Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అడవిని కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్కచేయని ''పియరి'' | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 20,2020

అడవిని కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్కచేయని ''పియరి''

స్త్రీ కావచ్చు, భూమి కావచ్చు, ఆడవి కావచ్చు వీటిని నాశనం చేయడానికి, జీవం లేకుండా చేయడానికే మనవ జాతి ప్రస్తుతం పూనుకుంది. ఆడ బిడ్డలను పుట్టకముందే చిదిమేస్తున్నారు, భూమిని ఇష్టం వచ్చినట్లు దోచుకుటున్నారు, అడవిని కసి తీరా నరికేస్తున్నారు. ఇవి మూడు రాబోయే తరాల వినాశనానికే దారి తీస్తాయి అన్నది అర్థం. కాని అహంకార సమాజానికి వారు చేసే తప్పిదాలను చెప్పే ప్రయత్నం చేసిన ఒక చిన్న సినిమా ఒరియా భాషలో వచ్చిన ''జంగల్‌ డాకుచే ఆ''. పెద్ద సినిమాకున్న హంగులేమీ దీనికి లేవు. కేవలం గంట మాత్రమే నిడివి ఉన్న ఈ ఒరియా చిత్రం గొప్ప నిజాయితీతో తీసిన సినిమా. అందుకే ఈ సినిమాని ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాలి. ''జంగల్‌ డాకుచే ఆ'' అంటే అడవి పిలుస్తుంది రా... ఈ సినిమాలో కథానాయిక పియరి. ఆఖరున పియరి ఊరివారిని ఎదిరిస్తూ స్త్రీ, భూమి, అడవికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, అసలు ఆ విషయాన్ని ప్రస్తావించిన విధానమే ఈ సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. మొత్తం సినిమా టీం చెప్పాలనుకునే విషయాన్ని ఏ కతిమత్వానికి లొంగకుండా చెప్పిన తీరు ఈ చిన్న సినిమాకు గొప్ప విలువను ఆపాదిస్తుంది. అందుకే ఒక గొప్ప స్త్రీ పాత్రగా పియరిని ఈ వారం చర్చించుకుందాం.
ఒక అడవి మధ్య చిన్న ఊరు. అందులో నేత్రా అనే ఒక రైతు. అడవిని తల్లిగా భావించి జీవించే పేద రైతు ఇతను. తన తాతలు నాటిన అడవిని సంరక్షించడం తన భాద్యతగా భావిస్తుంటాడు. కాని మారుతున్న ఊరు భావజాలం అతన్ని ఒంటరిని చేస్తుంది. ఆ ఊరి వారందరూ ఏదో విధంగా అడవి మీద ఆధారపడి బతుకుతున్న వారే. కాని అడవిపై ప్రేమలో అందరూ ఒక్కటిగా ఉండదు. ఆ ఊరిలో సాధు అనే ఒక వ్యక్తి మరణిస్తాడు. అతన్ని పులి చంపిందని ప్రచారం జరుగుతుంది. పులి గోరు గుర్తులు సాధు శవంపై కనిపిస్తాయి. కాని ఆ విషయాన్ని నేత్ర నమ్మడు. ఎప్పుడో తాతల సమయంలో తప్ప పులి అడవిలో కనిపించడం ఇప్పటిదాకా జరగలేదని, ఇప్పుడు హఠాత్తుగా పులి మనిషిని చంపడం ఏంటని అతని వాదన. పైగా తాము పూజించే అమ్మవారి వాహనం పులి అని అది తమను ఏం చేయదని అతని నమ్మకం. అందుకే ఊరంతా అడవి వైపుకి వెళ్ళడానికి ఇష్టపడకపోయినా అతను అడవిలోకి వెళ్తాడు. దారిలో ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అతన్ని అటకాయించడంతో పులి పేరుతో ఏదో మోసం జరుగుతుందని నేత్రకు అర్థం అవుతుంది. ఊరందరూ అతన్ని అడవిలోకి వెళ్ళవద్దు అన్నందుకు అతను వారితో వైరం పెట్టుకుంటాడు. కూతురు పియరీతో మాత్రం తనకేదైనా జరిగితే అడవిని సంరక్షించే భాధ్యత తను తీసుకోవాలని మాట అడుగుతాడు. కూతురు ఆ భాధ్యత తీసుకుంటుందని కూడా అతని నమ్మకం. అతనికి తాను అడవిని సంరక్షిస్తానని పియరి మాట ఇస్తుంది.
