Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మరి కాందహార్ మాటేమిటి?: సిద్ధూ
  • రోడ్డెక్కిన కేపీ ఉల్లి రైతులు
  • ప్రజల్లో ఉండేవారికే మా పార్టీ టికెట్లు
  • ముఖాముఖి తలపడితే సమాధానం చెప్పేవాళ్లం
  • ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
అత్యద్భుత విలక్షణ నటనకు ప్రేక్షకులు ఫిదా.. | షో | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • షో
  • ➲
  • స్టోరి
  • Aug 27,2018

అత్యద్భుత విలక్షణ నటనకు ప్రేక్షకులు ఫిదా..

రెనే లియు.. అత్యద్భుత విలక్షణ నటనకి మాత్రమే కేరాఫ్‌ కాదు ఉర్రూతలూగించే సంగీత
తరంగం కూడా. అందం, అద్భుతమైన అభినయంతో వెండితెర ప్రేక్షకులతోపాటు బుల్లి తెర
ప్రేక్షకుల్ని సైతం అలరిస్తున్నారు. భిన్న చిత్రాల రూపకల్పనతో దర్శకురాలిగానూ ఇటీవలే తొలి విజయాన్ని అందుకున్నారు. సంగీత ప్రపంచంలో క్రేజీ రాక్‌స్టార్‌గా తనకంటూ ఓ విశిష్ట గుర్తింపుతో అందరినీ మెస్మరైజ్‌ చేస్తున్నారు. నటిగా, రచయితగా, దర్శకురాలిగా, గాయనిగా, మ్యూజిక్‌ కంపోజర్‌గా దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్న తైవాన్‌ స్టార్‌ హీరోయిన్‌ రెనే లియు గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్‌ షో..
చిన్నప్పట్నుంచీ సంగీతం, నటనపై మక్కువ..
రెనే లియు 1970, జూన్‌ 1న తైవాన్‌లోని తైపీ పట్టణంలో జన్మించారు. చిన్నతనం నుంచే చాలా చురుకైనా, హుషారైన అమ్మాయి. పాఠశాల విద్య అంతా తైపీ పట్టణంలోనే సాగింది. బాల్యం నుంచి సంగీతం, నటన పట్ల ఆసక్తి ఉండేది. హై స్కూల్‌ పూర్తయిన తర్వాత సంగీతంపై దృష్టి సారించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నాక తిరిగి తైవాన్‌కి వచ్చి రాక్‌ మ్యూజిక్‌ టీమ్‌లో జాయిన్‌ అయ్యారు. సింగర్‌గా పర్‌ఫెక్ట్‌ అవ్వడానికి చాలా టైమ్‌ పట్టింది. పాపులర్‌ సింగర్‌, సాంగ్స్‌ కంపోజర్‌ బాబీ చెన్‌ దగ్గర కొన్ని రోజులు అసిస్టెంట్‌గా పనిచేశారు. సంగీతానికి సంబంధించిన చాలా అంశాలను, నైపుణ్యాలను నేర్చుకున్నారు. ఓ రకంగా మ్యూజిక్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేశారు. ఎన్నో రోజుల సాధన అనంతరం 1995లో ఎట్టకేలకు మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేశారు. ఇందులో తనే యాక్ట్‌ చేయడం విశేషం. అయితే మొదట్లో తన మ్యూజిక్‌ కెరీర్‌ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేక పోయింది. దీంతో నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. 1995లోనే 'పియోని పెవిలియన్‌' చిత్రంలో నటించారు. ఇది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అదే ఏడాది ప్రముఖ దర్శకుడు సైల్వియా చాంగ్‌ దర్శకత్వంలో రూపొందిన 'సయో యు' చిత్రంలో కథానాయికగా నటించారు. రెనేకు ఓ రకంగా ఇదే డెబ్యూ చిత్రం. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఆసియా పసిఫిక్‌ మూవీ ఫెస్టివల్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుని గొప్ప చిత్రంగా నిలిచింది.
తొలి చిత్రంతోనే స్టార్‌ హీరోయిన్‌..
