Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చిలుకా క్షేమమా? | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 17,2021

చిలుకా క్షేమమా?

అదో చెట్టు. ఆ చెట్టు కింద వో అరుగు. అరుగు మీద చాప. దాని మీద ఓ పంజరం. ఆ పంజరంలో అట్నించి ఇటు ఇటు నించి అటు తిరుగాడే ఓ చిలక పచ్చని చిలక. దాని ముక్కు ఎరుపు. పంజరాన్ని ఆనుకుని కూచున్న మనిషి కట్టుకున్నది ధోవతి. వేసుకున్నది పొడుగు చేతుల చొక్కా. పెట్టుకున్నది ముఖం మీద మూడు విభూతి రేకలు. వాటి మధ్య ఎరుపు బొట్టు. పంజరానికి ఎదురు గుండా ఉంది అట్టముక్కల దొంతర. ఆ అట్ట ముక్కల్లో ఉన్నది దేవుళ్ళు. ముక్కోటి దేవతల్లో ముఖ్యమైన వాళ్ళు.
తలమాసిన వాడు, తల్లో జుట్టు లేని వాడు ముఖం నిండా గడ్డమున్నవాడు పాత పంచెకట్టుకున్నోడు అక్కడక్కడా చిరుగుల ప్యాంటు తొడుక్కున్నోడు. ఏ వేషమయితేనేం ఏ మనిషయితేనేం అందరూ ముఖం వేళ్ళాడేసుకుని వచ్చేవాళ్ళే అందరి ముఖాల్లోనూ క్వశ్చన్‌ మార్కులే. చిలక చెప్పే ఫ్యూచర్‌ కోసం వచ్చే వాళ్ళందరి ముఖాల్లోనూ ముందు అగనా ముందు ముందు యేం జరగబోతున్నదో తెల్సుకోవాలన్న ఆరాటమే. ఇప్పుడున్న దరిద్రం యిలాగే కంటిన్యూ అవుతుందా లేక ఏ పగలో రాత్రో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వదిలేసి తమ ఇంట్లోకి వచ్చేస్తుందా అని తెల్సుకోవాలనే ఆరాటమే. ఈ జలుబూ జబ్బూ తుమ్మూ దగ్గూ ఆయాసమూ ఎంతకాలం పీడిస్తయి ఎప్పుడు వొదిలేసి వెళ్లయి అని తెల్సుకోవాలనే ఆరాటమే. ఇంకా ఇలాంటి ఆరాటాలనేకమే.
ఈ ఆరాటాలకి జవాబు చిలక. చిలక పంజరంలోంచి బయటకి నడిచి వచ్చి ముక్కుతో ఓ దేవుడ్నో దేవతనో పైకి లేపి తన 'బాస్‌'కి అందించి పంజరంలోకి 'రిట్రీట్‌' అయిపోతుంది. అట్టముక్కలో దేవుడ్ని ఎగాదిగా చూసి కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఆరాట పడేవాళ్ళకి ఊరట కలిగించే విధంగా జ్యోతిష్యం చెప్పడం చిలక జ్యోతిష్యుడికి పొట్ట కోసం వచ్చిన విద్య. అది వాళ్ళ ముఖాలను చదవడమే. కూటి కోసం కోటి విద్యల్లో ఒకటైన ఆ విద్య యిప్పుడు కనిపించటం మానేసింది. ఇప్పుడు చెట్టూ లేదు. చెట్టు కింద అరుగూ లేదు. అగురు మీద చాప చాపమీద పంజరం పంజరంలో చిలకా పక్కన జ్యోతిష్యుడు హాంఫట్‌!
కట్‌ చేస్తే టీవీ చానల్‌లో జ్యోతిష్యుడికి ధోవతీ వుంది. పొడుగు చేతుల చొక్కా వుంది. ముఖాన తెల్లగీతల మధ్య ముద్దొచ్చే ఎర్ర బొట్టూ వుంది. కానీ పంజరంలో చిలకే ఎగిరిపోయింది. అట్ట ముక్కల్లో దేవతలు బతుకుదేముదా అని పరారై పోయేరు. ఇప్పుడు పంజరం ఉండాల్సిన చోట కంప్యూటర్‌ వెలుగులు విరజిమ్ముతున్నది. పక్కనే చక్కనిచుక్క చిరునవ్వులు విసిరేస్తూన్నది. ఇప్పుడు జ్యోతి ష్యుడు ముఖం చదవటం మానేశాడు. శబ్దగ్రహణ విద్య నేర్చాడు. ఫోన్‌లో ప్రశ్నలు వినపడ్తయి. ప్రశ్నలకు జవాబులు చెప్పబడ్డయి. ఛానళ్ళు, జ్యోతిష్యులతో పాటు మొబైళ్ళ పొట్టలు కూడా నిండుతయి.
