Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పాక్‌తో ఆడకూడదనుకునే హక్కు భారత్‌కు ఉంది : అక్తర్‌
  • అమర జవాన్ల కుటుంబాలకు సచిన్ బాసట
  • పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. భారీగా నీరు వృధాగా..
  • దోమల్ని చంపబోయి ఇల్లు కాల్చుకున్న టీవీ నటి
  • వినూత్నంగా 'తుంబా' టైటిల్‌ ప్రమోషనల్‌ వీడియో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ప్రేక్షకుల్ని మెప్పించిన ఆల్‌రౌండర్‌ | షో | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • షో
  • ➲
  • స్టోరి
  • Mar 05,2018

ప్రేక్షకుల్ని మెప్పించిన ఆల్‌రౌండర్‌

మెల్‌గిబ్సన్‌.. సాహసాలకు మారుపేరు. భిన్న పాత్రలకు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన యాక్షన్‌ హీరో. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా.. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రపంచ ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన ఆల్‌రౌండర్‌. ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని కైవసం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మెల్‌గిబ్సన్‌ గురించి  ఈ వారం అందిస్తున్న
స్పెషల్‌ షో..
సోదరి ప్రోద్భలంతో..
మెల్‌ గిబ్సన్‌ 1956 జనవరి 3న పీక్‌స్కిల్‌లో జన్మించారు. 11 మంది సంతానంలో గిబ్సన్‌ ఆరవ వాడు. తండ్రి హట్టన్‌ గిబ్సన్‌, తల్లి అన్నె పాట్రిసియా. మొదట్నుంచి బాగా ఉన్న కుటుంబం. గిబ్సన్‌ సోదరుడు డోనాల్‌ కూడా నటుడిగా రాణిస్తున్నారు. గిబ్సన్‌కు అలనాటి సింగర్‌ ఎవా మైలాట్‌ గ్రాండ్‌మదర్‌. సిడ్నీలో స్కూల్‌ విద్య పూర్తి చేశారు. గ్రాడ్యూయేట్‌ చేసేటప్పుడు ఆయన మంచి చెఫ్‌ లేదా జరల్నిస్ట్‌ అవ్వాలనుకున్నారు. తన సోదరి ప్రోద్భలంతో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రామటిక్‌ ఆర్ట్‌లో జాయిన్‌ అయ్యారు. ఆ టైమ్‌లో నిడా ప్రొడక్షన్‌ వాళ్ళు నిర్వహించే 'రోమియో అండ్‌ జూలియెట్‌' నాటకంలో పాల్గొన్నారు. 'ది సుల్లివాన్స్‌' టెలివిజన్‌ సిరీస్‌తో నటుడిగా మారి 'ఏ మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీమ్‌', 'డెత్‌ ఆఫ్‌ ఏ సేల్స్‌మ్యాన్‌', 'వెయింటింగ్‌ ఫర్‌ గాడాట్‌', 'లవ్‌ లెటర్స్‌' వంటి టీవీ సిరీస్‌లో నటించి మెప్పించాడు.
మలుపు తిప్పిన మ్యాడ్‌మ్యాక్స్‌..