తొలిచిత్రం సాధించిన విజయంతో ఓవర్‌నైట్‌ స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు రెనేకి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అదే ఏడాది 'డోంన్ట్‌ క్రై, నాంకింగ్‌' చిత్రంలో నటించారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి రెనేకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన 'టునైట్‌ నోబడీ గోస్‌ హౌమ్‌' చిత్రం విజయం ఆమెను నటిగా మరో మెట్టు ఎక్కించింది. వరుస విజయాల అనంతరం పలు చిత్రాలు పరాజయం చవిచూశాయి. 'యాక్సిడెంటల్‌ లెజెండ్‌', 'థండర్‌ కాప్‌', 'మర్మర్‌ ఆఫ్‌ యూత్‌' చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. 1996లో 'రెడ్‌ పర్సిమ్మాన్‌', 1997లో వచ్చిన 'ఏ చైనీస్‌ ఘోస్ట్‌ స్టోరీ: ది ట్సూయి హార్క్‌ యానిమేషన్‌' చిత్రాలకు వాయిస్‌ ఓవర్‌ అందించారు. 1998లో ఆమె నటించిన కామెడీ డ్రామా చిత్రం 'ది పర్సనల్స్‌' భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ సినిమా కేన్స్‌లోనూ ప్రదర్శితమై అవార్డునందుకుంది. అలాగే అసియా పసిఫిక్‌ అవార్డు రెనేను వరించింది. ఆ తర్వాత చేసిన 'ఫ్లీయింగ్‌ బై నైట్‌', 'మిగ్రేటరీ బర్డ్‌', 'ఎక్స్‌ రోడ్స్‌' చిత్రాలు పరాజయం చెందాయి.
పడి లేచిన కెరటం..
నటిగా ఒడిదుడుగులు ఎదుర్కొంటున్న తరుణంలో 'డబుల్‌ విజన్‌', 'ఏ వరల్డ్‌ వితౌంట్‌ థీవ్స్‌', '20 30 40' చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. వీటితో మళ్ళీ పుంజుకున్నారు. పడి లేచిన కెరటంలా దూసుకుపోయారు. స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. 'ది మాట్రిమోని', 'రన్‌ పాపా రన్‌' చిత్రాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. 'రన్‌ పాపా రన్‌' సినిమా రెనేను అగ్రనటిని చేసింది. 2010 తర్వాత నటించిన 'హాట్‌ సమ్మర్‌ డేస్‌', 'స్పీడ్‌ ఏంజెల్స్‌', 'మేడే 3 డిఎన్‌ఏ', 'లవ్‌ ఇన్‌ స్పేస్‌' చిత్రాల విజయాలతో తైవాన్‌ చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటిగా రెనే ఎదిగారు. ఇందులో 'స్పీడ్‌ ఏంజెల్స్‌', 'మేడే 3 డీఎన్‌ఏ' చైనాకు చెందిన సినిమాలు కావడం విశేషం. చైనాలోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ నటిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ సింగిల్‌', 'స్టార్రీ స్టార్రీ నైట్‌' చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి విలక్షణ నటిగా రాణించారు. గతేడాది 'లవ్‌ ఎడ్యూకేషన్‌' చిత్రంలో గెస్ట్‌గా మెప్పించారు. అత్యంత క్రేజ్‌ ఉన్న నటిగా రాణిస్తున్నారు.
దర్శకురాలిగా తొలిచిత్రంతోనే విజయం..
రెనే సింగర్‌, నటి మాత్రమే కాదు మంచి రైటర్‌ కూడా. పలు చిత్రాలకు స్క్రిప్ట్‌లు కూడా రాశారు. ఈ క్రమంలో ఈ ఏడాది దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరిక్షించుకునే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు దశాబ్దాల సినీ అనుభవంతో రొమాంటిక్‌ డ్రామా 'అజ్‌ అండ్‌ థెమ్‌' చిత్రాన్ని రూపొందించారు. ఏప్రిల్‌లో విడుదలైన సినిమా మంచి విజయాన్ని సాధించింది. దర్శకురాలిగా రెనే మంచి ప్రశంసలు అందుకున్నారు. సినిమాల్లోనే కాదు టెలివిజన్స్‌లోనూ మెప్పించారు. 'అటం రాప్పోడి', 'పింక్‌ లేడీ', 'సన్‌సెట్‌ ఇన్‌ ఫోర్బిడెన్‌ సిటీ', 'క్రాకర్‌', 'డైలీ గ్రోయింగ్‌', 'హాట్‌ లేడీస్‌', 'డబుల్‌ సౌండింగ్‌ కన్నాన్‌', 'నూ ఏజ్‌ ఆఫ్‌ మ్యారేజ్‌', 'హి అండ్‌ హిజ్‌ సన్స్‌' వంటి తదితర వాటితో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. సినిమా రంగంతోపాటు, టీవీ రంగంలోనూ అవార్డులందుకున్న మొదటి నటిగా రెనే పేరు తెచ్చుకున్నారు.

