Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బుద్ధీ - జ్ఞానమూ | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 02,2021

బుద్ధీ - జ్ఞానమూ

అసలు లోకమనగానేమి? అంటే కొందరు ఇదని కొందరు అదని రకరకాలుగా విడమర్చి విప్పి చెప్తారు కాని చెప్పడానికి ఏముందసలు? లోకం అంటే ఇచ్చి పుచ్చుకోవడం తప్ప మరేం కాదు. ఇదో పెద్ద 'క్విడ్‌ప్రోకో'. ఇంకా కొంచెం లోతుకి మునిగితే ఏముంది లోకం అంతా కొనడమూ అమ్మడమే!
మాల్లో వస్తువులు కొంటాం. గుళ్ళో పుణ్యం కొంటాం. ఆస్పత్రిలో ఆరోగ్యం కొంటాం. హౌటల్లో ఇడ్లీ సాంబార్‌ కొంటాం. అవసరమైతే మనుషుల్ని కొంటాం. చుట్టాల్నీ పక్కాల్నీ స్నేహితుల్నీ మనుషుల మధ్య సం బంధాల్నీ కొంటాం. అన్నీ కొంటమే. కొంటం కోసం అమ్మడమే. అమ్మడం కోసం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం యింతేకదా లోకం. ఎంత నలగ్గొట్టినా, ఎంత సాగదీసినా ఎంత కరగబోసినా!
అనగా అనగా అదో జమానా లో ఓ రాజ్యం ఉండేది. దాని కోసం రాజూ రాణికో కొడుకూ ఉండే వారు. రాజు కొడుక్కి కష్టమంటే తెలీదు. ఎక్కడానికి ఏనుగులూ, ఈదడానికి సరస్సులూ, ధారళంగా గాలి పీల్చడానికి ఉద్యాన వనాలూ వాటిల్లో లేళ్ళూ నెమళ్ళూ చదువు చెప్పటానికి పంతుళ్ళూ సమకూ ర్చారు రాజుగారు. ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులోనే ముచ్చట గనక రాజావారి కొడుకు అబ్బాయి కనక ఓ అమ్మాయినిచ్చి పెళ్ళి చేశారు. పెళ్ళయ్యేక చిన్న రాజావారికి ఓ బుల్లి రాజావారు పుట్టారు. అంతా సాఫీగా సజావుగా అవుటర్‌ రింగ్‌ రోడ్డు మీద స్పోర్ట్స్‌ బైక్‌లా పరుగెడ్తున్నది. కాకపోతే చిన్న రాజావారికి లోకానికి సంబం ధించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. పంతుళ్ళు తనకు చెప్పిన చదువు వొట్టి చదువేకాని జ్ఞానం కానేకాదని జ్ఞానమనేదే లేనివాడు మనిషనే వాడు కానేకాదని వో అర్ధరాత్రి పూట కోట గుమ్మంలోంచైతే దొరికిపోతామనీ దొడ్డిదారిన కోట దూకేశాడు.
జ్ఞానమంటే ఏమిటో తెల్సుకోడానికి కాళ్లు అరిగేట్టు తిరిగి 'టైరై'పోయి ఓ పెద్ద చెట్టు కింద కూలబడ్డాడు. ఆ చెట్టు నీడలో అది విసిరిన గాలిలో చిన్న రాజా వారికి జ్ఞానోదయం అయింది. అది అలాంటిలాంటి జ్ఞానంకాదు. లోకమంతా 'స్ప్రెడ్‌'అయింది.
అసలు అదీ జ్ఞానమంటే. అసలాజ్ఞానమే ఉంటే లోకం ఏమిటో తెల్లగా తేటమవుతుంది. జ్ఞానమనే ంండక్షరాల పదం చాలా బరువైనదీ లోతైనదీ అంతులేనిదీ అంతు చిక్కనిదీ! పూరానా జమానా లోంచి నయా జమానాలోకి వద్దాం. జ్ఞానమనే మాట ఈ రోజుల్లోనూ వినపడేదే. జ్ఞానమంటే బుద్ధి అని కొందరు తర్జుమా చేస్తారు. జ్ఞానమో బుద్ధో ఈ మాటలు మరీ చిక్కు ముళ్ళయ్యేయి మనుషుల బయోగ్రఫీల్లో.
అయిదేళ్ళు దాటిన అబ్బాయి వీపు మీద గుద్దుతో పాటు వెధవకి బుద్ధిలేదు అన్న మాటలు వినపడ్తయి. ఆ తర్వాత పదేళ్ళు వచ్చి దాటినయి అయినా వెధవకి బుద్ధి లేదు జ్ఞానం లేదు అన్న మాటల్తో వాడి నుదురు బొప్పి కడుతుంది. మైండ్‌ బ్లాకవడమే కాదు బ్లాంకు కూడా అయిపోతుంది.
ఒంట్లోనే కాదు స్కూల్లో టీచర్లు కూడా బుద్ధి జ్ఞానాల్ని విరివిగా వాడేస్తుంటారు. హౌం వర్కు చెయ్యకపోతే బుద్ధిలేదు అంటారు. అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పలేక 'వాటర్‌' నములుతుంటే జ్ఞానం లేదు అంటారు. ఇంటా బయటా బుద్ధీ జ్ఞానమూ లేదనే వారే కాని బుద్ధి అంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో సెలవిచ్చే వారు కనపడనే కనపడరు. తెలుగును ఇంగ్లీషులో చెప్పే పంతుళ్ళు, ఇంగ్లీషును తెలుగులో చెప్పే పంతుళ్ళు, చరిత్ర భూగోళమూ, సైన్ను చెప్పే పంతుళ్ళూ, లెక్కల్తో డొక్క చింపేసే పంతుళ్ళు ఉంటారు. కానీ బుద్ధి జ్ఞానమూ చెప్పడానికి ఒక్క పంతులు కూడా ఉండడు.
అబ్బాయి యువకుడైనా కూడా ఈ బుద్ధీ జ్ఞానమూ జాడ తెలవకుండా ఉండి పోతయి. కాలేజీలో కూడా ఇంగ్లీషూ, సంస్కృతమూ, సైన్సూ, లెక్కలు అమ్ముతారు కానీ బుద్ధీ జ్ఞానమూ అమ్మరుగాక అమ్మరు. బాగా రాచిరంపాన పెట్టి బుర్ర చింపి ఫార్ములాలు వేసి కుక్కి బట్టీ పెట్టించి కాల్చి ర్యాంకులు తెప్పించే వారే కానీ బుద్ధి జ్ఞానమూ చెప్పే వారు వుండరు. టైమంతా హుటాహుటీగా పోటా పోటీగా ర్యాంకుల రణక్షేత్రంగా, కౌన్సిలింగుల కురుక్షేత్రంగా గడిచి పోతుంది.
కాలం గడవగా గడవగా చదువుకీ, బుద్ధి జ్ఞానాలకి సంబంధం లేదని అర్థమవుతుంది. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవగుణంబు మానలేడు అన్నాడో కవి. చెట్టు కింద జ్ఞానం సంపాదించి చిన్న రాజావారు చదువంటే నాలుగు గోడల మధ్య ఘోషకాదని ఈ లోకమనేది ఒక పెద్ద పాఠశాల అని మనిషి అనుభవాలే పాఠాలని తెలుసుకున్నాడు. అంచేతే చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి నడవాలని, చీకట్లోంచి వెలుతురులోకి ప్రయాణించాలనీ చెప్పారు.
మనిషి లోపల వున్న మృగాన్ని, రాక్షసుడ్ని బయటకు తరిమి సత్యం, ధర్మం, కరుణ, ప్రేమ, సమత్వ వంటి విలువల్ని మేలుకొలిపే జ్ఞానం కానీ బుద్ధి కానీ ఎవరూ అమ్మడం లేదు. అరువివ్వడం లేదు. ఉచిత బోధన అంతకంటే లేదు.
లోకంలో ఎంటరయ్యిన్నాట్నించి ఎగ్జిట్‌ అయ్యేదాకా 'ఏళ్ళొ చ్చేయి ఏం లాభం బుద్ధీజ్ఞానమూ రాలేదు'అని అనిపించుకోని చదువు చదువుకోవలసిందే కాని కొనవలసింది కాదు!!