గిబ్సన్‌ నటించిన మొదటి ఫీచల్‌ ఫిల్మ్‌ 'ఐ నెవర్‌ ప్రామీస్డ్‌ యు ఏ రోజ్‌ గార్డెన్‌'. ఇందులో చిన్న పాత్ర ద్వారా నటుడిగా వెండితెరగేట్రం చేశారు. పూర్తి స్థాయి నటుడిగా 'సమ్మర్‌ సిటీ' (1977) చిత్రంలో నటించారు. దానికి ఆయన అందుకున్న పారితోషికం 400 డాలర్లు. గ్రాడ్యూయేట్‌ చేసే టైమ్‌లోనే సౌతెర్న్‌ ఆస్ట్రేలియన్‌ థియేటర్‌ కంపెనీలో రూపొందే క్లాసికల్‌ 'ఓయిడిపస్‌ అండ్‌ హెన్రీ 4' చిత్రాల్లో నటించారు. రెండేండ్ల తర్వాత వచ్చిన 'మ్యాడ్‌మ్యాక్స్‌' గిబ్సన్‌ కెరీర్‌నే మలుపు తిప్పింది. 1979లో వచ్చిన ఈ సినిమాకు గానూ గిబ్సన్‌ 15000 డాలర్ల రెమ్యూనరేషన్‌ అందుకున్నారు. జార్జ్‌ మిల్లర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెయిన్‌ ఫోర్స్‌ పెట్రోల్‌కు చెందిన వారియర్‌ మ్యాక్స్‌ పాత్రలో గిబ్సన్‌ నటన, రేసింగ్‌ సన్నివేశాలు మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఈ చిత్రం 100 మిలియన్‌లను వసూలు చేసి అప్పటి వరకు ఆస్ట్రేలియాలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అనంతరం చేసిన 'టిమ్‌' చిత్రంలో మానసిక పరివర్తన చెందని యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ చిత్రానికి ఆస్ట్రేలియన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ అవార్డునందుకున్నారు. ఆయన అందుకున్న మొదటి పురస్కారమిది. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన 1981లో వచ్చిన 'గల్లిపోలి' చిత్రంలో స్వాతంత్య్ర భావాలు కలిగిన వ్యక్తిగా నటించి మెప్పించారు. అదే ఏడాది వచ్చిన 'మ్యాడ్‌మ్యాక్‌ 2: ది రోడ్‌ వారియర్‌'లో నటించారు. ఈ చిత్ర విజయం గిబ్సన్‌ను అంతర్జాతీయంగా స్టార్‌ని చేసింది. దర్శకుడు పీటర్‌ వెయిర్‌తో పనిచేసిన రెండవ చిత్రమిది. ఇక గిబ్సన్‌ నటించిన మొదటి రొమాంటిక్‌ చిత్రం 'ది ఇయర్‌ ఆఫ్‌ లివింగ్‌ డేంజరస్లీ'. ఇందులో నటి సిగౌర్నీ వీవర్‌తో కలిసి నటించారు. వీరిద్దరి జంట సిల్వర్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేసింది.
హాలీవుడ్‌ ఎంట్రీ..
1983 వరకు ఆస్ట్రేలియాకే పరిమితమైన గిబ్సన్‌ 1984లో తొలిసారి అమెరికన్‌ చిత్రం 'ది రివర్‌'లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇక 1985లో 'మ్యాడ్‌మ్యాక్స్‌: బిహైండ్‌ థండర్‌డమ్‌' చిత్రంలో నటించారు. ఈ చిత్రాలతో అమెరికన్‌ పాపులర్‌ మ్యాగజైన్‌ 'పీపుల్‌'లో మొదటిసారిగా 'సెక్సీయెస్ట్‌ మ్యాన్‌ ఎలైవ్‌'గా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్లాక్‌బస్టర్‌ 'లెథల్‌ వెపన్‌' చిత్రంలో పోలీస్‌ మార్టిన్‌ రిగ్గ్స్‌గా నటించి అదరగొట్టారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది.