గాయనిగా శ్రోతలను, అందం, అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను అలరించిన రెనే లియు నటించిన కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. రెనే లియు అత్యద్భుతమైన విలక్షణ నటి అని చెప్పేందుకు ఈ చిత్రాలు నిదర్శనంగా నిలిచాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
సయో యు
సయో యు, జియాంగ్‌ వి ప్రేమికులు. సయో స్వీట్‌ షాప్‌లో పనిచేస్తుంటుంది. జియాంగ్‌ విద్యార్థి. ఫిష్‌ మార్కెట్‌లో వర్క్‌ చేసుంటాడు. వీరిద్దరు అమెరికాలో సెటిల్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. అందుకు గ్రీన్‌ కార్డ్‌ కావాలి. పదివేల డాలర్లు ఇచ్చిన ఓ ఇటాలియన్‌ అమెరికన్‌ మారియోను కలుస్తారు. గ్రీన్‌ కార్డ్‌ కోసం మారియోను పెళ్ళి చేసుకునేందుకు సయో సిద్ధమవుతుంది. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే 'సయో యు'. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రానికి సైల్వియా చాంగ్‌ దర్శకత్వం వహించారు. రెనే లియు హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ సినిమాలో సయో యు పాత్రలో అద్భుత నటనతో మెప్పించారు.
డోంన్ట్‌ క్రై, నాంకింగ్‌
1937 జపనీస్‌ సినో యుద్ధ సమయంలో చైనీస్‌ డాక్టర్‌, ప్రెగెంట్‌తో ఉన్న అతని జపనీస్‌ భార్య, వారి ఇద్దరు పిల్లలు షాంగై నుంచి నాంజింగ్‌కు షెల్టర్‌ కోసం బయలు దేరుతారు. కానీ అక్కడ జపనీస్‌ ఆర్మీ వల్ల డాక్టర్‌ భార్య అత్యాచారానికి గురై చనిపోతుంది. అంత్యంత హృదయ విదారకమైన ఈ యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు వు జినియు ఈ హిస్టారికల్‌ వార్‌ 'డోంన్ట్‌ క్రై, నాంకింగ్‌' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో గర్భవతిగా ఉన్న భార్య పాత్రలో రెనే లియు నటన ఆద్యంతం ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేస్తుంది. ఈ సినిమాతో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది.
టునైట్‌ నోబడీ గోస్‌ హోమ్‌
చెన్‌ ఫ్యామిలీలోని అక్రమ సంబంధాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి. భార్యభర్తల
మధ్య వచ్చిన సంఘర్షణ ఏంటనే ఇతివృత్తంతో రూపొందిన 'టునైట్‌ నోబడీ గోస్‌ హౌమ్‌' చిత్రంలో రెనే భార్య పాత్రలో అందం, అభినయంతో అలరించారు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల నటన ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా రెనే తనదైన కామెడీతో అలరించారు. 'సయో యు' తర్వాత సైల్వియా చాంగ్‌ దర్శకత్వంలో నటించిన రెండవ చిత్రమిది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి రెనేను నటిగా మరో స్థాయికి తీసుకెళ్ళింది.
ది పర్సనల్‌
ఓ దంతవైద్యురాలు చాలా అందంగా అందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది. అంతేకాదు తెలివైన మహిళ కూడా. తను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం
ఓ పేపర్‌ యాడ్‌ ఇస్తుంది. అది చూసి చాలా మంచి యువకులు ఆమె దగ్గరకు వస్తారు. మరి ఆమె ఎవరిని సెలక్ట్‌ చేసుకుంది?, ఆశ, నిరాశ, నిస్పృహలతో ఉన్న యువకుల
నెక్ట్స్‌ రియాక్షన్‌ ఏంటనేది 'ది పర్సనల్‌'లో ఆసక్తికరం. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో దంతవైద్యురాలిగా రెనే నటన నవ్వులు పంచుతుంది.
డబుల్‌ విజన్‌
తైవాన్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఓ రహస్య ఫంగస్‌ ద్వారా ఈ మరణాలు చోటు చేసుకుంటాయి. ఆ ఫంగస్‌ను ఓ వ్యక్తి కలిగి ఉంటాడు. దీంతో ఈ కేసును చేధించే పనిని తమ ఇంటి సమస్యలతో బాధపడుతున్న ఓ ఎఫ్‌బీఐ జంటకు అప్పగిస్తారు. వారు ఈ కేసును ఎలా చేధించారనేది సినిమా. హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందిన ఈ చిత్రంలో ఎఫ్‌బీఐ అధికారులుగా టోనీ లియుంగ్‌, రెనే లియు నటించారు. అప్పటి వరకు కామెడీ పాత్రలతో అలరించిన రెనే ఈ చిత్రంలో ఎఫ్‌బీఐ ఏంజెట్‌గా సీరియస్‌ పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. ఈ చిత్రం రెనే లియు కెరీర్‌ను ఓ కీలక మలుపు తిప్పింది. విలక్షణ నటిగా ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.