ఒక పట్టాన లైను దొరకదు. దొరికితే అడిగే వాడి పంట పండినట్టే.
హలో.. హలో..
చెప్పండి స్వామిజీ వింటున్నారు అని ముసిముసి నవ్వులు మెరిపిస్తుంది 'యాంకరి'.
అబ్బా ఎన్నాళ్ళకి దొరికిందిస్వామి లైను. ఎన్ని యేళ్ళ నుంచి 'ట్రై' చేస్తున్నాను అంటూ ఆ కొసన ఉన్నవాడు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతాడు.
అడగండి అడగండి అని తొందర పెడ్తుంది చిలక కాని చిలక.
మీ పేరేమిటి? ఎప్పుడు పుట్టారు? టైంలో ఆకాశంలో ఏ నక్షత్రం డ్యూటీలో ఉన్నది అని అడుగుతాడు స్వామీజీ. గుర్తున్నవాడు చెప్తాడు. లేని వాడ్ని ఒకటి నుంచి తొంభై అంకెల్లో ఏదో ఒక్కటి చెప్పమంటాడు. ఇష్టమైన పువ్వు లేదా దైవం ఎవరో చెప్పమంటాడు.
అడిగే వాడిది అదే ఆరాటం. అందరూ మోసం చేసే వాళ్ళే. ఎవర్ని నమ్మాలో తెలీడం లేదు. ఉద్యోగం లేదు. చదువు రావడం లేదు. పెళ్ళి కావడం లేదు. ఆరోగ్యం వుండి చావడం లేదు. ఆస్తి వస్తుందా లేదా? విదేశాలకు వెళ్తానా లేదా? ప్రశ్నలు.. ప్రశ్నలు. అవే ప్రశ్నలు అదే ఆరాటం. ముందు.. ముందు.. ఏం జరుగుతుంది ముందు?
జవాబులు.. జవాబులు.. అవే జవాబులు.. అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు 'టైం' ఏమంత బాగాలేదు. శని ఎక్కడ ఉండకూడదో అక్కడ కూచుని తీరిగ్గా చెవిలో పుల్లతో కెలుకుతున్నాడు. కుజుడు ఏదో ఇంట్లో జొరబడి ఖాళీ చేయను అంటున్నాడు. గురుడు గడ్డం దువ్వుకుంటూ 'బిజీ'గా ఉండటం వల్ల ఏ ఇంట్లోకి ప్రవేశించాలో ఆ ఇంట్లోకి రాకుండా 'డిలే' చేస్తున్నాడు.
అడిగిన వాడి ముఖం వాచిపోతుంది. గుండె జారి గల్లంతయి పోతుంది. అడిగేవాడికి చెప్పేవాడు పరిస్థితులు చక్కబడటానికి 'పరిహారం' చెప్తాడు. కొబ్బరికాయలు కొట్టమంటాడు. నెయ్యి దీపాలు వెలిగించమంటాడు. ఆవుకు అరటి పళ్ళు పెట్టమంటాడు. గుళ్ళో ప్రదక్షిణాలు చెయ్యమంటాడు. ఆరు వారాలు, నలభై రోజులు నాలుగు నెలలు టైం యిస్తాడు. కరెన్సీ కట్టలు రావడానికి, ఉద్యోగం ఆఫర్‌ అవడానికి, మ్యారేజి సెటిలవడానికి సంతానం కెవ్వుమనడానికి ఒంట్లో జబ్బు పత్తా లేకుండా పోవడానికి.
ముందు యేం జరగబోతుందో తెల్సుకోవాలనే ఆరాటం మనిషిలో ఎప్పుడు పుట్టిందో కాని దానికి మాత్రం చావులేదు. మనిషిలోని ఆ ఆరాటాన్ని ఒక నయం అవని జబ్బుని చేసి డబ్బు చేసుకునే వాళ్ళు ఎందరో! దీన్ని ఓ కార్పొరేటు బిజినెస్‌ చేసి అడిగేవాడికి లక్ష్మీదేవి అడ్రసు ఇవ్వకుండా తమ విజిటింగ్‌ కార్డు ఇచ్చేవాళ్ళు ఎందరో! స్టోన్‌ శాస్త్రం ఫింగర్‌ రింగ్‌ శాస్త్రం అంకెల్లో అదృష్ట శాస్త్రం పేర్లల్లో రిపేరు శాస్త్రం ధనరాశులు కురిపించే తంత్రం అర్ధరాత్రి అదృష్టం తలుపు బాదే యంత్రం బతుకు బండిని రిపేరు చెయ్యటానికి లేని శాస్త్రం లేదు. కొత్త ఆంగ్ల సంవత్సరం 'ఎంటర్‌' అయినా, సరికొత్త తెలుగు సంవత్సరం వచ్చి వాలినా టీవీల్లో, యూట్యూబ్‌ ఛానళ్ళలో, పత్రికల్లో చిలక లేకుండానే జ్యోతిష్యం బీభత్సంగా వర్థిల్లుతున్నది.