- చింతపట్ల సుదర్శన్‌,
9299809212

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తాజా వార్తలు

12:59 PM

భారీగా పెరిగిన వైద్య సిబ్బంది జీతాలు..!

12:57 PM

సూర్య ప్ర‌సాద్‌కు సేవా సామ్రాట్ పురస్కారం

12:55 PM

స్టేట్ లెవెల్ హాకీలో రన్నరప్ గా నిలిచిన నిజామాబాద్ బాలికల జట్టు

12:44 PM

ర‌క్త‌పు మ‌డుగులో మరో న్యాయ‌వాది మృత‌దేహం..!

12:42 PM

స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద తప్పిన పెను రైలు ప్రమాదం

12:35 PM

అసోం, అండ‌మాన్‌లో కంపించిన భూమి

11:55 AM

పాతబస్తీలో దారుణం..భర్తను బండరాళ్లతో కొట్టి చంపి..!

11:30 AM

యాచారంలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

11:27 AM

హైదరాబాద్‌లో 26శాతం పెరిగిన ఇళ్ల అద్దె‌లు..!

11:16 AM

వైఎస్ షర్మిలను కలిసిన ప్రముఖ యాంకర్

11:13 AM

ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

11:08 AM

లాభాల్లో ప్రారంభ‌మైన స్టా‌క్ మార్కె‌ట్లు‌

10:57 AM

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

10:42 AM

భార్య స‌డెన్‌గా బైక్ దిగి భ‌ర్త చూస్తుండ‌గానే..!

10:27 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి‌

10:16 AM

కాన్పూ‌ర్ దేహాత్‌లో బొగ్గు ట్రాలీ బోల్తా..ఆరుగురు మృతి!

10:14 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్!

10:11 AM

కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

10:00 AM

లారీ క్యాబిన్‌లోనే యువకుడి ఆత్మహత్య

09:58 AM

పెరిగిపోతున్న పేడ దొంగతనాలు

09:46 AM

ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

08:52 AM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

08:40 AM

ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మె‌ల్యే‌ల‌ను హెచ్చ‌రించిన‌ కేటీఆర్

08:10 AM

రైతులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

07:44 AM

షూటింగ్‌లో ప్ర‌మాదం..హీరోకు తీవ్ర గాయాలు

07:38 AM

8 నుంచి ఓటుకు నోటు కేసు తుది విచారణ

07:35 AM

మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే

07:11 AM

న్యాయవాదుల హత్యకేసులో కీలక మలుపు..!

06:47 AM

హైదరాబాద్ విమానాశ్రయానికి ఏసీఐ అవార్డు

06:29 AM

ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.