ఏ వరల్డ్‌ వితౌట్‌ థీవ్స్‌
ఓ కుర్రాడు తాను పోగుచేసుకున్న డబ్బుతో ట్రైన్‌లో ప్రయాణిస్తుంటాడు.
ఈ సమాజంలో దొంగలు ఎవరూ లేరనేది అతని గట్టి నమ్మకం. అంతేకాదు అందరినీ నమ్ముతాడు. కానీ అతని దగ్గర డబ్బులుండటంతో చాలా మంది దొంగలు అతన్ని టార్గెట్‌ చేస్తారు. అందులో ఓ మానవత్వం కలిగిన దొంగ జంట(ప్రేమికులు) కూడా ఉంటుంది. మరి ఇతర దొంగల నుంచి ఆ కుర్రాడిని ఈ జంట ఎలా కాపాడిందనేది 'ఏ వరల్డ్‌ వితౌట్‌ థీవ్స్‌' సినిమా కథ. ఈ చైనీస్‌ యాక్షన్‌ డ్రామా చిత్రం విధి, దొంగతనం, నమ్మకం వంటి అంశాలను చర్చించింది. ఇందులో మంచి దొంగల జంటగా ఆండీ లాయు, రెనే లియు నటించారు. వీరిద్దరు మధ్య వచ్చే కామెడీ, రొమాన్స్‌ ఆకట్టుకుంటుంది.
20: 30: 40
ముగ్గురు అమ్మాయిలు మూడు విభిన్న స్టేజెస్‌లో వారి జీవితాన్ని తెలిపే చిత్రం '20:30:40'. విభిన్న వయస్సుల్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, మనుగడ కోసం ఏం చేశారనే అంశాలకు ఈ చిత్రం ప్రతిబింబంగా నిలిచింది. సైల్వియా చాంగ్‌ దర్శకత్వంలో రెనే నటించిన మూడో చిత్రమిది. మ్యూజికల్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో రెనే నటన, మనుగడ సాధించేందుకు ఆమె చేసే పోరాటం ఆద్యంతం కట్టిపడేస్తుంది. విభిన్న తరహా శక్తివంతమైన పాత్రలో ఆలరించారామె.
రన్‌ పాపా రన్‌..
చైనాలో క్రైమ్‌ సామ్రాజ్యానికి టైగర్‌ లీ రారాజుగా ఉంటాడు. అతనికి ఓ ముద్దుల కూతురు ఉంటుంది. ఆమెకు తన విషయాలు తెలియకుండా పెంచుతాడు. అయితే ఆమె పెరిగే కొద్ది ఎక్కడ తన అసలు రూపం బయటపడుతుందో, తనని ఎక్కడ ద్వేషిస్తుందో అని భయపడతాడు. నేర జీవితానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే 'రన్‌ పాపా రన్‌' కథాంశం. సైల్వియా చాంగ్‌ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమిది. ఈ దర్శకుడితో రెనేకు నాల్గవ చిత్రమిది. ఇందులో టైగర్‌ లీ భార్య పాత్రలో రెనే లియు నటించారు. ఇల్లాలిగా డిఫరెంట్‌ పాత్రలో రెనే నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
లవ్‌ ఇన్‌ స్పేస్‌..
తల్లి, ముగ్గురు కూతుళ్ల ప్రేమలోని స్ట్రగుల్స్‌ను తెలిపే చిత్రమిది. అందరు తమ ప్రేమలో సక్సెస్‌ అవుతారు. వాళ్ళు బీజింగ్‌లో, సిడ్నీలోనే కాదు చివరికి చంద్రుడిపైన కూడా తమ ప్రేమ కథలను కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఎలాంటి అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయనేది 'లవ్‌ ఇన్‌ స్పేస్‌'లో ఆసక్తికరం. ఆద్యంతం రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో పెద్ద కూతురిగా రెనే అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.
ఇక వీటితోపాటు కార్‌ రేసింగ్‌ నేపథ్యంలో రూపొందిన చైనీస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పీడ్‌ ఏంజెల్స్‌' చిత్రంలో అత్యంత టాప్‌ రేసర్‌గా రెనే తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించి, తనదైన యాక్షన్‌తో అలరించారు. రొమాంటిక్‌ కామెడీ 'హాట్‌ సమ్మర్‌ డేస్‌' చిత్రంలో కీలక పాత్రలో మెరిశారు. ఊహాజనితమైన ప్రపంచంలో విహరించే 12ఏండ్ల కుర్రాడి జీవితాన్ని, అతని సంఘర్షణను ప్రతిబింబించే కథాంశంతో రూపొందిన 'స్టార్రీ స్టార్రీ నైట్‌' చిత్రంలో కుర్రాడి తల్లిగా, ఎప్పుడూ భర్తతో గొడవ పడే భార్యగా రెనే నటన ఆద్యంతం ప్రేక్షకుల మనసు పొరల్ని స్పృశిస్తుంది.

