Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఉత్తమ చిత్రం 'విముక్తికోసం'@37 | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 27,2020

ఉత్తమ చిత్రం 'విముక్తికోసం'@37

      సుమారు నలభై ఏళ్ళ క్రితం తెలుగు సినిమా రంగం కొంత కాలం కామ్రేడ్లకు రెడ్‌ శాల్యూట్‌ అంది. పెద్ద బ్యానర్లు కూడా ఆలివ్‌ గ్రీన్‌ దుస్తుల్లో తుపాకీ పట్టుకొని అడవుల్లో తిరిగే హీరో చిత్రాలకు జై కొట్టాయి. తెలుగు నేలను చుట్టుముట్టిన రెడ్‌ యైటీస్‌ సీజన్‌లో వచ్చిన ఉద్యమ చిత్రాలు దమ్మున్నవి హిట్‌ అయి నిర్మాతకు కాసులు కురిపించాయి. ఆ బ్రాండ్‌తో వచ్చిన సినిమాలేవైనా మినిమమ్‌ గ్యారెంటీగా జనాదరణ పొందాయి. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో 1979 లో వచ్చిన మాభూమి తెలుగు సినిమాకు ఓ షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చింది. ఆ బాటను నమ్మిన మాదాల రంగారావు 1980లో 'యువతరం కదిలింది' నిర్మించి, నటించి 'రెడ్‌ స్టార్‌' ముద్రతో ఓ సంచలనానికి శ్రీకారం చుట్టారు.
      ఏడాదికో సినిమాతో సాగిన మాదాల విజయయాత్ర మరిన్ని బ్యానర్లను ఎర్ర తోవ పట్టించింది. ఆ రోజుల్లో కొత్తగా సినీరంగంలో అడుగుపెట్టినవాళ్లకు కూడా లోబడ్జెట్‌ చిత్ర నిర్మాణాలకు ఈ జానర్‌ కలిసి వచ్చేది. ఇలా వచ్చిన సినిమాల్లో 'విముక్తికోసం' ఒకటి. దీని యూనిట్‌ అంతా మూడు పదులు దాటని కుర్రాళ్లే. ఈ సినిమా 27 డిసెంబర్‌ 1983 రోజున విడుదలైంది. ఇప్పటికి 37ఏళ్ళు పూర్తి చేసుకున్న విముక్తికోసం శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని రికార్డు చేసిన తొలి సినిమాగా తన రికార్డును పదిలపరచుకుంది.
      సహజత్వం కోసం కథ పుట్టిన నేలపైనే విముక్తికోసం చిత్రీకరణ జరుపడం మరో విశేషం. షఉటింగ్‌ అంతా విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో జరిగింది. 1970 దశకంలో సాగిన నేల విముక్తి పోరులో పాల్గొన్నవారు తమ పాత్రల్లో నటించడం కూడా అరుదైన విషయమే. శ్రీకాకుళం లో పుట్టిన ఉద్యమజ్వాల కరీంనగర్‌కు పాకితే దానికి రివర్సుగా కరీంనగర్‌ యువకులు శ్రీకాకుళ పోరుపై సినిమా నిర్మించడం ఓ అనూహ్య పరిణామం.
      భూషణం మాస్టారు రాసిన తీర్పు కథ 'విముక్తికోసం' కు మూలం. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఆయనను తెలియనివారు ఆ రోజుల్లో అరుదు. ఉత్తర తెలంగాణ రైతుకూలీ పోరాట నేపథ్యంలో అల్లం రాజయ్య కథలల్లినట్లే ఆ వైపు భూషణం అలాంటి ఎన్నో కథలు రాశారు. గ్రామ భుగత (భూస్వామి)కు నమ్మకంగా ఉన్న కంబారి (పాలేరు) ఊర్లో ఏర్పడ్డ రైతు కూలి సంఘం ప్రభావంతో మారి తిరుగబడడం స్థూలంగా చిత్రకథ. కథతో పాటు సినిమాకు మాటలు కూడా భూషణం మాస్టారే రాసారు. ఆయన వాడిన ఉత్తరాంధ్ర స్థానిక పదాలు, యాస సినిమా సహజత్వానికి తోడ్పడ్డాయి.
      ఈ సినిమా పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విముక్తి కోసం 37 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన వచ్చిన ఈ ప్రస్తావన వంగపండు ప్రసాదరావుకు శ్రద్ధాంజలిగా కూడా అనుకోవాలి. ఈ ఆగస్టు 4న అసువులు బాసిన వంగపండు విముక్తి కోసంకు మొత్తం పాటల్ని అందించారు. ఆయన రాసిన ఆరు పాటలు హిట్టయి సినిమా ప్రజాదరణకు తోడ్పడ్డాయి. 'రావాణా చందనాలో ఎన్నెలా రాజా నీకొందానాలో ఎన్నెలా' పాట ఆ యేటి హిట్‌ సాంగ్స్‌లో ఒకటి. బి.గోపాలం సంగీతం ఆ పాటల్ని శ్రవణప్రియం చేసింది. ఆయన కూడా 2004లో మనకు దూరమయ్యారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి.రఘు ఫొటోగ్రఫీ మరో ఆకర్షణ. మగమహారాజు, స్వాతిముత్యం, సిరివెన్నెల మొదలగు సినిమాలను ఎంవి.రఘు తన కెమెరా పనితనంతో అద్భుత చిత్రరాజాలుగా మలిచారు.
