Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కాటేసిన పాము.. సజీవంగా ఆసుపత్రికి పట్టుకొచ్చిన పెద్దాయన!
  • పంజాబ్ మంత్రి సిద్ధూను దూషిస్తూ పోస్టర్లు..
  • నేడు, రేపు రోటరీ మెగా రక్తదాన శిబిరాలు
  • బుల్లితెర నటుడిపై కట్నం వేధింపుల కేసు
  • నా చావుకు మమతే కారణం..ఐపీఎస్‌ లేఖ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్‌ | సామాజిక న్యాయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సామాజిక న్యాయం
  • ➲
  • స్టోరి
  • Jun 25,2018

రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్‌

భారతదేశ చరిత్రలో దళిత, బహుజనులను విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా, పాలనపరంగా మహాత్మ జ్యోతిబాఫూలే, ఛత్రపతి శివాజీల వారసుడిగా కషి చేసి మహానీయుడు రాజర్షి ఛత్రపతి సాహుమహారాజ్‌. 1874 జూన్‌ 26న రాధాబాయి, జయసింగ్‌ అబాసాహేబ్‌ ఘాట్గేలకు జన్మించిన యశ్వంతరావు ఘాట్గేనే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్‌గా ప్రసిద్ది చెందాడు. ఘాట్గేలు మహారాష్ట్రలో వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కి చెంది, వ్యవసాయం చేసుకొని జీవించే ''కున్భీ'' కాపు కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్‌ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణి ఆనందబాయి తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించి యశ్వంత్‌రావు ఘాట్గేకి ముద్దుగా 'సాహు' అని పేరు పెట్టుకుంటది. మూడేండ్లకే తల్లిని కోల్పోయిన సాహు, 1886 మార్చి 20న తండ్రి మరణంతో 11 ఏండ్లకే తల్లిదండ్రులిద్దరులేని వాడైనాడు. సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణలో జరిగినందున ఆధునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు.