ఆ ఊరి పెద్ద చిన్న చిన్న రైతులకు అప్పు ఇస్తూ ఉంటాడు. అతన్ని అడవిని నకడం వలన చాలా సంపాదించవచ్చని ఊరి వారితో ఆ సంగతి చెప్పి కొంత మందిని ఆ పనికి ఒప్పించమని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ చెబుతాడు. దానికి కొంత డబ్బు కూడా ముట్టజెబుతాడు. డబ్బు మోహంతో నిజంగానే అడవిని నరుకుదాం అని, అలా పులి నుండి కూడా తమను తాము కాపాడుకోవచ్చని ఊరి పెద్ద కొందరు గ్రామస్తులకు చెబుతారు. తమ పేదరికం అడవిని నరకడంతో పోతుందని విని వారు అందుకు అంగీకరిస్తారు. కాని నేత్ర ఆ పనికి ఒప్పుకోడు. తన ప్రాణాలు ఇచ్చయినా అడవిని కాపాడుకుంటానని, బతకడానికి తల్లి లాంటి అడవిని నరకవలసిన అవసరం లేదని, కష్టపడి చేసే పనులు చాలా ఉన్నాయని నేత్ర ఎదురు తిరుగుతాడు.
మరుసటి రోజు నేత్ర శవాన్ని ఆ ఊరిలోని ఒక పిచ్చివాడు అడవి నుండి మోసుకొస్తాడు. అతని శవంపై కూడా పులి గోర్ల గుర్తులు ఉంటాయి. తమ మాట వినకుండా అతను అడవికి వెళ్ళడం, ఊరందరిని ఎదిరించడం తప్పు అని, అందువలన అతని శవ దహన సంస్కారాలకు కూడా తాము సహాయం చేయమని, ఊరి మాట వినని వాడిని వెలివేస్తాం అని ఊరందరూ ప్రకటిస్తారు. బతిమాలినా సహాయపడని గ్రామస్తుల ముందు నిస్సహాయంగా ఆ పిచ్చివాడు మరో మరుగుజ్జు సహాయంతో పియరి తండ్రి అంతక్రియలు నిర్వహిస్తుంది. ఎవరూ మాట్లాడక ఆ ఊరిలో ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ ఊరి పెద్ద కొడుకు నీరా కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. పట్నం వెళ్ళి ఉద్యోగం చేయడం అతనికి ఇష్టం ఉండదు. ఊరి వారి బాగు కోసం తన చదువును ఉపయోగిస్తూ తండ్రిలాగే వ్యవసాయం చేసుకుంటానని అతను చెప్పినప్పుడు అతని స్నేహితులు ఆశ్చర్యపోతారు. తండ్రి డబ్బు కోసం అడవిని కొట్టే పని చేయబోతున్నాడని అతనికి పియరి ద్వారా తెలుస్తుంది. నీరా, పియరి బాల్య స్నేహితులు. విషయం తెలిసి నీరా తండ్రిని మందలిస్తాడు. అడవిని కాపాడడం తమ భాధ్యత అని తండ్రికి బోధ చేయబోతాడు. తండ్రి అహం దెబ్బతింటుంది. కొడుకు తనను ఎదిరించడానికి కారణం పియరి అని ఆమెను ద్వేషించడం మొదలెడుతుంది నీరా కుటుంబం.
పియరి ఒంటరిదయి అడవిని తాను ఒక్కత్తి ఎలా కాపాడగలను అని భయపడుతున్నప్పుడు, తండ్రికిచ్చిన మాట నేరవేర్చలేనని భాధపడుతున్నప్పుడు నీరా అతని స్నేహితులు ఆమెతో కలుస్తారు. తాను ఆమె ఆశయానికి తోడుంటానని నీరా చెప్పడం వల్ల పియరి బలం పుంజుకుంటుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి మొక్కలు నాటి అడవిని సంరక్షించమని ప్రేరేపించాలని ఆ బందం ప్రయత్నిస్తుంది. కాని ఈ చిన్నవారి ప్రయత్నంలోని గొప్పతనాన్ని పెద్దలు అర్థం చేసుకోరు. అయినా ఆ యువకులు ఒక బందంగా ఏర్పడి కొన్ని మొక్కలను నాటి వాటికి నీరు పోసి అడవిని పెంచే పని చేస్తూ ఉంటారు. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఈ పరిణామాలకు బెదిరి ఊరి పెద్దను బెదిరిస్తాడు. పిల్లలను ఆ పని నుండి విరమించుకునేలా చేయమని చెబుతాడు. ఆ యువకుల తల్లితండ్రులు ఏదో సమయంలో తన దగ్గర అప్పు తీసుకున్న వారే కాబట్టి ఆ ఊరి పెద్ద వారి తల్లి తండ్రులను బెదిరించి వారి పిల్లలు అడవి వైపు రాకుండా చేయగలుగుతాడు. కాని అతని కొడుకు నీరాని ఆపడమే అతనికి కష్టమవుతుంది. ఆ రాత్రి కూడా నీరా అడవిలోకి కాపలాకు వెళతాడు. పులి అతన్ని చంపేస్తుంది. విషయం తెలిసి పియరి హతాశురాలవుతుంది. తన బిడ్డ చావుకు ఆమే కారణం అని నీరా తల్లి అనడం ఊరంతా ఆమెను దెయ్యం అని అనడం భరించలేక పియరి అడవిలోకి వెళ్ళిపోతుంది.
