Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ప్రాంతీయప్రతినిధి
రాష్ట్రాన్ని కుదిపేసిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్‌కౌంటర్ చేశారు. నవంబర్ 27న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని శటాన్‌పల్లి వద్ద దిశపై లైగింక దాడి చేసి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన మనకు తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు మిన్నం టాయి. విద్యార్థినులు, మహిళలను రోడ్లమీదికి వచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని నినదించారు. వివిధ పార్టీల నాయకులు సైతం ఘటనను ఖండించారు. ఈఘటనతో పార్లమెంట్ దదరిల్లింది. శుక్రవారం తెల్లవారు జాములన నిందితులు మహమ్మద్ ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవలను రీకన్‌స్ట్రక్షన్ పేరుతో దిశను హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ విచారణ చేస్తుండగా నిందితులు రాళ్లురువ్వారని, ఆత్మ రక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. అక్కడి నుంచి మృతదేహాలను మహ బూబ్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించి శవపం చానామా నిర్వహిం చారు. పౌరహక్కుల సంఘాల నేతలు రాసిన లేఖను సుమోటగా స్వీకరించిన హైకోర్టు విచారణ జరిపేంత వరకూ దహనం చేయొ ద్దని ఆదేశించింది. దీంతో నిందితుల అంత్యక్రియలు ఆగిపోయాయి. ఎన్‌కౌంటర్ పట్ల కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నేతలు ఆగ్రహం చేశారు. చట్టాల ద్వారా శిక్షించాల్సిన వారిని, పోలీసులు ఎన్‌కౌంటార్ పేరుతో హంతం చేయడం సరికాదని సూచించారు.
పదో తరగతి పరీక్షలు మార్చిలో జరుగనున్నాయి. పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాని విద్యార్థులు మాత్రం పరీక్షలకు సిద్ధం కావడానికి అనుకూల ఏర్పాట్లు లేవంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు పాఠ్యాంశాలు పూర్తి కాలేదు. 52 రోజుల ఆర్టీసీ సమ్మెతో పాఠశాలలు నడిచినా.. విద్యార్థులు బస్సలు లేక గైరాజరయ్యారు. దీంతో పాఠ్యాంశాలు జరిగినా పాఠశాలకు రాకపోవడం వల్ల వీరికి ఏమాత్రం అర్థం కావడం లేదు. ముఖ్యంగా మొన్నటి వరకు ఉపాధ్యా యుల ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల విద్య ముం దుకు సాగలేదు. ఇక ల్యాబ్‌లు లేక మౌలిక వసతులు కరువయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అయోమ యంలో ఉన్నారు. ఇప్పుడు పరీక్షలు సమీపిస్తుం డటంతో పరీక్షలు ఏలా రాయాలో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరుగ నుండగా నాయకులు సిద్ధమవుతున్నారు. అధికా రులు సైతం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తు న్నారు. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా అందు లో 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. మిగితా రెండు మున్సిపాలిటీలు కోర్టు తీర్పు వల్ల ఎన్నికలు ఆగిపో యాయి. ఓటరు ప్రక్రియ, పోలింగ్ కేంద్రాలు తధితర అంశాలను పరిశీలించి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
రిజర్వాయర్ల ఏర్పాట్ల కోసం అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తి పోతల పథకంలో భాగంగా రిజర్వాయర్ల ఏర్పాట్లలో ఇప్పటివరకు ప్రణాళికలు సిద్దం కాలేదు. దీంతో 40 టీఎంసీలను నిల్వ చేసుకునే అవకాశం ఉన్న ఈ లిప్టులో కేవలం 4 టీఎంసీల నిల్వతోనే సర్దుకుం టున్నారు. జొన్నలబొగడ, ఎల్లూరు, గుడిపల్లి రిజర్వా యర్లలోనే నీటిని నింపుతున్నారు. మిగితా వాటిని గుర్తించి నివేదికలు తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారు.కల్వకుర్తితో పాటు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల పరిధిలో రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తే... ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం అవుతుంది.