యుక్తవయసు రాగానే 1894 ఏప్రిల్‌ 2న సింహాసనం అధిష్టించాడు సాహు. 1900వ సంవత్సరం అక్టోబర్‌ నెలలో ఒక రోజు సాహు మహారాజ్‌ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం చేయకుండానే వచ్చి సాహు మహారాజ్‌ క్షత్రియ వంశస్తుడు కానందున, ఒక వ్యవసాయం చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈసడింపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక మంత్రాలు చదివి అవమానిస్తాడు. పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందనీ రాజైనంత మాత్రాన, దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు. ఈ సంఘటన సాహు మహారాజ్‌ని మహాత్మ జ్యోతిబాఫూలే సత్యశోధక సమాజ్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైంది. బాస్కర్‌రావు జాదవ్‌ అనే ఉద్యోగిని 'సత్యశోధక్‌ సమాజ్‌' నడిపే బాధ్యతలు అప్పచెప్పి 'మరాఠ దీనబంధు' పేరుతో పత్రికని నడిపించి సత్యశోధక సమాజ తాత్విక దక్పథాన్ని ప్రచారం చేయించిండు. బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్‌ పరిసర ప్రాంతాల్లో వందలా ది వివాహాలు, వేడుకలు సత్యశోధక్‌ సమాజ్‌ పద్ధతిలో జరిగాయి. తను సిం హాసనం అధిష్టించే నాటికి తన రాజ్యం లో మత కర్మలలో మొదలు పరిపాలన లోని అన్ని ఉద్యోగ రంగాలతోపాటు వ్యాపారం, వడ్డీ వ్యాపారంలో కూడా బ్రాహ్మణులే నిండిపోవడం సాహు గమనించాడు. బ్రాహ్మణేతరులని ఉన్న తోద్యోగాల్లోకి తెస్తే తప్ప వారి సామా జిక హోదాలో, జీవితాల్లో మార్పు రాద ని, బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడదని సాహు భావించిండు. వెనుకబ డిన కులాల వారందరికీ స్కూల్స్‌, హాస్ట ల్స్‌ ప్రారంభించి విద్యని ఒక ఉద్యమం గా నడిపిండు. కొల్హాపూర్‌ పట్టణంలో హాస్టల్స్‌ కాలనీనే నిర్మించిండు. 1901 లో జైన హాస్టల్‌, విక్టోరియ మరాఠ హా స్టల్‌, 1906లో ముస్లింలకు, 1907లో వీరశైవ లింగాయత్‌లకు, 1908లో అంటరానివారికి, మరాఠాలకీ 1921లో దర్జీ, నేత కులస్తులకి నామ్‌ దేవ్‌ హాస్టల్‌, విశ్వకర్మలకి సోనార్‌ హాస్టల్స్‌ నిర్మించిండు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమి క పాఠశాలనేర్పరచి అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యనందించిండు. పాఠశాలలకు స్వంత భవనాలు ఏర్పడే వరకు గ్రామాల్లోని అన్ని ఆలయాలను, చావడీలను పాఠశాలలుగా వాడాలనీ, ఏ గ్రామంలో ఏ కులస్తులు మెజారిటీగా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ముస్లింలకు వాళ్ల మాత భాషలోనే పాఠశాలలు ప్రారంభమ య్యాయి. ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే కులపరమైన విద్యాసంస్థల ని రద్దు చేస్తూ అన్ని కులాలు, మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనైనా, విద్యా సంస్థలోనైనా చదువొచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం. వ్యవసా యం ఇతర వత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి. జులై 26, 1902 భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్‌ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది. వెనుకబడిన వర్గాలు అనగా బ్రాహ్మణ, ప్రభు, షెన్వీ, పార్శీ ఇతర అభివద్ధి చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారు అంటరానివారి నుండి అన్ని మతాలలో వెనుకబడినవారు కూడా రిజర్వేషన్‌ కిందికే వస్తారు.
గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్‌ (పాటిల్‌), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేసిండు. ఉపాధ్యాయులు గా కూడా వారసత్వంగా పని చేయడాన్ని రద్దు చేసిండు. టీచర్‌ ట్రైనింగ్‌, పాటిల్‌ ట్రైనింగ్‌ స్కూల్స్‌ పెట్టించిండు. విద్యారంగంలో సాహు కషి కేవలం ఆక్షరాస్యతకే కాకుండా సంగీత, సాహిత్య, నాటక ప్రక్రియలన్నింటిని ప్రోత్సహించిండు. సాహు కాలంలో నాటక రంగం అభి వృద్ధి చెందింది. కొల్హాపూర్‌ జ్జ్ఞాన సమాజ్‌, కిర్లోస్కర్‌ కం పెనీ, స్వదేశ్‌ - హితా చింతక్‌ వంటి నాటక సమాజాల కు ఉదారంగా విరాళాలిచ్చేవాడు. భారత దేశంలో మొట్ట మొదటి మహిళా నాటక సమాజమైన 'శేషశాని స్త్రీ సంగీ త నాటక మండలి' కొల్హాపూర్‌కి చెందినదే. సాహు ఏర్పరిచిన భూమికపై నుండే వి.శాంతారాం, మాస్టర్‌ వినాయక్‌ షిండే లాంటి ప్రసిద్ధులైన సినిమా దర్శకులు కొల్హాపూర్‌ ప్రాంతం నుండి వచ్చిండ్రు.