      సాయిచంద్‌, పద్మ, చలపతిరావు, కాకరాల, నాగమణి, గరగ ప్రధాన తారాగణం కాగా విశాఖ రంగస్థల నటీనటులు సహాయ నటగణంగా తోడునిలిచారు. ప్రజాచిత్ర బ్యానర్‌పై నిర్మితమైన విముక్తికోసం నిర్మాత నారదాసు లక్ష్మణ్‌రావు. సహ నిర్మాతలుగా కె.సత్యనారాయణ, మన్మథరెడ్డి, సురేందర్‌ వ్యవహరించారు. దర్శకుడు ఎం.ఉదరు కుమార్‌. ఈయన తాతయ్య ప్రేమలీలలు, కొత్తనీరు, ధర్మవడ్డీ, మరో కురుక్షేత్రం, విప్లవశంఖం, రంగులకల మరిన్ని సినిమాలకు పనిచేశారు. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి సినిమా అయినా దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆయన సుదీర్ఘ అనుభవం, అన్ని శాఖలపై ఆయనకున్న పట్టు చిత్ర నిర్మాణానికి ఎంతో పనికొచ్చింది. మహాకవి శ్రీశ్రీకి సమీప శిష్యుడు ఉదరు కుమార్‌. విముక్తికోసం రషెస్‌ చూసాక టైటిల్‌ సాంగ్‌ రాసిస్తానన్న శ్రీశ్రీ 1983 జూన్‌ 15 న మరణించడంతో ఆ పాటని కోల్పోయినా ఉదరు కుమార్‌ గురుదక్షిణగా తన తొలిసినిమాను శ్రీశ్రీకి అంకితమిచ్చారు. కొత్త నిర్మాతలకు చిత్ర పంపిణీదారులు దొరకడం చాల కష్టం. ఆ సంవత్సరమే ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి వచ్చిన మయూరి సంస్థ తొలి చిత్రంగా విముక్తికోసంను విడుదల చేసింది. సినిమాను చూసిన మయూరి అధినేత రామోజీరావు పంపిణీదారుగా ముందుకొచ్చారని ఉదరుకుమార్‌ అన్నారు.
      1983లో విడుదలైన చిత్రాల్లో విముక్తికోసం ఉత్తమ చిత్రంగా నిలబడింది. ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించే అవార్డుల్లో విముక్తికోసం సరోజిని నాయుడు బహుమతిని అందుకొంది. ప్రభుత్వం ఆ సంవత్సరమే ప్రవేశపెట్టిన జాతీయ సమైక్యత నంది అవార్డుకు తగిన తొలి చిత్రంగా విముక్తికోసం ఎంపికైంది. ఆ తర్వాత దర్శకుడు ఉదరుకుమార్‌ దూరదర్శన్‌ కోసం లఘుచిత్రాలను నిర్మించారు. ఈయన డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ బాల్యంపై రూపొందించిన బాల అంబేద్కర్‌ అనే బాలల చిత్రం 1992 లో ఉత్తమ టీవీ బాలల చిత్రంగా బంగారు నంది అవార్డు గెలుచుకొంది.1993లో సారా దుష్ప్రభావాలపై నిర్మించిన సారాంశం బెస్ట్‌ డాక్యుమెంటరీగా నంది పురస్కారాన్ని అందుకొంది ఉదరుకుమార్‌ ప్రతిభకు గుర్తింపుగా 2004 ఆయనకు రాష్ట్ర నంది అవార్డుల ఎంపిక కమిటీ జ్యురీలో చోటు లభించింది. 2004 నుండి 2007 దాకా ఫిలిం సెన్సార్‌ బోర్డు అడ్వైజరీ పానెల్‌ మెంబరుగా ఉన్నారు.
      ఇప్పటికీ పలు సందర్భాల్లో విముక్తికోసం ప్రస్తావన, ప్రదర్శన కనబడుతుంది. ప్రధాన తెలుగు టీవీ చానళ్ళు, దూరదర్శన్‌ ఈ చిత్రాన్ని ప్రసారం చేశాయి. దేశంలో ఉన్న ఫిలిం సొసైటీలు తమ సభ్యుల కోసం ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. సినిమా విడుదలై 33 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కతిక శాఖ తరఫున 24 డిసెంబర్‌ 2016 నాడు రవీంద్రభారతి మినీ హాల్‌లో చిత్రప్రదర్శన జరిగింది. ఆసక్తిపరుల కోసం యూట్యూబ్‌లో విముక్తికోసం అందుబాటులో ఉంది.

