Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విభిన్న పార్శ్వాలను ఎత్తిచూసిన వాగ్ధానపు ఉషోదయం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 27,2020

విభిన్న పార్శ్వాలను ఎత్తిచూసిన వాగ్ధానపు ఉషోదయం

''చుట్టూ వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కన్నా, చిన్నదైన చిరుదీపం వెలిగించటం మిన్న'' అంటాడొక మహానుభావుడు. జీవితమనే కాల ప్రవాహంలో వివిధ మజిలీలను సందర్శించటం, వాటితో ముచ్చటించటం, ఆ ముచ్చట సామూహిక సంఘర్షణలతో ముడిపడటం ఒక అరుదైన సందర్భం. ఇలాంటి అరుదైన సందర్భాన్ని ఈ పుస్తక రచయిత, ఉస్మానియా యూనివర్సిటీ ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నాయకుడు గడ్డం శ్యామ్‌ వ్యాసాలు, కవితల రూపంలో తీసుకువస్తున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను.
ఈ పుస్తక సంకలనంలో వున్న వ్యాసాలు శ్యాం యొక్క ఆలోచనా విధానాన్ని, సమాజం పట్ల తనకున్న భాద్యతను, విషయాలను అర్థం చేసుకోవటంలోను, అర్థం చేసుకున్న దానిని వ్యక్తపరిచే విధానం చాలా అర్థవంతంగాను, పూర్తిగా కూర్చిన వాక్యాలతోనూ, తేలికైన పద వ్యక్తీకరణతో, పరిపక్వతతో వున్నాయి. యూనివర్సిటి విద్యార్థి నాయకుడిగా గడ్డం శ్యామ్‌ అనేక సమస్యల పరిష్కారం కోసం నిజాయితీతో 'కమిటిమెంట్‌' గా పనిచేస్తున్నాడు. ఈ పని ద్వారా పొందిన అనుభవానికి అక్షర రూపం ఇచ్చాడు. సంక్షోభంలో ఉన్న విద్యారంగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నమే ''యూనివర్సిటీ విద్యార్థులకు ఫెలోషిప్స్‌ ఎందుకు ఇవ్వరు?'' అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే పరిశోధనలను కొనసాగించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపాడు. అసమానత్వపు విత్తనాలను వెదజల్లే భారతీయ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను ప్రశ్నించే క్రమంలో 'చావులోను వెంటాడిన కులం' అంటూ తన భావ వ్యక్తీకరణ జరిపాడు. మతం మాటున సైన్స్‌ను అవహేళన చేసే మనువాద సంస్కృతిని రచయిత ప్రశ్నించాడు. 'ప్రశ్న' అనే ప్రజాస్వామ్య చోదకశక్తిని రాజ్యం ఎలా అణచివేస్తుందో కూడ రచయిత వివరించే ప్రయత్నం చేసాడు. పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు బలి అయిన క్షేత్రస్థాయి మరణాలను ఉదహరించే క్రమంలో, తేలికైన భాషతో రోజువారి సంఘటనలను మార్క్సిస్టు భావజాలంతో అనుసంధానించే ప్రయత్నం చేయటం గమనించదగ్గ విషయం. అరమరికలు లేని వెన్నెల లాంటి సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన జార్జిరెడ్డి, మారోజు వీరన్న, తాజాగా లింగన్న లాంటి విప్లవ వీర కిశోరాల ప్రస్తావన ఒక్కసారి కర్తవ్యాలను తట్టిలేపి కార్మోన్ముఖుల్ని చేస్తుంది.
కరోనా మహమ్మారి మానవ జీవిత గమనాన్ని మార్చివేసిన సందర్భంలో 'ఆన్‌లైన్‌ విద్య' ఒక అనివార్యతగా ముందుకు వచ్చిన సందర్భాన్ని కూడ రచయిత గుర్తించటం అభినందిం చదగ్గ విషయం. మరి ముఖ్యంగా ''ఆదివాసిలతో అనుభవాలు'' వాస్తవాలతో సంభాషించటం, ఈ పుస్తక విలువను పెంచుతుంది.
''ప్రపంచ బాధ-శ్రీశ్రీ బాధ, కృష్ణ శాస్త్రి బాధ-ప్రపంచపు బాధ'' అన్న నానుడి మనందరికి సుపరిచతం. ఇరవై ఐదు సంవత్సరాల ఒక నవయువకుడు తన ఆలోచనలు, ఇష్టాలు, నచ్చిన అంశాలు, సామాజిక రుగ్మతలు, భావోద్వేగ పరంపరలు ఈ విధంగా వ్యక్తీకరించటం ఒక అరుదైన విషయం. వ్యక్తిగత ఆలోచనలను వ్యక్తికోసం కాకుండా సామూహిక సామాజిక సంక్లిష్టత వైపు మలచటం కోసం శ్యామ్‌ చేసే ఈ ప్రయత్నం ఎన్నటికి వృధా కాదు.
మనిషి తననూ తాను అర్థం చేసుకొనే ప్రయత్నం కోసం కాలన్ని వెచ్చించటం మరిచిపోతాడు. మనస్సుతో సంభాషించినపుడు, దాని నుండి వచ్చే శబ్ద, లయలు సామూహిక గానం చేస్తే మనిషి జీవితం ధన్యం అవుతుందనీ నేను భావిస్తాను. ఈ కవితల ద్వారా శ్యామ్‌ కూడా అలాంటి ప్రయత్నం చేసాడు. నిద్రలేని రాత్రులలో భావోద్వేగాలతో సంభాషించినట్లు ఈ కవితలు మనకు తెలియ చేస్తున్నాయి. 'ఆసిఫా' నుండి 'ఆదివాసిల దాకా' 'రాజ్యంకుట్ర'లను అర్థం చేయించే ప్రయత్నం చేసాడు. రేపటి 'ఉషోదయానికి' 'ప్రేమతో', 'గర్వంతో', 'లాల్‌సలామ్‌' పలికాడు, 'రంగవల్లి' నుండి 'రాజద్రోహి' వరకు సాగిన హైందవ పెట్టుబడిదారి పన్నాగాలను తన 'అక్షరాలతో వెంటాడాడు'. 'కాశ్మీర్‌లో కారిన రక్తాన్ని 'దిగులుగా' తడిపి 'జాతికి సంస్కారం' నేర్పే ప్రయత్నం చేయటం రచయితకున్న హద్దులు లేని 'సమానత్వ' స్వప్నాలకు నిదర్శనం.
యూనివర్సిటి విద్యార్థిగా, ప్రగతిశీల విద్యార్థి నాయకుడిగా వివిధ సమస్యల పట్ల గడ్డం శ్యామ్‌ పరిపక్వతతో స్పందించటం అభినందించదగ్గ విషయం. ఇలాంటి మంచి ప్రయత్నం చేసినందుకు శ్యాంను మనస్పూర్తిగా అభినందిస్తూ తన ప్రయత్నాలను మున్ముందు కొనసాగించాలని ఆశిస్తున్నాను.
- డా|| కొండా నాగేశ్వర్‌
ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్ట్స్‌ కాలేజి, ఓయూ
జాయింట్‌ డైరెక్టర్‌, ఓయుసిఐపి, ఓయూ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.