Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం మహిళల వెతలు | సామాజిక న్యాయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సామాజిక న్యాయం
  • ➲
  • స్టోరి
  • Mar 11,2020

నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం మహిళల వెతలు

'ఎక్కడ మహిళలు హింసించబడతారో అక్కడ పరస్పర వైషమ్యాలు మత కలహాలూ, ఆర్థిక అసమానతలూ చోటు చేసుకుంటాయి'' అని పురాణాల్లో ఎక్కడా రాయలేదు, ఇప్పుడాపని చేయాలి. ఎందుకంటే అది ఈ దేశపు స్వీయ అనుభవం కదా ఇప్పుడు. భారతదేశంలో గత ఏడాదంతా మహిళలు విపరీతమైన అణచివేతలకు గురి అయ్యారు, ఆ తరువాత పొమ్మనలేక పౌర సత్వపు పొగలు, కిమ్మనకుండా పీల్చే స్తున్న ఆర్థిక సెగలు దేశాన్ని కమ్ము కున్నాయి. కథువ లో 8 ఏళ్ల బాలికను ఎనిమిది మంది దుండగులు గుడి లోనే హారతి నైవేద్యం చేశా రు. కోర్టులో ధర్మ గంటను కోరు కున్న బాలిక దోషులు అంటిం చిన మంట లకు కేకలు పెడుతూ కర్పూరమైంది. ఉత్తరప్రదేశ్‌లో అధికార ఎమ్మెల్యే కు ఒక బాలిక, హైదరాబాదులో ఆకతాయి మూకలకు ఒక డాక్టరు, వరంగల్‌లో పట్టపగలు పనికోసం వెళ్లిన ఒక పడతి... బలైపోయింది కేవలము కామాంధులకు మాత్రమే కాదు నాయనా!, అందమైన అధికార మదాంధులకు. ఇది సత్యం. అందుకేనేమో ఇప్పుడు దేశమంతా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. కనీసం ఇట్లాంటి నమ్మకంతోటైనా మహిళలపై కని కరం చూపిస్తే దేశంలో శాంతి నెలకొంటుందేమో!
ఆచారాలు సాంప్రదాయాలు అత్యధికంగా పాటించబడుతున్న దేశాలన్నింటిలో అబల స్థాయి అద్వానంగా ఉన్నది. ఇట్లాంటి దేశాలలో భారత దేశం ముందువరుసలో ఉన్నది. ఇది ప్రపంచ నివేదికల పలుకు! నాగరికత, చదువు పెరిగినచోట మహిళల స్థితిగతులు కాస్తంత మెరుగైనవి. కానీ రాజ్యం అండతో సాంప్రదాయిక మూకలు రెచ్చిపో తున్నాయి. మన సంస్కృతిని కాపాడాలంటే మహిళ లను చెరబట్టాలన్నది నినాదమైంది! విద్యావంతు లైన మహిళల్లోనే విడాకులు ఎక్కువగా ఉన్నా యని, దానికి కారణం వారి ఉన్నత చదు వులు అని ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులు ఓ పెద్దాయన ఒక సమావేశంలో ప్రసం గించారు. ఇలాంటి ప్రసంగాలతో సంప్రదాయవాదులు మరింత రెచ్చి పోయి మహిళలను అభివృద్ధికి మరింత దూరం చేసే అవకాశం లేదా? నిజానికి కలిసి జీవించలేని చోట విడాకులు తీసుకోవడం అంటే స్వీయ వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడం అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రిపోర్ట్‌ బ్యూరో లెక్కల ప్రకారం 2019 సంవత్సరంలో 18,420 మహిళ లపై అత్యాచార కేసులు నమోదు అయినవి. అందులో పది వేల కేసుల్లో శిక్షలు పడినవి. సదరు పెద్దలకు ఈ విశయాలూ చెప్పాలి.
పేదరికంపై అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్‌ నుంచి మొదలుకొని ఐక్యరాజ్య సమితి నివేదికల వరకూ, సామాజిక ఆర్థిక అసమా నతల్లో మహిళలు అత్యంత ఎక్కువ ప్రభావానికి గురవుతున్నారని మొత్తుకుంటున్నాయి. ఉపాధి వ్యాపార వ్యవహారాలు అన్నింటిలోనూ మహిళలు స్వతహాగా ప్రయత్నం చేస్తున్నారు కానీ పాలనా పరమైన ప్రోత్సాహం లేదు. దేశ జనాభాను మహిళలు పురుషులుగా విభజిస్తే మహిళల పేదరికం పురుషుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. రోజురోజుకు మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. 2019లో ఉపాధిలో విమెన్‌ పార్టి సిపేషన్‌, 37 నుంచి 27 శాతానికి పడిపోయింది. ఆర్థిక స్వతంత్రతలోను మహిళలు వేరొకరిపై ఆధారపడి ఉన్నారు. కట్టుబాట్లు సంప్రదాయాలు పాటించేది మాత్రం మహిళలే ఎక్కువ. కుటుంబ బాంధవ్యాల బాధ్యత మహిళలకే ఎక్కువ. అత్యా చారాలు అణచివేతలు మహిళలపై మాత్రమే. నిరక్షరాస్యతలోను మహిళలదే ఫస్ట్‌ ర్యాంకు. ఆరోగ్య పరంగా చూసినప్పుడు అత్యంత ప్రమాదస్థాయిలో భారతీయ మహిళల స్థితి ఉన్నది. శిశు సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం 2019 సంవత్సరంలో లక్షా అరవై రెండు వేల బాలింత మరణాలు చోటు చేసుకున్నవి.