దీంతో ఈ చిత్రానికి సీక్వెల్స్‌ తీయడం ప్రారంభించారు. అలా '1989లో 'లెథల్‌ వెపన్‌ 2', 1992లో 'లెథల్‌ వెపన్‌ 3', 1998లో 'లెథల్‌ వెపన్‌ 4' చిత్రాలొచ్చాయి. ఈ నాలుగు చిత్రాల్లో హీరోగా గిబ్సన్‌, విలన్‌గా డానీ గ్లోవర్‌ నటించారు. ఈ సిరీస్‌తో 'గుడ్‌ పోలీస్‌'గా గిబ్సన్‌కు, 'బ్యాడ్‌ పోలీస్‌'గా గ్లోవర్‌కు పేరొచ్చింది. వీటితోపాటు 'బర్డ్‌ ఆన్‌ ఏ వైర్‌', 'ఎయిర్‌ అమెరికా', 'హామ్‌లెట్‌' చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈ మూడు చిత్రాలు ఒకే ఏడాది 1990లో విడుదల కావడం విశేషం.'ఫరెవర్‌ యంగ్‌' కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ టైమ్‌లో యానిమేషన్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'పోచహౌంటాస్‌'కు వాయిస్‌ను ఇవ్వడంతోపాటు పాట కూడా పాడారు. ఇలా వరుసగా 'పేబ్యాక్‌', 'ది పేట్రియట్‌', 'చికెన్‌ రన్‌', 'వాట్‌ ఉమెన్‌ వాంట్‌', 'ది మిలియన్‌ డాలర్‌ హోటల్‌', 'సైన్‌', బిబిసి మినిసిరీస్‌లో వచ్చిన 'ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌', వియత్నాం వార్‌ నేపథ్యంలో రూపొందిన 'వీ వర్‌ సోల్జర్స్‌'లో నటించారు. వీటిలో ''వి వర్‌ సోల్జర్స్‌', 'సైన్‌' చిత్రాలు గిబ్సన్‌ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. 'ది సింగింగ్‌ డిటెక్టివ్‌', 'గెట్‌ ది గ్రింగో', 'బ్లడ్‌ ఫాదర్‌', 'డాడీ హౌమ్‌ 2' చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేశారు. హీరోగానేకాదు విలన్‌గానూ నటించి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నారు. 'మచెట్‌ కిల్స్‌'లో వోజ్‌ పాత్రలో డాన్నీ ట్రెజోకు ప్రత్యర్థిగా, 'ది ఎక్స్‌పెండబుల్స్‌ 3'లో కాన్రాడ్‌ స్టోన్‌బ్యాంక్‌ పాత్రలో సిల్వెస్టర్‌ స్ట్టాలోన్‌కు ప్రతినాయకుడిగా నటించి తన విలక్షణ నటనను చాటుకున్నారు.
దర్శకుడు, నిర్మాత, రచయిత..
'లెథల్‌ వెపన్‌' చిత్ర విజయంతో గిబ్సన్‌ ప్రొడక్షన్‌ ప్రారంభించారు. బ్రూస్‌ డేవీతో కలిసి 1989లో ఐకాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను ప్రారంభించారు. మొదటి చిత్రంగా 'హామ్‌లెట్‌'ను తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్‌ చిత్రాలతోపాటు భారీ సినిమాలనూ నిర్మించారు. 'ఇమ్మోర్టల్‌ బిలవ్డ్‌', 'ఫరెవర్‌ యంగ్‌', 'ఎయిర్‌ బోర్న్‌', 'ది మ్యాన్‌ వితౌట్‌ ఏ ఫేస్‌', 'మేవ్‌రిక్‌', 'బ్రేవ్‌హార్ట్‌', '187', 'పేబ్యాక్‌', 'వాట్‌ ఉమెన్‌ వాంట్‌', 'వీ వర్‌ సోల్జర్స్‌', 'అపోకలిప్టో' చిత్రాలున్నాయి. ఆయన నిర్మించిన చిత్రాల్లో పలు సపోర్టింగ్‌ రోల్స్‌ కూడా పోషించారు. దాదాపు 60 సినిమాలను, ఆరు టీవీ సిరీస్‌లను నిర్మించారు. దర్శకులు జార్జ్‌ మిల్లర్‌, పీటర్‌ వెయిర్‌, రిచర్డ్‌ డాన్నర్‌ల ప్రభావం మెల్‌ గిబ్సన్‌పై ఎక్కువగా ఉంటుంది. వారిని స్ఫూర్తిగా తీసుకుని 'ది మ్యాన్‌ వితౌట్‌ ఏ ఫేస్‌' చిత్రంతో దర్శకుడిగా మారారు. 