Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్యూడల్‌ వ్యవస్థ సృష్టించిన 'దాసి' కమ్లీ | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 10,2021

ప్యూడల్‌ వ్యవస్థ సృష్టించిన 'దాసి' కమ్లీ

పిల్లలకు అందమైన భవిష్యత్తు ఇవ్వాలని, ఆడపిల్లలను గొప్పగా పెంచుకోవాలనుకునే సమాజం ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాలేజీలకు చదువుకోవడానికి అందంగా అలంకరించుకుని వచ్చే అమ్మాయులు, స్వేచ్ఛ అంటే తమకు నచ్చిన పని చేయడం, నచ్చినవారితో తిరగడం, నచ్చిన అలవాట్లను ఆనందించడం అనుకునే అమ్మాయిల సంఖ్య ఈ తరంలో పెరుగుతుంది. ఇది ఆనందించాల్సిన విషయమే. కాని ఆ ఆనందం ఎందుకో నిజంగా సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఇప్పటి తరంలో స్వేచ్ఛావాదం ఎంతలా చొచ్చుకువచ్చిందంటే విచ్చలివిడితనానికి స్వేచ్ఛకు తేడా తెలీయనంత. కారణం మన మూలాలు, మన గడిచిన తరాల గురించి తెలుసుకునే పరిస్థితులు లేకపోవడం, చరిత్ర పాఠాలలో కాని, కుటుంబ చరిత్రలలో కాని నిజమైన విషయాలు చర్చకు రాకపోవడం, వీటి కారణంగా స్త్రీ స్వేచ్ఛ అన్న పదానికే గౌరవం పోతున్న రోజులలోకి వచ్చేసాం. అలాంటి స్థితిలో నిజాలను చూడలేని, అర్థం చేసుకోలేని సమాజానికి చెంప పగులగొట్టి వాస్తవాన్ని చూపించగల సత్తా ఉన్న సినిమా ''దాసి''.