1919, సెప్టెంబర్‌ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ప్రజలు గానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదు అందితే నేరస్తుల మీద చర్యలు తీసుకుంటారు. నేరస్తులు ఉద్యోగులైతే ఆరు వారాల్లోగా విచారణ జరిపి నేరస్తులని తేలితే ఉద్యో గం నుండి తొలగింపుతోపాటు పెన్షన్‌ కూడా రద్దైపో తుంది. 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరి వ్యవస్థని రద్దు చేస్తూ చట్టం చేశాడు. గ్రామీణ పరిపాలనలో కింది స్థాయి ముఖ్య ఉద్యోగాలైన 'తలాతీ' ( సుంకరి, గ్రామ రెవెన్యూ సహాయకులు) లు గా అస్పశ్యులే ఉంటారు కాబట్టి వాళ్లందరికీ ఉద్యోగ నిర్వహణకు అవసరమైన శిక్షణనిచ్చేందుకు ట్రైనింగ్‌ స్కూల్స్‌ ప్రారంభించిండు. 1919 నవంబర్‌ 6న వెలువడిన చట్టం ప్రకారం అన్ని వత్తుల్లోను, ఉద్యోగాల్లోను ఉండే అస్పశ్యులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ సౌకర్యాన్ని కల్పించిండు.ఆదివాసీ తెగలకు, అంటరాని వారికి సంబంధించి బ్రిటీష్‌ ప్రభుత్వం పెట్టిన 'నేరస్థ కులాల చట్టాన్ని' 1918లో రద్దు చేసిండ్రు. మహర్‌, మాంగ్‌, రామోషీ, బెరాద్‌ లాంటి నేరస్థ కులాలుగా పరిగణింపబడే కులాల ప్రజలు ప్రతి రోజు పోలీస్‌ స్టేషన్‌లో హాజరై సంతకం చేసే అమానుషం ఈ చర్యతో రద్దైంది. అంబేద్కర్‌ ఆస్పశ్యుల హక్కుల సాధన కోసం ఆ పత్రికకి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను తీసుకొని మొదట రూ.2500 ఇవ్వడంతో 'మూక్‌ నాయక్‌' పత్రిక ప్రారంభమైంది.1920 ఏప్రిల్‌ 15న నాసిక్‌లో అంబేద్కర్‌ ఆయన మిత్రులు అంటరాని వారి కోసం ఒక హాస్టల్‌ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు సాహు. 1920లో అంబేద్కర్‌ ఇంగ్లాండ్‌ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. అంబేద్కర్‌ విదేశాల్లో ఉన్నంత కాలం 'మూక్‌ నాయక్‌' పత్రిక నిర్వహణకి ఆర్థిక సహాయం చేసిండు. పితస్వామ్య, కుల, మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలని గ్రహించిన సాహు మొదట తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్‌ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించిండు. సంగీతంలో, చిత్రలేఖనంలో, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇప్పించిండు. కొల్హాపూర్‌ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసిండు. ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు, ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసిండ్రు. కొల్హాపూర్‌ రాజారాం కాలేజీలో బాలికలకు ప్రత్యేక విభాగం ఏర్పరిచిండ్రు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించిండ్రు. 1919 జూన్‌లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది. 1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్దం చేస్తూ చట్టం తెచ్చిన 'కొల్హాపూర్‌ స్పెషల్‌ మ్యారేజీ యాక్ట్‌ - 1918' ప్రకారం ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యులని ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం, స్పెషల్‌ మ్యారేజీ యాక్ట్‌ అప్పుడు దేశంలో సంచలనం సష్టించాయి. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేసిండు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకుంది. 1919 జులైలో వ్యభిచార వత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు. పరిపాలనలో ప్రజలకు అర్థం కాని, ప్రజలకు ఇబ్బంది కల్గించే బ్రాహ్మణ గుమస్తాలు, పట్వారీలు వాడే మోడీ లిపిని పరిపాలన వ్యవహారాల్లో రద్దు చేస్తూ 1917 మార్చిలో నిర్ణయం తీసుకున్నాడు. కరువు వచ్చినపుడు రైతులకు అన్ని రకాల పన్నులను, రుణాలని మాఫీ చేసిండు. అప్పుల కింద రైతుల ఆస్తులని, పనిముట్లనీ, పశువులని బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894లోనే చట్టం చేసిండు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు చేసిండు. రాధానగరి, పనాలా, కరవీర్‌, శిరోల్‌ వంటి ప్రాజెక్ట్‌లని నిర్మించిండు. 'కింగ్‌ ఎడ్వర్ట్‌ అగ్రికల్చరల్‌ ఇనిస్టిట్యూట్‌' ద్వారా రైతులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసిండు.
స్వాతంత్రం గురించి సాహు 1917, డిసెంబర్‌ 27 నాసిక్‌లో జరిగిన సభలో 'ఇపుడున్న కులవ్యవస్థ యధాతథంగా కొనసాగుతూ ఉండేట్లైతే ఒకవేళ మన చేతికి రాజకీయాధికారం వచ్చినప్పటికీ అదొక నియంతత్వ రాజ్యంగానే తయారవుతుంది. స్వరాజ్యం పేరిట ఒక నియంతత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం పదేండ్లపాటు వెనుకబడిన కులాలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి' అని అన్నాడు. ముంబాయిలో కార్మికుల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ 'రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్‌లలో వలే యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి ' అన్నడు. సాహు మహారాజ్‌ మే 6, 1922న మరణించిండు. అతని మరణాంతరం అంత్యక్రియలు సైతం బ్రాహ్మణేతర పురోహితుల చేత జరిగాయి.