- చింతపట్ల సుదర్శన్‌,
9299809212

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తాజా వార్తలు

01:25 PM

ఇంటి అద్దె అడిగాడని ఓనర్ చంపి..పోలీస్ స్టే‌ష‌న్‌కు వెళ్లి‌.!

01:18 PM

పాలమూరు నేతలతో వైఎస్ షర్మిల భేటీ

01:15 PM

స్టాలిన్ పై పోటీకి ట్రాన్స్​ జెండర్!

01:11 PM

నల్లమల అడవుల్లో అదుపులోకి మంటలు

12:59 PM

భారీగా పెరిగిన వైద్య సిబ్బంది జీతాలు..!

12:57 PM

సూర్య ప్ర‌సాద్‌కు సేవా సామ్రాట్ పురస్కారం

12:55 PM

స్టేట్ లెవెల్ హాకీలో రన్నరప్ గా నిలిచిన నిజామాబాద్ బాలికల జట్టు

12:44 PM

ర‌క్త‌పు మ‌డుగులో మరో న్యాయ‌వాది మృత‌దేహం..!

12:42 PM

స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద తప్పిన పెను రైలు ప్రమాదం

12:35 PM

అసోం, అండ‌మాన్‌లో కంపించిన భూమి

11:55 AM

పాతబస్తీలో దారుణం..భర్తను బండరాళ్లతో కొట్టి చంపి..!

11:30 AM

యాచారంలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

11:27 AM

హైదరాబాద్‌లో 26శాతం పెరిగిన ఇళ్ల అద్దె‌లు..!

11:16 AM

వైఎస్ షర్మిలను కలిసిన ప్రముఖ యాంకర్

11:13 AM

ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

11:08 AM

లాభాల్లో ప్రారంభ‌మైన స్టా‌క్ మార్కె‌ట్లు‌

10:57 AM

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

10:42 AM

భార్య స‌డెన్‌గా బైక్ దిగి భ‌ర్త చూస్తుండ‌గానే..!

10:27 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి‌

10:16 AM

కాన్పూ‌ర్ దేహాత్‌లో బొగ్గు ట్రాలీ బోల్తా..ఆరుగురు మృతి!

10:14 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్!

10:11 AM

కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

10:00 AM

లారీ క్యాబిన్‌లోనే యువకుడి ఆత్మహత్య

09:58 AM

పెరిగిపోతున్న పేడ దొంగతనాలు

09:46 AM

ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

08:52 AM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

08:40 AM

ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మె‌ల్యే‌ల‌ను హెచ్చ‌రించిన‌ కేటీఆర్

08:10 AM

రైతులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

07:44 AM

షూటింగ్‌లో ప్ర‌మాదం..హీరోకు తీవ్ర గాయాలు

07:38 AM

8 నుంచి ఓటుకు నోటు కేసు తుది విచారణ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.