Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి మనిషికి వృద్ధాప్యం నిరూపయోగమైనది కాదు. అది విలువైన జీవితం. మానవుడు వివిధ దశలు దాటిన తరువాత వృద్ధుడు అవుతాడు. ఆయన లేదా ఆమె తమ జీవిత కాలంలో విలువైన అనుభవాన్ని సంపాదిస్తారు. ఆ అనుభవం భావితరాల వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ విజ్ఞానాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. అందువల్ల వృద్ధులను ఆదరించాలి. వారిని పరి రక్షించాలి. వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయ వద్దు. అనుభవ సారంతో వారు చెప్పే మాటలను మనం శ్రద్ధగా వినాలి. యువతరం తమ జీవితాలను తీర్చిదిద్దుకునేం దుకు పెద్దవారి మాటలు, ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న వారు తమ జీవితసారాన్ని పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు. వారి రచనలు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విజేతలు తమ జీవితంలో క్లిష్టమైన సమయంలో ఎలా వ్యవహరించారు. సంక్షోభ సమయాలను ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నారనే విషయాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. జీవితంలో వృద్ధాప్యమంటే నిరూపయోగ మైనదని, నిస్తేజమైన దశ అని చాలా మంది భావిస్తారు. ఈ భావన సమాజంలో ఎల్లెడలా వ్యాపించి ఉంది. ఇది సరికాదు. కాగా చదువు ముగించడం ఆలస్యమైనవారు ఆలస్యంగా వివాహం చేసుకుంటారు. ఆలస్యంగానే తల్లిదండ్రులవుతారు. మానసిక క్రమశిక్షణను అలవర్చుకున్న వారిలో 60ఏండ్ల తరువాతనే వృద్ధాప్య లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. చికాగో యూనివర్సిటీకి చెందిన న్యూగార్టెన్ అనే శాస్త్రజ్ఞురాలు వృద్ధాప్య సంబంధమైన విషయాలపై పరిశోధన నిర్వహించారు. ఈ అంశంపై అనేక నూతన విషయాలను వెల్లడించారు.
ఇంతవరకూ 40ఏండ్లకే వృద్ధాప్యం వస్తుందన్న అభి ప్రాయం మన సమాజంలో చెలామణి అవుతోంది. కానీ అది వాస్తవం కాదు.శారీరక కష్టంపై ఆధారపడి జీవించే శ్రామికుల్లో 40 ఏండ్ల వయస్సులో వివిధ కారణాల వల్ల శారీరక పటుత్వం సన్న గిల్లడం జరగవచ్చు. దీనినే వారు వృద్ధాప్య చిహ్నం అని భావిస్తారు. కానీ వారు మానసికంగా పట్టుత్వం కలిగి ఉంటారు. ఇక విద్యావంతులు, మానసిక శక్తితో పనిచేసే వారిలో ఈ వయస్సులో వృద్ధాప్య చిహ్నలేమి కనిపించవు. నిత్య యవ్వన వంతులుగా కనిపిస్తారు. మనం అనుభవించే భావోద్వే గాలు, టెన్షన్లు అన్ని మానసిక సంబంధమైనవే. అనగా మన మనస్సును అదుపులో పెట్టుకుంటే మనం టెన్షన్ బారినపడ కుండా కాపాడుకోవచ్చు. జీవితంలో ఎలాంటి సంక్షోభనైనా, కష్టానష్టాలనైనా ధృడంగా ఎదుర్కొంటాను అని మనం గట్టిగా నిర్ణయించుకుంటే ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. తాము యువకులుగా ఉన్న పుడు అనేక క్లిష్టమైన సంఘటనలను ఎదుర్కొన్నామని, అవి తమకు ఎన్నో గుణపాఠాలను నేర్పాయని చెబుతారు. ఇదిలా ఉండగా తమకు వయస్సు మీదపడిన కొద్దీ లైంగిక పటుత్వం క్షీణిస్తుందని భావించడం సరికాదని న్యూగార్టెన్ పేర్కొన్నారు. లైంగిక పట్టుత్వానికి కేంద్రం మనస్సేనని ఆమె వెల్లడించారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. తమ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న సమయాలల్లోనూ, కుటుంబ వ్యవహా రాల్లో ఆందోళనకు గురైనవారు తమ మానసిక విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.దానిని సాధించే సామర్థ్యాన్ని మనం అలవర్చు కోవాలి. ఈ విషయంలో ఇతరుల సహాయాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇక జననశక్తి కోల్పోయే మోనోపాజ్ సమయంలో మహిళలు తీవ్రమైన ఆందోళనలకు గురౌతారన్న విషయం వాస్తవం కాదని న్యూగార్టెన్ పేర్కొన్నారు. చాలామంది స్త్రీలు దీనిని స్వల్ప విషయంగానే భావిస్తారని చెప్పారు. తమ పిల్లలు ఎదిగి వేరుగా ఉండడడాన్ని కూడా మహిళలు తప్పుగా అర్థం చేసుకోరు. పైగా వారు ఈ విషయంలో ఎంతో ప్రశాంతత పొందుతారని మానసిక శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. వృద్ధాప్యం వచ్చిన తరువాత మానసిక ఎదుగుదల ఆగిపోతుందని వెల్లడ వుతున్న అభిప్రాయం కూడా సరికాదని వారు చెప్పారు. ఉద్రేకాలకు, ఆవేశాలకు లోనుకాకుండా వాస్తవాన్ని గమనించ డానికి, మానసికంగా పరిణతి పొందేందుకు వృద్ధాప్యం ఏమాత్రం అడ్డుకాదనీ శాస్త్రజ్ఞులు స్పష్టం చేశారు. వృద్ధాప్య జీవితం ప్రారంభమైన తరువాత తాము సంతృప్తి కరమైన జీవితాన్ని గడుపుతున్నామని చాలా మంది పేర్కొన్నారు.
వృద్ధాప్యం జుట్టు తెల్లపడడం వల్ల తమకు ఎలాంటి మానసిక ఆందోళన లేదని కూడా వారు స్పష్టంచేశారు. అందుకే మిత్రమా.. వృద్ధాప్యాన్ని చూసుకుని బిడియపడవలసిన అవస రంలేదు. 30ఏండ్ల తరువాత మన శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అయితే మానసికంగా ఉత్సాహంగా ఉండ వచ్చు. మనలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సర్దుకుపోవాలి. ఆందోళన పడవద్దు. ఈ సమయంలో మన లను గురించి ఇతరులు చేసే వ్యాఖ్యాలకు విలువ ఇవ్వ వద్దు. వాటిని పట్టింంచుకోవద్దు. వయస్సుమీరిన తరువాత గాంభీ ర్యాన్ని, హుందాతనాన్ని అలవర్చుకోవాలి. అనవసర విషయా లకు ఉద్రేక పడవద్దు. మన రోజువారి కార్యక్రమాలను ఆందోళ నకు తావివ్వకుండా రూపొందించుకోవాలి. వృద్ధాప్యంలోనూ ఆనందకరమైన జీవితాన్ని గడపడమందరికీ సాధ్యమేనని గుర్తించాలి.
- జి గంగాధర్ సిర్ప,
8919668843