దాసి సినిమా 1988లో వచ్చింది. 1920లలోని పరిస్థితులను నిజాం పరిపాలనలో జమిందారుల గడిలలో స్త్రీల జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రం ఇది. ఒక ఐదు సంవత్సరాల పాప కమ్లీ, తల్లి తండ్రులు పేదవారయిన కారణంగా ఇరవై రూపాయలకు ఒక దొరకు అమ్ముడుపోతుంది. ఆ దొర ఇంట ఆమె వయసుకు వచ్చేసరికే ఎన్నో అనుభవాలతో ఆమె శరీరం, మనసు బండబారిపోతాయి. ఆ దొర కూతురు పెళ్ళి తరువాత ఆమె అత్తగారింటికి ఆమెతో పాటు దాసిగా వెళ్ళిపోతుంది కమ్లి. ఆ ఇంట ఆమె చేసే పనులు చూసి తీరాలి. దొరసాని స్నానానికి, కురుల సింగారానికి వెన్న తీయడం, స్నానం చేయించడం, ముఖం కడగడం నుండి ఇంటికి అవసరమయిన సమస్త సదుపాయాలు సమకూర్చడం ఆమె పని. ఆ ఇంట్లో ఇలాంటి దాసీలు చాలా మంది. వారిలో ఆమె ఒకతి. దొరకు మనసయినప్పుడు అతనికి పడక సుఖం అందించడం కూడా ఆమె చేయవలసిన పనులలో ఒకటి. ఇక ఆ ఇంటికి దొరసాని తమ్ముడు వచ్చినా, దొర అన్న వచ్చినా ఆమె వారికి సమస్త సదుపాయాలు అందజేస్తూ శారీరిక సుఖాన్ని కూడా ఇవ్వవలసి ఉంటుంది. దొరకు గడిలో పని చేసే ఏ వ్యక్తి భార్యపై మనసు పోయినా, ఆమెను అతని కోరికమేరకు అతని గదికి తీసుకువచ్చి ఆ రాత్రి గది బైట కాపలా కూర్చోవడం కూడా కమ్లీ పనే.
దొర ఇంటికి వచ్చే ఆఫీసర్లను సంతోషపెట్టడానికి వారితో పక్క పంచుకోవడం తప్పనిసరి. ఇంత చేసి ఆమెకు వాళ్ళిచ్చేది మిగిలిపోయిన కాస్త అన్నం, గంజి నీళ్ళూ అప్పుడప్పుడు ఓ కల్లు కుండ. ఆకలి వేసినప్పుడు ఆమె అబగా తినే ఆ మెతుకుల కోసం శారీరకంగా, మానసికంగా ఆమెను ఆ కుటుంబంలోని వ్యక్తులు వాడుకునే విధానం ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే, దొర ఇంటి దాసి స్త్రీ కన్నా ఆ ఇంట పశువులు సుఖమయిన జీవితం గడుపుతాయి. కనీసం పిల్లలను కనే స్వేచ్ఛ వాటికి ఉంటుంది. ఆ దాసీ జీవితంలో ఏ మగాడివల్లో కడుపు వస్తె ఆ కడుపు ఆమె తీయించుకోవలసిందే. దానిపై హక్కు కూడా ఆమెకు ఉండదు. ఆ ఇంటి దొరసానులు ఆమె గర్భం తీసేయించే కార్యానికి పూనుకుంటారు. అదీ నాటు పద్ధతిలో. ఆమె బతికితే మరుసటిరోజు నుండి దాసి జీవితం మామూలే. చనిపోతే మరో అమ్మాయి దాసిగా వచ్చి తీరుతుంది.
నిజాం పరిపాలనలో తెలంగాణా ప్రాంతంలో దొరల ఇంట స్త్రీల జీవితాలు ఎంత భయంకరంగా ఉండేవో ఈ సినిమా చూపిస్తుంది. దొరసానీల పరిస్థితి ఇంత కన్నా కాస్త మెరుగు కాని వారి జీవితాలలో కూడా కనిపించేది దోపిడీయే. దొర తన పక్కలోకి దాసి దాన్ని రమ్మాన్నా దొరసానిని రమ్మన్నా మారు మాట్లాడే అవకాశం దాసికి లేనట్లే, ఆ దొరసానులకూ లేదు. కాస్త శుభ్రమైన బట్టా నగలు తప్పా భావ స్వాతంత్య్రం కూడా లేని జీవితాలే వారివి. భర్త గదికి వచ్చి అతను మరొకరితో ఉంటే తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఆ భర్తకు సమయం ఉన్నప్పుడు వచ్చి శరీరం అప్పజెప్పే పతివ్రతలు ఆ దొరసానులు. ఈ సినిమాలో చిన్న దొరసానికి పిల్లలు ఉండరు. ఒక కోడలు కడుపుతో ఉంటే ఉత్సవం జరిపించే సమయంలో ఆ ఇంట అందరి మగాళ్లకు శరీరాన్నిచ్చిన దాసికి గర్భస్రావం చేపిస్తుంది చిన్న దొరసాని. ఆమెలో తప్పు చేసానన్న భావన ఉన్నా అంత కన్నా ఏం చేయాలో తెలీని పరిస్థితి ఆమెది. పురుషుల అహంకారానికి, అధికార దాహానికి బలి అవుతున్న ఆ స్త్రీ పాత్రలు గతంలో ఆ జీవితాన్ని అనుభవించిన ఎందరో అసహాయ మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ కనిపిస్తారు ఈ సినిమాలో.