- ఇట్యాల వెంకట కిషన్‌
సెల్‌ : 9908198484

రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్‌
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వివాహ వ్యవస్థలో మార్పులు అవసరం
కులం గోడలతో ప్రేమకు సమాధి
మహనీయుల విగ్రహాలకు రక్షణేది?
ఈ ధర్మం ఎవరి రక్షణకు...?
గొల్లకుర్మల గ్రామ బహిష్కరణ
గ్రామ ప్రథమ పౌరుడెవరైనా అగ్రకులస్తులదే పెత్తనం
అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం
శబరిమలలో సమానత్వం లేకుండా స్వేచ్ఛ లేదు
మరో కులదురహంకార హత్య?
కుల దురహంకార పీడ పోవాలి
ఎన్నికల్లో ప్రచారం చేయొద్దని .....
కుటుంబ సమస్య పరిష్కరించమంటే కుల బహిష్కరణ వేటు
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
భూమి కోసం గ్రామ బహిష్కరణ
తండాల్లో ఆడపిల్లలపై వివక్ష
ముస్లిం మహిళలకు తలాక్‌ ఒక శాపం
కన్నప్రేమ కంటే.. కులంపైనే మక్కువా..?
ఇద్దరు ఆడపిల్లలేనని తండ్రి ఆత్మహత్య
'ఆమె అపవిత్రమా?
కన్నకూతురును కాటికి పంపిన కులాంతర ప్రేమపెండ్లి
వాటర్‌ కార్పొరేషన్‌లో కుల వివక్ష
భూ వివాదంలో కుటుంబం వెలివేత
మంత్రాల నెపంతో తల్లిని చంపిన తనయుడు
దళితుల స్ఫూర్తి చిహ్నం భీమా కోరేగాం
అందని ద్రాక్షగా మైనారిటీ హక్కులు
చిరు వ్యాపారులకు చేయూత ఏది?
ఆడ వారికే కుల వృత్తి.. మగవారికి?
అంతమవుతున్న ఆదివాసీల హక్కులు
భూమి నాది.. చావు నీది!
కులోన్మాదంతోనే ప్రమాదం
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

12:37 PM

కాటేసిన పాము.. సజీవంగా ఆసుపత్రికి పట్టుకొచ్చిన పెద్దాయన!

12:34 PM

పంజాబ్ మంత్రి సిద్ధూను దూషిస్తూ పోస్టర్లు..

12:32 PM

నేడు, రేపు రోటరీ మెగా రక్తదాన శిబిరాలు

12:27 PM

బుల్లితెర నటుడిపై కట్నం వేధింపుల కేసు

12:25 PM

నా చావుకు మమతే కారణం..ఐపీఎస్‌ లేఖ

12:19 PM

శాస‌న‌భ‌లో బ‌డ్జె‌ట్ ను ప్రెవేశ‌పెట్టి‌న కేసీఆర్‌

12:12 PM

మరో ఉగ్రదాడి హెచ్చరిక..కాశ్మీర్‌లో హైఅలర్ట్

12:12 PM

ఏపీలో స్కూలు బస్సు బీభత్సం.!

12:09 PM

పుల్వామా అమరులకు తెలంగాణ అసెంబ్లీ ఘన నివాళి

12:04 PM

ప్రధాని మోడీకి సియోల్‌ శాంతి బహుమతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.