Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీలో మీరు ఊహించి ఎరుగనటువంటి ప్రతిభా సామ ర్థ్యాలున్నాయి. అయితే ఆ సామర్థ్యాన్ని అందరూ గుర్తించలేక పోతున్నారు. ఏ ఉత్తమ పనైనా చేసేందుకు కావలసిన సత్తా తమలో లేదని కొంత మంది సరిపెట్టుకుంటారు. ప్రతిభ కొంత మందికి మాత్రమే పరిమితమని భావిస్తారు. అది వాస్తవం కాదు. అంతేకాకుండా తమలో ప్రతిభా సామర్థ్యాలు చాలా స్వల్ప స్థాయిలో ఉన్నాయని భావిస్తారు. మనం ప్రతిభా వంతులమని మనకు మనం నిర్ణయించుకోవడం ద్వారా ప్రయో జనమేమిటని మీరు భావించవచ్చు. ఈ సందర్భంలోనే మానసిక నిపుణులు చెబుతున్న ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తా వించాలి. మిత్రమా.. మనందరిలోనూ మనకు తెలియన టువంటి అనంతమైన సామర్థ్యం దాగి ఉంది. ఆ సామర్థ్యాన్నం తటినీ మనం ఉపయోగించుకోవడంలేదు. మన సామర్థ్యంలో పదో వంతు మాత్రమే వినియోగించుకుం టున్నాం. మన పరిమితి ఇంతేనన్న నిర్ణయానికి వస్తున్నాం. అనగా మీరు మీ ప్రతిభా సంపత్తినంతటినీ వినియోగించు కోలేమన్న నిర్ణయానికి అచేతనంగా వచ్చేస్తున్నారు. ఉదాహ రణకు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదగగల అవకాశాలు లేక పోవచ్చు. అయితే మీరు అక్కడే ఆగిపోకూడదు. మీరు చేయదగిన ఉద్యోగం మరొకటి లభిస్తుందేమోనని ఎప్పుడైనా అన్వేషంచారా? లేదా ఈ ఉద్యోగం చేస్తూనే మీ సామర్థ్యాన్ని మరింతగా, మరో రంగంలో వికసింపజేసుకునే అవకాశాల కోసం పరిశీలించారా? ప్రస్తుతం మీరు మామూలు ఉద్యోగం చేస్తుండవచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తుల కున్న ప్రతిభా సామర్థ్యాలు మీలోనూ దాగి ఉన్నాయి. మిత్రమా..మీలోని సత్తాను సంపూర్ణంగా గుర్తించండి. దానిని ఉపయోగించు కునేందుకు ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. ప్రయత్నం చేయడమంటే ఎలా ఉంటుందోనని ప్రయోగం చేయడం కాదు. ఎలాగైనా లక్ష్యాన్ని సాధించలన్నా పట్టుదలతో మన ప్రయత్నాన్ని కొనసాగించాలి.
ఉదాహరణకు జార్జ్ స్టీఫెన్‌సన్ ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి 17 ఏండ్లకు ఎంతో ప్రసిద్ధమైన రైలింజన్ కనుగొన్నాడు. తన ప్రయత్నంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిగా పని చేశాడు. తాను అనుకున్నది సాధించాడు. అనేక మంది వ్యక్తులు తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరినప్పటికీ ఆయన చిరునవ్వుతో తిరస్కరించాడు. ఈ విధంగా తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధించిన వ్యక్తులు మన మధ్యనే ఉన్నారు. ఆ విజయాలన్నింటి వెనుకా ఏండ్ల తరబడి సాథించిన కృషి, వెనుకంజ వేయని పట్టుదల ఉన్నాయి. అందుకే మీరు ఏదైనా పని ఎంచుకునేటపుడు ఆ పని మీ అభిలాషకు, ఆసక్తికి అనుగుణంగా ఉందో లేదో నిర్ణయించు కొండి. అది లక్ష్యానికి చేరువగా ఉందో సరి చూసుకొండి. ముందుగా ప్రతి ఒక్కరికీ లక్ష్య సాధనలో ఏ పరిస్థితిలోనూ వెనకంజ వేయననే స్థిరమైన పట్టుదల ఉండాలి. ఎలాంటి అవాంతరాలెదురైనా తాము సాగిస్తున్న కృషిని విడనాడని కృత నిశ్చయం ఉండాలి. మీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక, దాని సాధనలో మీకు అనేక అడ్డంకు లెదురవుతాయి. వాటిని అధిగమించగల ఉత్సాహాన్ని సామ ర్థ్యాన్ని మీరు మీ మదిలో పదిలపర్చుకోవాలి.ఎలాంటి ఒత్తిడి నైనా తట్టుకునే టట్టు మీ మనసును సిద్ధ పర్చుకోవాలి. మీలో ఉత్సాహం ఉన్నంత వరకు మీ మానసిక శక్తి తరిగిపోదు. మీరు మానసికంగా అలసటకు లోనుకారు. ఈ ప్రపంచంలో విజయ బావుటా నెగురవేసిన విజేతల జీవితాలు ఒక సారి పరిశీ లించండి. అపుడు మీకు అనేక విషయాలు అవగతమవుతాయి. తమ లక్ష్య సాధనలో వారు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు. వాటినెలా అధిగమించారు. సంక్షోభ సమయాల్లో ఎలా ప్రవర్తించారు. ఆ సమయంలో వారి మానసిక స్థితి ఎలా ఉంది? అనే విషయాలు మీరు అధ్యయనం చేస్తే, మీరు కూడా అలాంటి స్థితిని ఎదుర్కొన్న సమయంలో వారి విలువైన అనుభవం మీకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. సంక్షోభ సమయాలను, కష్టాలను, కన్నీళ్లను, అడ్డంకులను దాటుకుని ముందుకు వెళ్లేందుకు అవి ఉపయోగ పడతాయి. కొంత మంది వ్యక్తులు తమ లక్ష్య సాధనకు ఎంతో కృషి చేస్తారు. అయితే తమ కృషిలో ఏకాగ్రత కనబరచ నందువల్ల సరైనా ఫలితాలు పొందలేరు. మనం ఏ పని సాధించలన్నా, మనకు మొదట కావలసింది ఏకాగ్రత. లక్ష్య సాధనపై అకుంఠిత దీక్ష, పట్టుదల. మిమ్మల్ని నిరుత్సాహ పర్చే వారికి ఒకింత దూరంగా ఉండాలి. మీ లక్ష్యాన్ని ప్రోత్సహించే వారికి, సహకారం అందించే వారికి సన్నిహితంగా ఉండాలి. ప్రస్తుతం మీ లక్ష్యాన్ని చూసి, గేలి చేసిన వారిపై ఎలాంటి కోపాన్ని ప్రదర్శించవద్దు. ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారు, నిరుత్సాహపర్చిన మీరు విజయం సాధించిన తరువాత తిరిగి అభినందనలు తెలియజేస్తారు. అలాంటి అపురూపమైన సందర్భం కోసం వేచి చూడండి. మీ లక్ష్య సాధన పట్ల తిరుగులేని విశ్వాసాన్ని కలిగి ఉండండి.
- జి గంగాధర్ సిర్ప, 8919668843