ఒక సెల్‌ఫోన్‌ కొనివ్వలెదనో, ఓ రెండు గంటలు పబ్లో ఎక్కువ సేపు ఉండనివ్వలేదనో తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వాపోయే అమ్మాయిలకు ఈ సినిమా చూపించాలి. స్త్రీలు ఎలాంటి సమాజం నుండి బైటపడ్డారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. దోపిడి అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది. ఎలాంటి దోపిడి నుండి ఇప్పటి స్త్రీ బైటపడగలిగింది. దీని కోసం ఎన్ని పోరాటాలు చేయవలసి వచ్చింది. ఇది ప్రతితరం తెలుసుకోవలసిన చరిత్ర. ఈ సినిమాలో కమ్లిని కడుపు తీయుంచుకోమని పెద్ద దాసి చెప్పినప్పుడు, పెద్ద దొరసాని కడుపు ఉంచుకుంటే తప్పు కాదు కాని నేను ఉంచుకుంటే తప్పా అన్న ప్రశ్న ఆమె వేయడంలో తన పరిస్థితి పట్ల ఆలోచన, ఆమెలో ఒక తిరుగుబాటు ధోరణి కనిపిస్తాయి. కాని అసహాయతతో మరో దారి లేక చిన్న దొరసానికి పిల్లలు లేనప్పుడు నాకెందుకు అని తాను నిత్యం సేవలు చేసే చిన్న దొరసాని మనసును చదివి నిర్వికారంగా రోధిస్తున్నప్పుడు ఆమెలో పరిస్థితుల పట్ల అవగాహన కనిపిస్తాయి. కమ్లి తెలివి లేనిది కాదు, తన పరిస్థితి, తన జీవితం పట్ల ఆలోచన ఉన్న వ్యక్తే. కాని తన పరిస్థితులకు కారణాలు తెలీయని అమాయకపు స్త్రీ. కొన్ని తరాలుగా పురుషాధిక్యత, ఆర్థిక అసమానతలు, సామాజిక పరిస్థితులు, ప్యూడల్‌ వ్యవస్థగా మారి తనలాంటి ఎందరో నిర్భాగ్య స్త్రీల జీవితాలను ఆక్రమించుకున్నాయని తెలీయని ఒక సాధారణ స్త్రీ ఆమె. తాను తెచ్చిన పూలతో పళ్ళతో యజమానురాలు పూజలు చేస్తుంటే చూడడం, తనను ఆ గడిలో కనిపించిన ప్రతి మగాడు ఒక వస్తువుగా హక్కుగా వాడుకుంటుంటే అది తన దాసి జీవితంలో ఒక భాగంగా అనుకోవడం, తన చుట్టూ ఉన్న ప్రపంచం తనను చూస్తున్నట్టుగా తాను కూడా తనను తాను ఒక వస్తువుగా ఒప్పుకోవడం, ఇవన్నీ ప్యూడల్‌ సమాజం కొందరిని బానిసలుగా తయారు చేసే క్రమంలో ఎదగనీయని వ్యక్తిత్వాలకు కారణం అని ఆమెకు తెలీదు. ఈ అవగాహన కలగడానికి ఎంత కష్టం, ఎంత మేధో మధనం, ఎన్ని త్యాగాలు, ఎన్ని జీవితాల దహనాలు జరిగి ఉంటాయి. ఎన్ని పోరాటాలు జరిగాయి స్త్రీ ఆత్మగౌరవ జీవనానికి.
ప్రస్తుతం సమాజంలో దోపిడీ లేదు అనలేం. కాని ఆ తీవ్రత కొంత తగ్గిందన్నది వాస్తవం. ఇప్పుడు దాసీ జీవనం లేదు. స్త్రీలకు చదువుకోవడానికి, ఆలోచించడానికి తమ జీవితాలను బాగు చేసుకోవడానికి కాస్త అవకాశాలు ఉన్నాయి. దోపిడి ఇంకా కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది. సమాజంలో సంపూర్ణ సమానత్వం రానంత వరకు దోపిడి ఏదో రూపంలో దుర్భరులపై జరుగుతూనే ఉంటుంది. అయితే ఆశ్చర్యంగా మెరుగైన జీవితాలను జీవించే అవకాశం ఉన్న స్త్రీల వర్గంలో కూడా తమ స్వేచ్చ ఎందరి ఆత్మ త్యాగ ఫలితమో తెలుసుకోలేని అలసత్వ ధోరణిలు కనిపిస్తున్నప్పుడే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఈ అవగాహన లేమీతోనే స్త్రీ తనకు తాను ప్రస్తుత కార్పొరెట్‌ సమాజంలో ఒక కమోడిటీగా మారడానికి సంకోచించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్యూడల్‌ వ్యవస్థలోని దాసి ఇప్పుడు కార్పొరేట్‌ ప్రపంచంలో రంగు రూపు మార్చుకుని మరో దాసిలా మారిపోయింది. ఆ నాటి దాసి తన దాస్య స్థితికి భాధపడేది. కాని ఇప్పటి నవతరం దాసి అసలు తాను ఎన్నో అహంకారాల అధీనంలో జీవిస్తుందనే కనీస అవగాహన లేకుండా బ్రతుకుతుంది. ఇది అతి పెద్ద సామాజిక ట్రాజెడీ. అది అర్థం అవడానికి ఇలాంటి సినిమాలు ప్రస్తుత తరానికి చూపించాలి. ఏ స్థాయి దోపిడి నుంచి స్త్రీలు బైటపడ్డారు. ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎంత అమూల్యమైనది, ఎందరికీ దొరకని నిధి అది. ఆ అపురూప స్వేచ్ఛ ప్రతి తరానికి సహజంగా వచ్చింది కాదని అది పోరాడి సంపాదించుకున్నదని ఇప్పటి తరానికి అర్థం అవాలి. తాము అనుభవిస్తున్న స్వేచ్ఛ అమూల్యమైనదని అందు వలన తన జాతి మానసిక అభివద్ధి, శారీరిక, మానసిన దాస్య విముక్తి దిశగా ఆ స్వేచ్ఛను మలచుకోవాలన్న సూత్రం ఇప్పటి స్వేచ్ఛా జీవితాలను అనుభవిస్తున్న స్త్రీల మెదళ్ళలో ఎక్కించవలసిన అవసరం చాలా ఉంది.
ఎంతటి దుర్మార్గాన్ని స్త్రీ సమాజం భరించింది. తనను నిరంతరం దోచుకుంటున్న వ్యవస్థ మనుగడకు పునాది రాళ్ళుగా ఎందరు అనామికులు గతంలో కలిసిపోయారు. వారి సంఘర్షణ లేకుండా ప్రస్తుత ఆధునిక సమాజ నిర్మాణం ఊహించలేం. గర్భంలో చిదిమి వేయబడిన బిడ్డల కోసం ఏడ్చిన వారి కన్నీళ్ళూ, ఆ దోపిడిని తప్పించుకుని ముందుకు సాగిన జీవన స్రవంతిలో భాగం. వీటిని దాటుకుని, ప్రాణం పోసుకుని బైటపడింది ఈనాటి ఆధునిక స్త్రీ. తన జాతి గతాన్ని మోయవలసిన భాద్యత ఉన్న ఆధునిక స్త్రీ ఆ గురుతర భాధ్యత పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం ఆలోచించవలసిన విషయం. గత పోరాటాలను విస్మరించి లేదా అర్థం చేసుకోలేకుండా స్త్రీ జీవనం మెరుగైన దిశగా ప్రయాణించలేదు. అందుకే ఆనాటి ఆమె జీవితాన్ని, ఆమె అనుభవించిన దుఖాన్ని, ఆమెకు ఎదురైన దోపిడిని అర్ధం చేసుకునే తరం ఇప్పుడు అవసరం. అందుకే ''దాసి'' కేవలం సినిమా కాదు ఒక సామాజిక అవసరం, ఒక చరిత్ర పాఠం. ఆనాటి 'ఆమె' జీవితానికి ప్రతిబింబం. నేటి స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు పరిపూర్ణమైన అర్థాన్నివ్వగలిగే జీవన సారం.
ఈ సినిమాలో కమ్లీగా అర్చన నటిస్తే దొరసానిగా రూపాదేవి నటించింది. ఇద్దరూ ఆయా పాత్రలలో ఇమిడ ిపోయారు. ఇంతటి అపురూప చిత్రాన్ని అందించిన బి. నర్సింగరావు గారికి తెలుగు స్త్రీ ప్రపంచం ఎప్పటికీ రుణపడి ఉండాలి. నవ సమాజ నిర్మాణం వెనుక పోరాడిన ధీరోత్తములే ఉండరు. సామాజిక దుర్మార్గాన్ని భరించి, దోపిడిని సహించి, తమ మౌనంతో ఎన్నో ప్రశ్నలు ఇతరులలో రేకిత్తించి తమ జీవిత పాఠాలను ఆధారం చేసుకుని ముందుకు సాగమని మరో తరానికి పరోక్షంగా దారి చూపించిన బాధితులు నవ సమాజ నిర్మాణంలో అతి పెద్ద పాత్ర పోషిస్తారు. ఆధునిక స్త్రీ జీవితాని కమ్లీ, దొరసానులే పునాది రాళ్ళు అన్నది వాస్తవం.
తెలంగాణా పల్లె జీవితాన్ని ఈ సినిమా అతి సహజంగా చూపించగలిగింది. అప్పట్ళో వాడిన ప్రతి పని ముట్టును సేకరించి చిత్రంలో చూపించారు దర్శకులు. ఒక సీన్‌లో తులసి చెట్టుకు బొట్టూ పెడుతూ కమ్లి కనిపిస్తుంది. దానికి వాడిన పాత్ర ఇంకెక్కడా కనిపించదు. దొరకదు మనకి. ఇలాంటి పనిముట్లు ఎన్నో ఈ సినిమాలో ప్రతి సీన్‌లో కనిపిస్తాయి. సినిమాకు ఎంత హౌమ్‌ వర్క్‌, రీసెర్చ్‌ జరిగిందో ప్రతి సీన్‌ మనకు చెబుతుంది. ప్రతి ఫ్రేమ్‌ను దర్శకులు చాలా దీక్షతో తీర్చిదిద్దారు. తల దువ్వుకుంటున్న దాసి కాళ్ళ వద్ద చిన్న ఈత చాప, అప్పట్లో వాడిన చాటలు, గిన్నెలు, నగలు, బుట్టలు, ధాన్యం కొలిచే పాత్రలు ఇవన్ని అచ్చంగా తెలంగాణ ప్రాంతపు జీవన శైలిని డాక్యుమెంట్‌ చేయగలిగాయి. తెలుగు సినిమా ప్రస్థానంలో ఈ సినిమాను తలచుకోలేదంటే తెలుగు సినిమాను పూర్తిగా దర్శించలేదనే అర్థం.

