Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
కొనుగోలు కేంద్రాల వద్ద, జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులను గంటలకొద్దీ నిలబెట్టకుండా వెంటనే కొనుగోలు చేసి పంపించాలని వికారాబాద్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానవమ్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవ సాయ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లర్స్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పత్తి ఎంతకాలం పండుతుందో అంతవరకూ మిల్లులు పనిచేయాలని సూచించారు. సోమవారం నుంచి మిల్లులో పని నిర్విరామంగా చేయాలని ఆదేశించారు. ఏ జిల్లా కు చెందిన రైతులు పత్తిని అక్కడే కొనుగోలు చేయాలన్నారు. పక్క రాష్ట్రల వారి నుంచి కొనుగోలు చేస్తే మన జిల్లా వారికి అన్యాయం చేసిన వారమౌతామన్నారు. పత్తిలో తేమ శాతం గుర్తించి ధృవీకరించినచో బిల్లులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మిల్లులను ఉదయం 9 గంల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు. టోకెన్ పద్దతిని అనుసరించి సిబ్బందిని పెంచి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. దౌలతాబాద్, కొడంగల్, బొంరాస్‌పెట్ మండలాలకు చెందిన రైతులు తాండూరుకు వెళ్ళవచ్చని తెలిపారు. పంచాయతీ సెక్రటరీల సహాయం తీసుకొని పని వేగవంతముగా చెయాలని కోరారు.