అయితే ఇప్పుడు భారతీయ మహిళ ముందున్న అత్యంత ప్రమాదకరమైన సమస్య, స్థిరమైన ఉపాధి లేక పోవడం. ప్రైవేటు రంగం, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ దానితో పాటే మొదటగా తొలగించబడుతుంది కూడా మహిళలే. పెళ్లి ప్రెగెన్సీ మహిళల ఉద్యోగా లకు ఎసరు పెట్టేవిగా మారిపోయినవి. ప్రసూతి సెలవులు అడిగారా, రిజర్వు బెంచ్‌ ఎక్కిస్తున్నారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న పురుషుల్లో 45ఏళ్ల వయసు తర్వాత ఉద్యోగ అభద్రత ఏర్పడితే మహిళల్లో 35 ఏళ్లకే ఆ ప్రమాదం వస్తుంది. మహిళలు దీర్ఘకాలం ఒకే ఉద్యోగంలో కొన సాగడం గగనమైపోయింది. ఉపాధి మారినప్పుడల్లా కొత్త జీతం. కొత్త జీతాలెప్పుడూ తక్కువ మొత్తం తోనే మొదలవుతాయిగా! తద్వారా కుటుంబ ప్రణా ళిక మళ్ళీ కొత్తగా వేసు కోవాల్సి వస్తుంది. సమాన పనికి సమాన వేతనం చట్టం 1976 లోనే వచ్చింది. కానీ ఇది కేవలం సంఘటిత రంగంలో తప్ప మరెక్కడా అమలు జరగడం లేదు. అయితే సమాన పనికి సమాన వేతనం అనే కాన్సెప్ట్‌ ఇప్పుడు పురుషులకు కూడా అమలు జరగట్లేదండోరు, ఎందుకంటే, క్యాడర్‌ పేరు ఒకటే ఉంటది కానీ అందులో విధులు వేరేగా ఉంటాయని వేరే వేతనాలు అమలు జేస్తున్నారు మన
ప్రైవేటు/కాంట్రాక్టు యజమానులు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఉద్యోగులెవరూ ఐక్యం కాకూడదని, అడుగులకు మడుగులొత్తే వారికే అందలం అని వేరే చెప్పాలా? అదెలా? మాకూ హక్కులున్నారు అని ఎవరన్నా ప్రశ్నిస్తే, ''ఆ హక్కు తీసేయాలి, కార్మిక చట్టాల సవరణ కావలిప్పుడు'' అని రంకెలేస్తారు. పాపం వేతన జీవులు కదా, కలిసొచ్చిన దానితోటే కాలం వెళ్ళదీస్త్తుంటారు. ఈ సమస్యలు అసంఘటిత రంగంలో మరింత ఎక్కువగా ఉన్నవి. ఇవన్నీ కాదనలేని సత్యాలు. ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ, ఒక ఖచ్చితమైన ప్రణాళికతో లింగ వివక్షతను, సమాన అభివృద్ధిని సాధించడం కోసం తూతూ మంత్రాలు తప్ప చిత్తశుద్ధి లేదు. ఇటీవలే అంత ర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ఘనంగా నిర్వహించు కున్నాయి. మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే ఒక పువ్వు, ఒక పండు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం, పార్టీలు, పబ్బులూ కాదు. పురుషులతో సమానంగా అవకాశాలు ఇస్తామనడం, సమాజ మనుగడకు మూలమైన మహిళలను నిర్లక్షం చేయకుండా ప్రతి చోటా గౌరవించడం ఇందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలి. సకల సౌకర్యాలు, సమానత్వం పొందుతున్న అన్ని రంగాల మహిళలందరూ అవి లేని ఇతర మహిళల కోసం నికరంగా నిలిచి గళమెత్తటం నేటి అవసరం. వివాదాస్పదమైన అన్ని బిల్లులూ పార్లమెంటులో పాస్‌ అవుతున్నాయి, కానీ సర్వామోదం అయిన ''మహిళలకు 33శాతం రిజర్వేషన్ల'' బిల్లుకు మాత్రం సాంప్రదాయపు ముసుగు కప్పుకున్న చెదలు పట్టాయి. ఆ ఛీడలు వీడే సమయం దానంతటదే రాదు. ఇప్పుడున్న సకల హక్కులూ పోరాటాల ప్రతిఫలాలే కానీ దయాదాక్షిణ్యాల విదిలింపులు కావు. రాజ్యపు స్వత్ణ సిద్దమైన నిర్లక్షపు కుప్పలు తొలగి, వెతలు తీర్చే వెలుగు ప్రసరించాలంటే నివురు గప్పిన నెగళ్ళను ఎవరో కదిలించాలి. చల్‌.. మరెందుకు ఆలస్యం, మరో ప్రయత్నం మనమే చేద్దాం.
- జి. తిరుపతయ్య ,
9951300016

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

10:43 AM

మొసలితో ఓ వ్యక్తి చలగాటం.. చివరకు..

10:32 AM

వేలం పాటలో సర్పంచ్ పదవికి రూ.33లక్షలు..

10:24 AM

వైద్యం వికటించి గర్భిణి మృతి..

10:00 AM

అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.