1993లో విడుదలైన ఈ చిత్రంతో మంచి ప్రశంలందుకున్నారు. ఓ టీచర్‌కు, సమస్యలున్న విద్యార్థికి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో టీచర్‌ పాత్రలో గిబ్సన్‌ నటించడం విశేషం. ఒక విద్యార్థికి అండగా నిలిచి అతని లైఫ్‌ను తీర్చిదిద్దడమనే కథాంశంతో దర్శకుడు గిబ్సన్‌ మొదటి సినిమాతోనే విమర్శకుల మెప్పు పొందారు. ఆ తర్వాత నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'బ్రేవ్‌హార్ట్‌' చిత్రం సంచలన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌కు చెందిన కింగ్‌ ఎడ్వర్డ్‌-1 ఆగడాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే సైనికుడి కథ నేపథ్యంలో గిబ్సన్‌ ఈ చిత్రాన్ని బయోగ్రఫీ హిస్టారికల్‌ డ్రామాగా అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఒక దర్శకుడు రెండవ చిత్రంగా ఇంత భారీగా, యుద్ధ నేపథ్యంలో సినిమాను రూపొందించడం గొప్ప విషయం. అంతేకాదు ఇందులో తిరుగుబాటు చేసే యోధుడు విలియమ్‌ వాల్లెస్‌ పాత్రలో గిబ్సన్‌ నటన రోమాలు నిక్కపొడిచేలా ఉంటుంది. ఎపిక్‌ వార్‌గా రూపొందిన ఈ సినిమా 65 మిలియన్లతో తెరకెక్కి 210 మిలియన్‌ డాలర్ల భారీ కలెక్షన్లను సాధించింది.
నాలుగు ఆస్కార్‌ అవార్డులను అందుకుంది. 'ది ప్యాషన్‌ ఆఫ్‌ ది క్రిస్ట్‌', 'అపోకలిప్టో', 'హక్సారిడ్జ్‌' చిత్రాలను తెరకెక్కించి ఆల్‌రౌండర్‌గా అనిపించుకున్నారు. ఇందులో జేరూసలేంలో యేసుకు శిలువ వేయబోయే 12 గంటల సమయంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారంగా 'ది ప్యాషన్‌ ఆఫ్‌ క్రిస్ట్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ఉత్కంఠభరితంగా, మనసు పొరల్ని తడిమేలా సాగే ఈ చిత్రంలో దర్శకుడిగా గిబ్సన్‌ టేకింగ్‌ విమర్శకుల మన్ననలను పొందేలా చేసింది. కేవలం 30 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 612 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడం విశేషం. అనేక వివాదాలు ఎదుర్కొనడంతోపాటు అవార్డులనూ దక్కించుకుంది. అంతేకాదు ఈచిత్రంతోనే గిబ్సన్‌ రచయితగా కూడా మారారు. మయాన్‌ రాజ్యంలో అక్కడి పాలకుల మూఢవిశ్వాసాలను, ఇబ్బందులను ఎదురించి పోరాడిన ఓ మయాన్‌ యువకుడి అత్యంత సాహసోపేతమైన పోరాటమే 'అపోకలిప్టో' కథ. ఎపిక్‌ అడ్వెంచరస్‌గా ఈచిత్రం విశేష ఆదరణ పొందింది. మంచికలెక్షన్లను కూడా సాధించింది. విభిన్నమైన స్క్రీన్‌ప్లే, కథలోనూ సహజత్వం గిబ్సన్‌ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. రచయిత, నిర్మాతగా గిబ్సన్‌కు మంచి పేరును తెచ్చిపెట్టిందీ చిత్రం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గాయాలైన సైనికులకు వైద్యం అందించడం, చనిపోయిన వారిని తరలించడం వంటి వాటితో అమెరికా చరిత్రలోనే ఫైరింగ్‌ చేయకుండా మెడల్‌ను సాధించిన ఆర్మీ మెడిక్‌ డెస్మాండ్‌ టి. డాస్‌ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం 'హాక్సారిడ్జ్‌'. సౌండ్‌ మిక్సింగ్‌, ఎడిటింగ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డులు పొందిన ఈ చిత్రానికి గిబ్సన్‌ దర్శకత్వం హైలైట్‌గా నిలిచింది. మంచికలెక్షన్లను సాధించింది. దీంతోపాటు రచయితగా 'గెట్‌ ది గ్రింగో' చిత్రానికి పనిచేశారు. దర్శకుడిగా 'కంప్లీట్‌ సేవేజెస్‌', 'ది బార్బే కోస్ట్‌' వంటి టెలివిజన్‌ సిరీస్‌లను రూపొందించారు.
వ్యక్తిగతం.. వివాదాలమయం..
1980లో డెంటల్‌ నర్స్‌ రాబీన్‌ డెనిస్‌ మూరెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురు హన్నా, ఆరుగురు కుమారులున్నారు. 26 ఏండ్ల తర్వాత విడిపోవడంతో భార్యకు భరణంగా 400 మిలియన్‌ డాలర్లను ఇచ్చారు. హాలీవుడ్‌ చరిత్రలోనే ఇది అత్యధికం. ఆ తర్వాత రష్యన్‌ పియానోయిస్ట్‌ ఓక్సానా గ్రిగోరెయివాతో సహజీవనం చేసినట్టు వార్తలొచ్చాయి. ఆమె కారణంగా వేధింపులకు సంబంధించిన పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. గ్రిగోరియివాను ఏడు లక్షల యాభై వేల డాలర్లు చెల్లించి తన కేసును క్లీయర్‌ చేసుకున్నారు. గిబ్సన్‌ 13ఏండ్ల వయసులోనే మద్యానికి బానిసయ్యారు. మద్యం తాగటం కారణంగా అనేకసార్లు జైలుకెళ్ళారు. అలాగే మద్యం సేవించి సినిమాలు చేసిన రోజులూ ఉన్నాయి. 30 ఏండ్ల వయసులో డిప్రెషన్‌ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టీనేజ్‌ మద్యానికి బానిసలు కాకుండా ఉండటం కోసం ఓ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఒకానొక సందర్భంలో గిబ్సన్‌ స్వలింగ సంపర్కుడు అనే ఆరోపణ హల్‌చల్‌ చేసింది. గిబ్సన్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ రాణించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు, సేవా కార్యక్రమాల కోసం భారీ స్థాయిలో విరాళాలిచ్చారు. 'బ్రేవ్‌హార్ట్‌' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ చిత్రంగా రెండు ఆస్కార్‌ అవార్డులను, ఒక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం దక్కించుకున్నారు. 'హక్సా రిడ్జ్‌' ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. పలు బ్రిటీష్‌, ఆస్ట్రేలియన్‌ ఆకాడమీ పురస్కారాలను అందుకున్నారు.
నట విశ్వరూపానికి ప్రతీకలు
