Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక
- కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం
నవతెలంగాణ-గద్వాలటౌన్
ప్రాథమిక విద్య భవిష్యత్‌కు పునాది అని గద్వాల కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం గద్వాల జిల్లా కలెక్టరే ట్‌లో విద్యాశాఖ అధికారుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలు పెంచేం దుకు కృషి చేయాలన్నారు. విద్యార్థుల చదువుకు అనుగు ణంగా ప్రమాణాలు లేవని, వాటిని పెంపొందించేందుకు ఈఈసీ ప్రథమ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నాయన్నారు. 2017 జూన్‌లో ప్రవేశ పెట్టిన విధానంతో అప్పుడు బీ,సీ గ్రేడ్ గుర్తించిన విద్యార్థుల ప్రమాణాలు పెంచారన్నారు. ఈఈసీ ప్రథమ్ సంస్థలతో ఒప్పందం చేసుకోవడం వలన సంవత్సరానికి రూ.20లక్షల వరకూ పెమెంట్ చెల్లించినట్టు తెలిపారు. అందుకే విద్యార్థులకు మోడల్ లైన్ పరీక్ష నిర్వహించి సీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారి హాజరు శాతం? ఆ పాఠశాల విద్యార్థుల సంఖ్య? ఉపాధ్యాయుడు ఆ పాఠ శాలలో ఎప్పటి వరకు బోధిస్తున్నారు అనే అంశాలను క్రోఢకీరించి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా విద్యాశాఖా ధికారి సుశీందర్‌రావును ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష, డిప్యూటీ డీఈవో ఇందిరా, ఎంఈవో పాల్గొన్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ ఉన్నత పాఠశ ాలల్లో జూనియర్ స్థాయి రెడ్ క్రాస్ సొసాయిటీలను 11 వరకు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశిం చారు.కలెక్టరేట్‌లో రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్‌తో పాటు జిల్లా విద్యాధికారి, ఎంఈవో సమీక్షించారు. రాష్ట్ర గవర్న ర్ సూచనల మేరకు జిల్లాలో జూనియర్ స్థాయి రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సొసాయిటీలు ఏర్పాటు చేయాలన్నారు.