 

 

- బి.నర్సన్‌, 9440128169

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తాజా వార్తలు

01:42 PM

క్రికెటర్‌కు బహుమతిగా 5 లీటర్ల పెట్రోల్

01:25 PM

ఇంటి అద్దె అడిగాడని ఓనర్ చంపి..పోలీస్ స్టే‌ష‌న్‌కు వెళ్లి‌.!

01:18 PM

పాలమూరు నేతలతో వైఎస్ షర్మిల భేటీ

01:15 PM

స్టాలిన్ పై పోటీకి ట్రాన్స్​ జెండర్!

01:11 PM

నల్లమల అడవుల్లో అదుపులోకి మంటలు

12:59 PM

భారీగా పెరిగిన వైద్య సిబ్బంది జీతాలు..!

12:57 PM

సూర్య ప్ర‌సాద్‌కు సేవా సామ్రాట్ పురస్కారం

12:55 PM

స్టేట్ లెవెల్ హాకీలో రన్నరప్ గా నిలిచిన నిజామాబాద్ బాలికల జట్టు

12:44 PM

ర‌క్త‌పు మ‌డుగులో మరో న్యాయ‌వాది మృత‌దేహం..!

12:42 PM

స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద తప్పిన పెను రైలు ప్రమాదం

12:35 PM

అసోం, అండ‌మాన్‌లో కంపించిన భూమి

11:55 AM

పాతబస్తీలో దారుణం..భర్తను బండరాళ్లతో కొట్టి చంపి..!

11:30 AM

యాచారంలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

11:27 AM

హైదరాబాద్‌లో 26శాతం పెరిగిన ఇళ్ల అద్దె‌లు..!

11:16 AM

వైఎస్ షర్మిలను కలిసిన ప్రముఖ యాంకర్

11:13 AM

ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

11:08 AM

లాభాల్లో ప్రారంభ‌మైన స్టా‌క్ మార్కె‌ట్లు‌

10:57 AM

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

10:42 AM

భార్య స‌డెన్‌గా బైక్ దిగి భ‌ర్త చూస్తుండ‌గానే..!

10:27 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి‌

10:16 AM

కాన్పూ‌ర్ దేహాత్‌లో బొగ్గు ట్రాలీ బోల్తా..ఆరుగురు మృతి!

10:14 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్!

10:11 AM

కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

10:00 AM

లారీ క్యాబిన్‌లోనే యువకుడి ఆత్మహత్య

09:58 AM

పెరిగిపోతున్న పేడ దొంగతనాలు

09:46 AM

ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

08:52 AM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

08:40 AM

ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మె‌ల్యే‌ల‌ను హెచ్చ‌రించిన‌ కేటీఆర్

08:10 AM

రైతులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

07:44 AM

షూటింగ్‌లో ప్ర‌మాదం..హీరోకు తీవ్ర గాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.