- పి.జ్యోతి,
9885384740

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
ఆడబిడ్డలకు భరోసానిద్దాం...
సమీక్షలు
అందుకున్నాం
చిలుకా క్షేమమా?
భారత గ్రంథపాలకుల అవస్థలు
విధేయత
మహబూబ్‌నగర్‌ (ఉమ్మడి) జిల్లా వీరశిలలు - పరిశీలన
అందుకున్నాం
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
పల్లె సంక్రాంతి
పిల్లల పెంపకం ఎలా?
ప్రకృతి ప్రేమికుల స్వర్గసీమ
DO DO.. బసవన్న..
మనుషుల్ని చూసి పెద్దగా భయపడవు......
బాలల బొమ్మల రాజుగారి కథలు
అందుకున్నాం
రైతు
యునిసెఫ్‌ కార్డులదొక చరిత్ర
మాయమైన మైత్రీ సందేశికలు
గ్రామీణ యువత డిగ్రీకి దూరమైతే ఎట్లా?
బుద్ధీ - జ్ఞానమూ
ప్రమాదకరమైన రోహ్ తాంగ్‌ కనుమ
యాపీ న్యూ ఇయర్‌
ఉత్తమ చిత్రం 'విముక్తికోసం'@37
విభిన్న పార్శ్వాలను ఎత్తిచూసిన వాగ్ధానపు ఉషోదయం

తాజా వార్తలు

08:44 AM

ఈనెల 30వ తేదీని మటన్ దుకాణాలు బంద్..

08:24 AM

కాలేజీలో 25మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్..

08:18 AM

రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష

08:06 AM

ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ

07:54 AM

వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.