సంగీత సంచలనం..
నటిగా, దర్శకురాలిగానే కాకుండా గాయకురాలిగా రెనే లియు అనేక ఆల్బమ్స్‌ చేశారు. 'లవ్‌ యు మోర్‌ అండ్‌ మోర్‌', 'వెయిటింగ్‌ ఫర్‌ యు' ఆల్బమ్స్‌
రాక్‌ స్టార్‌గా, సింగర్‌గా, మ్యూజిక్‌ కంపోజర్‌గా రెనేను పీక్‌ లెవల్‌కి తీసుకెళ్ళాయి. దాదాపు 20 ఆల్బమ్స్‌లో ఆమె పాడటంతోపాటు నటించి అలరించారు. 1995 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సోలోగా వందలాది మ్యూజిక్‌ షోస్‌ చేసి సింగర్‌గానూ పాపులర్‌ అయ్యారు. నటిగా ఎంతగా పాపులర్‌ అయ్యారో, సింగర్‌గా అంత కంటే ఎక్కువ క్రేజ్‌ దక్కించుకున్నారు. 'బ్యూటీ అండ్‌ సాడ్‌నెస్‌', 'రైనీ సీజన్‌', 'వాక్‌ ఎరౌండ్‌', 'లవ్‌ యు సో మచ్‌', 'ఐ విల్‌ వెయిట్‌ ఫర్‌యు', 'టైమ్‌', 'గెయిన్‌', 'లవ్‌ అండ్‌ ది సిటీ', 'రాక్‌ రికార్డ్స్‌ హాంకాంగ్‌ టెన్త్‌ అనివర్సరీ', 'మై ఫెయిల్యూర్స్‌ అండ్‌ గ్లోరీ', 'వన్‌ హోల్‌ నైట్‌', 'రెనే','ఐయామ్‌ ఫైన్‌', 'టుగెదర్‌', 'ఫర్‌ ది లవ్డ్‌', 'విష్‌యు వెల్‌', '20 30 40', 'హ్యాపీ బర్త్‌డే', 'రన్‌ పాపా రన్‌' వంటి తదితర ఆల్బమ్స్‌ రెనేను సంగీత సంచలనానికి కేరాఫ్‌ చేసింది.
ప్రతిభకు దక్కిన పురస్కారాలు..
రెనే ప్రతిభకు అనేక అరుదైన పురస్కారాలు లభించాయి. 'సయో యు' చిత్రానికి ఆసియా పసిఫిక్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డు, 'ది పర్సనల్స్‌' చిత్రానికి గోల్డెన్‌ హార్స్‌ అవార్డు, తైపీ ఫిల్మ్‌ అవార్డు, ఆసియా పసిఫిక్‌ అవార్డు, 'డైలీ గ్రోయింగ్‌' చిత్రానికి గోల్డెన్‌ బెల్‌ అవార్డు, 'డబుల్‌ విజన్‌' చిత్రానికి హాంకాంగ్‌ ఫిల్మ్‌ అవార్డు, 'ఎ వరల్డ్‌ వితౌంట్‌ థీవ్స్‌' చిత్రానికి గోల్డెన్‌ బహినియా అవార్డు, చైనీస్‌ ఫిల్మ్‌ మీడియా అవార్డు, హండ్రెడ్‌ ఫ్లవర్స్‌ అవార్డులు ఆమెను వరించాయి. రెనే లియు 2011లో జాంగ్‌ షీని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడున్నారు.