గిబ్సన్‌ ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్రతో ప్రపంచ ప్రేక్షకులకు తన నట విశ్వరూపాన్ని చూపారు. కమర్షియల్‌ హీరోగా, యుద్ధ వీరుడిగా, ప్రేమికుడిగా, బాధ్యత కలిగిన పౌరుడిగా, తండ్రిగా, స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా, తిరుగుబాటు దారుడిగా, వినోదభరిత పాత్రలూ పోషించి తన నటనలోని భిన్న కోణాలను ఆవిష్కరించారు. 'మ్యాడ్‌మ్యాక్స్‌' మోడ్రన్‌ కల్చర్‌ను ప్రతిబింబించే ఈచిత్రం అప్పటి యువతను ఎంతో ప్రభావితం చేసింది. అత్యంత నైపుణ్యం కలిగిన పోలీస్‌గా మ్యాక్స్‌ పాత్రలో గిబ్సన్‌ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'మ్యాడ్‌మ్యాక్స్‌2' సైతం యాక్షన్‌ ఫిల్మ్‌గా ఆకట్టుకుంది. శరణార్థులపై రావింగ్‌ బ్యాండ్‌ టీమ్‌ దాడులను అడ్డుకునేందుకు హైవే పోలీస్‌ ఆఫీసర్‌ మ్యాక్‌ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందులో మరోసారి తనదైన నటనతో గిబ్సన్‌ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 1985లో వచ్చిన 'మ్యాడ్‌మ్యాక్స్‌ 3'లో అవినీతికి వ్యతిరేకంగా మ్యాక్స్‌ పాత్రలో గిబ్సన్‌ ఒంటరిగా చేసే పోరాటం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక 'గెట్‌ ది గ్రింగో' చిత్రంలో క్రిమినల్‌గా గిబ్సన్‌ నటన ఆకట్టుకుంటుంది. అత్యంత సాహసోపేతంగా సాగే ఈచిత్రాన్ని ఆయనే నిర్మించడంతోపాటు రచయితగా పనిచేశారు.
ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయితో లేబర్‌ అయిన గిబ్సన్‌ సాగించే ప్రేమాయణం నేపథ్యంలో రూపొందిన 'టిమ్‌' చిత్రంలో గిబ్సన్‌ లవర్‌బారుగా, మానసికంగా ఇబ్బంది పడే వ్యక్తిగా ఆకట్టుకుంటారు. 'ది ఇయర్‌ ఆఫ్‌ లివింగ్‌ డేంజరస్‌'లో గాఢ ప్రేమికుడిగా, 'ది రివర్‌'లో వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, 'మిస్టర్‌ సోఫెల్‌'లో జైలు నుంచి పారిపోయే ఖైదీగా, క్రైమ్‌ థ్రిల్లర్‌ 'టెక్వైల్‌ సన్‌రైజ్‌'లో డ్రగ్‌ డీలర్‌గా నట విలక్షణతను చూపించారు. 'బర్డ్‌ ఆన్‌ ఏ వైర్‌'లో కామెడీ తరహా పాత్రలో డ్రగ్‌ డీలర్‌గా మెప్పించారు. యాక్షన్‌ కామెడీ 'ఎయిర్‌ అమెరికా'లో ఫైలట్‌గా, షేక్‌స్పియర్‌ ట్రాజెడీ కథ 'హామ్లెట్‌'లో ప్రిన్స్‌గా, 'ఫరెవర్‌ యంగ్‌'లో ఆర్మీ ఎయిర్‌ కాప్స్‌ కెప్టెన్‌గా, ప్రియుడిగా, 'మేవరిక్‌'లో గ్యాంబ్లర్‌గా, క్రైమ్‌ థ్రిల్లర్‌ 'రాన్సమ్‌'లో మల్టీమిలియనీర్‌గా, పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'కాన్‌స్పిరసీ థియరీ'లో టాక్సీ డ్రైవర్‌గా, నియో నాయిర్‌ క్రైమ్‌ చిత్రం 'పేబ్యాక్‌'లో గ్యాంగ్‌స్టర్‌గా, 'ది పేట్రాయిట్‌'లో యుద్ధ వీరుడిగా, 'వాట్‌ ఉమెన్‌ వాంట్‌'లో లవర్‌ బారుగా, 'వి వర్‌ సోల్జర్స్‌'లో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా, యుద్ధ వీరుడిగా మంత్రముగ్దుల్ని చేశారు. ఇక హర్రర్‌ ప్రధాన చిత్రం 'సైన్‌'లో విభిన్న పాత్రలో భయపెట్టించారు. అంతేకాదు మ్యూజికల్‌ కామెడీ 'ది సింగింగ్‌ డిటెక్టివ్‌'లో డాక్టర్‌గా మెప్పించారు. ఇలా 45కుపైగా చిత్రాల్లో నటుడిగా, ఆరు చిత్రాల్లో గెస్ట్‌ రోల్స్‌ చేశారు.

