేశానికి ఏ విధంగా సేవా చేయాలనే ఆలోచించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతలో సైబర్ నేరాలు ఎక్కువైతున్నాయన్నారు. వాటిని అరికట్టాలని పోలీసులకు సూచించారు. ఆ బాధ్యతను నేటి నూతన పోలీసు ఉద్యోగులు తీసుకోవాలన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ.. అవినీతికి తావు లేకుండా నూతన పోలీసులు డ్యూటీ చేయాలని పిలుపు నిచ్చారు. పోలీసు జాబ్ చేసుకుంటు గ్రూపులకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో పోలీసంటే రాచకొండ సీపీ మహేష్ భగవతన్ను చూసి నేర్చుకోవాలని ఆమె సూచించారు. కలెక్టర్ చేసే కార్యక్రమాలను సీపీ మహేశ్‌భగవత్ చేసి చూపిస్తున్నారన్నారు. సీపీ మహేశ్‌భగవత్ మాట్లాడుతూ.. గురుదక్షిణం ఇచ్చె విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఆదర్శంగా వ్యవరిస్తున్నారని చెప్పారు. నూతనంగా పోలీసులు సాధించిన వారు త్వరలోనే ఉద్యోగాలకు వెళ్ళవల్సి ఉంటుందని సూచించారు. అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకర్గంలో నిరుద్యోగ యువతి యువకులు ఎక్కువగా ఉన్నారని బావించిఎంకేఆర్ ఫౌండేషన్ 2015లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మొదటి సారిగా 16మంది కానిస్టేబుల్ జాబు వచ్చాయని పేర్కొన్నారు. 2018లో ఇబ్రహీంపట్నం నుంచి 380 మందికి పోలీస్ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా గురునానక్ చీప్ సర్దార్ కోహ్లీ, గురుకుల విద్యాపీఠ్ ఆవరణ ఇచ్చినందుకు వారి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యాక్రమంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎంపీపీ కృపేష్, సెయింట్ కళాశాల చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీ ఇందు కళాశాల చైర్మన్ వెంకట్రావు, గురుకుల విద్యాపీఠ్ చైర్మన్ శ్రీనివాసరావు, ఏసీపీలు సీఐ, ఎస్‌ఐలున్నారు.