అత్యద్భుత విలక్షణ నటనకు ప్రేక్షకులు ఫిదా..
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాహసభరిత యాక్షన్‌ సీక్వెన్స్‌కి కేరాఫ్‌
అద్భుత విలక్షణ పాత్రలకు ప్రేక్షకులు ఫిదా
ఆస్కార్‌ బరిలో విజేతలెవరు?
ఐరన్‌ను భర్తీ చేయాలి..!
భారీ అంచనాలతో వస్తున్న క్రేజీ చిత్రాలు
భిన్న ప్రేమకథా చిత్రాల క్రేజీ కథానాయిక
ప్రేక్షకుల్ని ఫిదా చేసిన పాత్రలు
విశ్లేషకుల జోస్యం ఫలించేనా?
వివిధ విభాగాల్లో పోటీ పడుతున్న వారి వివరాలు
అద్భుత పాత్రలకు ప్రేక్షకులు ఫిదా..
రీల్‌ అండ్‌ రియల్‌ లైఫ్‌లోనూ కథానాయికే..
నట విశ్వరూపానికి వెండితెర రూపాలు..
ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన శృంగార నాయిక..
ప్రేక్షకులు మెచ్చిన భిన్న పాత్రలు
భారీ యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌
క్రేజీ యాక్షన్‌ హీరోగా నిలబెట్టిన భిన్న పాత్రలు
చరిత్ర సృష్టించిన పవర్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌
ఐకానిక్‌ పాప్‌ స్టార్‌..
ప్రేక్షకులు మెచ్చిన విలక్షణ కథానాయకుడు
అత్యద్భుత విలక్షణ నటనకు ప్రేక్షకులు ఫిదా
మంత్రముగ్దుల్ని చేసే భిన్న పాత్రలు..
ప్రేక్షకుల్ని మెప్పించిన ఆల్‌రౌండర్‌..
మెస్మరైజ్‌ చేసే విజువల్‌ ట్రీట్‌కి చిరునామా
అత్యద్భుతమైన కెమెరా పనితనానికి ప్రతిబింబాలు
బోల్డ్ అండ్ బ్యూ‌టిపుల్‌
ప్రేక్షకుల్ని ఫిదా చేసిన విలక్షణ పాత్రలు
నేరెళ్ల బాధితుల ఆర్తనాదాలు వినిపించలేదా?
మహిళాశక్తిని అద్భుతంగా ఆవిష్కరించిన దిగ్దర్శకుడు
ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తున్న క్రేజీ కథానాయిక
అత్యద్భుత అభినయానికి ప్రేక్షకులు ఫిదా..
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

07:42 PM

మరి కాందహార్ మాటేమిటి?: సిద్ధూ

07:21 PM

రోడ్డెక్కిన కేపీ ఉల్లి రైతులు

07:18 PM

ప్రజల్లో ఉండేవారికే మా పార్టీ టికెట్లు

07:02 PM

ముఖాముఖి తలపడితే సమాధానం చెప్పేవాళ్లం

06:53 PM

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

06:40 PM

కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి: నారాయణస్వామి

06:26 PM

విజయవాడ చేరుకున్న డిల్లీ సీఎం కేజ్రీవాల్‌

06:15 PM

'ఆర్ఆర్ఆర్' .. 'బాహుబలి' కి ఏమాత్రం తీసిపోదు: రాజమౌళి

06:02 PM

చనిపోయిన జవాన్లకు పూర్తి ఇన్సూరెన్స్ విడుదల ఎస్‌బీఐ..

05:53 PM

50 మొక్కలు నాటితేనే ముందస్తు బెయిల్...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.