ఫారెస్ట్‌ ఆఫీసర్‌ తన స్నేహితులతో ఆ ఊరిలో చావులన్నిటికి తనే కారణం అని ఆ మాత్రం భయం లేకపోతే ఆ ఊరి జనం అడవిని నరకడానికి ఒప్పుకోరు అని ఆ ఊరి పెద్దను మోసం చేయకపోతే ఊరి సహకారం తమకు అందదని చెబుతున్నది విని పియరి జరిగిన విషయాలు అర్థం చేసుకుంటుంది. ఊరి పెద్దకు వచ్చి జరుగుతున్న మోసం గురించి చెప్పినా అతను నమ్మడు. ఊరిలో జనం మాత్రమే ఎందుకు చనిపోతున్నారు ఆ పులి అడవిలో మేతకు వెళ్ళిన జంతువులను ఎందుకు చంపట్లేదు అని అడిగిన పియరి మాటలు ఆ భార్యాభర్తలు పట్టించుకోరు. ఊరంతా అడవిని కొట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పు చెప్పి అడవిలో చెట్ల కన్నా ముందు తన మెడ నరకమని పియరి వారిని అటకాయిస్తుంది. ఆ ఊరి విషయం కొందరి యువకుల ద్వారా తెలుసుకున్న పై ఆఫీసర్‌ వచ్చి ఆపడం, ఆ ఫారెస్ట్‌ ఆఫీసరే ఈ హత్యలు చేసాడని నీరా స్నేహితులైన యువకులు నిరూపించడం ఊరంతా పియరీకి క్షమాపణ చెప్పి ఆ ఊరిపెద్ద ఆమెను తన కూతురుగా స్వీకరించడంతో సినిమా ముగుస్తుంది.
అంత పెద్ద సమస్య అంత సులువుగా పరిష్కారమవడం కొంత సినిమాటిక్‌గా అనిపించినా పియరీ పాత్రను మలచిన తీరు బావుంటుంది. చాలా సహజమైన వాతావరణంలో సహజంగా నటించిన టీంలోని అందరి నటన ఆకట్టుకుంటుంది. సరోజ్‌ కుమార్‌ దాష్‌ ఈ సినిమాకి కథ అందించి దర్శకత్వం చేశారు. స్క్రీన్‌ పై వచ్చే పేర్ల ఆధారంగా ప్రధాన తారాగణంను కనుక్కుని పోల్చుకోవడం కష్టంగా ఉన్న కారణంగా పియరీ పాత్ర వేసిన నటి పేరు తెలుసుకోలేక పోయాను. ఏ భాషలో సినిమా వచ్చినా, ఏ స్థాయి సినిమా అయినా ఒక మంచి ఉద్దేశంతో, ప్రజల మధ్యకొచ్చే కళారూపాన్ని ఆదరించడం మన కర్తవ్యం అన్న భావనతో ఎంతో నచ్చిన ఈ మంచి సినిమాలోని పియరీ పాత్రను సినీ ప్రేమికులతో పంచుకోవడం అవసరం అని అనిపించింది. నేను చూసిన భారతీయ సినిమాలోని గొప్ప స్త్రీ పాత్రల మధ్య ఈ ఒరియా సినిమాలోని పియరికి స్థానం ఇవ్వడం సముచితంగా అనిపించింది. యూ ట్యూబ్‌లో ఈ సినిమా ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. అడవి కోసం తండ్రిని, ప్రేమించిన వ్యక్తిని పోగొట్టుకున్నా కూడా తాను కూడా బలి కావడానికి సిద్ధపడిన పియరి నిజంగా గొప్ప పాత్ర.

- పి.జ్యోతి,
9885384740

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.