ప్రేక్షకుల్ని మెప్పించిన ఆల్‌రౌండర్‌
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాహసభరిత యాక్షన్‌ సీక్వెన్స్‌కి కేరాఫ్‌
అద్భుత విలక్షణ పాత్రలకు ప్రేక్షకులు ఫిదా
ఆస్కార్‌ బరిలో విజేతలెవరు?
ఐరన్‌ను భర్తీ చేయాలి..!
భారీ అంచనాలతో వస్తున్న క్రేజీ చిత్రాలు
భిన్న ప్రేమకథా చిత్రాల క్రేజీ కథానాయిక
ప్రేక్షకుల్ని ఫిదా చేసిన పాత్రలు
విశ్లేషకుల జోస్యం ఫలించేనా?
వివిధ విభాగాల్లో పోటీ పడుతున్న వారి వివరాలు
అద్భుత పాత్రలకు ప్రేక్షకులు ఫిదా..
రీల్‌ అండ్‌ రియల్‌ లైఫ్‌లోనూ కథానాయికే..
నట విశ్వరూపానికి వెండితెర రూపాలు..
ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన శృంగార నాయిక..
ప్రేక్షకులు మెచ్చిన భిన్న పాత్రలు
భారీ యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌
క్రేజీ యాక్షన్‌ హీరోగా నిలబెట్టిన భిన్న పాత్రలు
చరిత్ర సృష్టించిన పవర్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌
ఐకానిక్‌ పాప్‌ స్టార్‌..
ప్రేక్షకులు మెచ్చిన విలక్షణ కథానాయకుడు
అత్యద్భుత విలక్షణ నటనకు ప్రేక్షకులు ఫిదా
మంత్రముగ్దుల్ని చేసే భిన్న పాత్రలు..
ప్రేక్షకుల్ని మెప్పించిన ఆల్‌రౌండర్‌..
మెస్మరైజ్‌ చేసే విజువల్‌ ట్రీట్‌కి చిరునామా
అత్యద్భుతమైన కెమెరా పనితనానికి ప్రతిబింబాలు
బోల్డ్ అండ్ బ్యూ‌టిపుల్‌
ప్రేక్షకుల్ని ఫిదా చేసిన విలక్షణ పాత్రలు
నేరెళ్ల బాధితుల ఆర్తనాదాలు వినిపించలేదా?
మహిళాశక్తిని అద్భుతంగా ఆవిష్కరించిన దిగ్దర్శకుడు
ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తున్న క్రేజీ కథానాయిక
అత్యద్భుత అభినయానికి ప్రేక్షకులు ఫిదా..
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

09:48 PM

పాక్‌తో ఆడకూడదనుకునే హక్కు భారత్‌కు ఉంది : అక్తర్‌

09:39 PM

అమర జవాన్ల కుటుంబాలకు సచిన్ బాసట

09:37 PM

పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. భారీగా నీరు వృధాగా..

09:26 PM

దోమల్ని చంపబోయి ఇల్లు కాల్చుకున్న టీవీ నటి

09:18 PM

వినూత్నంగా 'తుంబా' టైటిల్‌ ప్రమోషనల్‌ వీడియో

09:11 PM

24 నుంచి పెద్దగట్టు జాతర..

08:47 PM

అమిత్ షాపై మండిపడ్డ మంత్రి కాల్వ

08:44 PM

ప‌దోవ రోజుకి చేరిన పోలీస్ ఫిజిక‌ల్ ప‌రీక్ష‌లు..

08:38 PM

విష గుళికలు తిని యువతి మృతి

08:37 PM

రేపు కాంగ్రెస్ పార్టీకి కోట్ల రాజీనామా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.