Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం సమాజంలోని అసమాన తలను తొలగించడంలో జగతిని జాగతం చేయుటలో విశేష ప్రాముఖ్యత కలది. ఈవిధంగా తెలుగు సాహిత్యం ఎన్నో ప్రక్రియలలో సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడుతుంది. ఆ ప్రక్రియలలో వచన కవిత ఒకటి.
అటువంటి వచన కవిత్వాన్ని ఎంచుకొని కలం అనే హలాన్ని చేతబట్టి అక్షరాలనే విత్తులతో సమాజ శ్రేయస్సుకు కవితా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన డా.యం.రాములు ఎంతో హార్షణీయుడు.
విశ్రాంత ఉపాధ్యాయుడిగా తన జీవిత అనుభవంలో ఎదురైన ఎన్నో సమస్యలను ప్రస్తుత పాశ్చాత్య కాలంలో ఎదురవుతున్న సమస్యలపై సమాజ హితాన్ని కోరుతూ జన చైతన్యమే విధిగా డా.యం.రాములు సంధించిన బాణమే ఈ కవితా ప్రస్థానం.
''ఈ కవితా ప్రస్థానం'' కవితా సంపుటిలో ప్రస్తుత లోకాన్ని పీడుస్తున్న కరోనా గూర్చి మానివాళి గ్రహాచారం భాగలేక కరోనా శని గ్రహాణం పట్టిందని మనిషి బ్రతుకు దినదిన గండంగా మారిందని చాలా చక్కగా వర్ణించారు.
''కరోనా రాకతో విద్యార్థుల చదువులు అటకెక్కాయని అన్ని కార్యాలు కట్టిపెడితిమి పూట గడవక ఇబ్బంది పడితిమి నీ రాక మాకు గండం నీకెప్పుడు యమగండం అంటూ కరోనాపై విమర్శనాత్మక భాణం వదిలాడు''
''సంప్రదాయ రక్షణ కవితలో పాత ఆచారాలకు పాతరేసి కొత్తవాటికి పునాదివేసి రోగాల రొంపిలో మనిషి అస్తిత్వమే ప్రశ్నార్థకం అంటూ మన సంప్రదాయల విలువను తెలిపారు''.
''విదేశీ కంపెనీలకు వింజామరలు ఆపేసి స్వదేశీకి పట్టం కడితే ఆర్థిక వ్యవస్థ గాడిన పడదా సమస్తం దాసోహమవ్వదా అంటూ జన జాగత పరిచారు.''
''వెనకేసుకున్న సొమ్ము వెంటరాదని తెలిసి అవినీతి సొమ్ముకై అర్రులు చాచి అపకీర్తి పొందేరు ఇకనైన మారరా అంటూ సరైన ప్రశ్న కవితాస్త్రాన్ని మానవాళిపై ఎక్కుపెట్టాడు.''
''అమోఘమైన ఆయుధ సంపత్తి సంగ్రామంలో పోరాడే కండబలం గుండెబలం గల సైనిక శక్తే దేశానికి శ్రీరామరక్ష అని సైనికులే మన సంరక్షకులని చక్కగా కవితలో విశ్లేషించారు''
''విభిన్న సంస్కతుల మేళవింపు ఇతిహాసాల పుట్టినిల్లు వేదాలు వెలిసిన పుణ్యభూమి కళలకు కాణాచి నా జన్మభూమి అని దేశభక్తిని చాటారు డా. రాములు''
''పేదధనిక భేదాలు కులమత అంతరాలు చూడక కలసిమెలసి ఆడుకున్న బాల్యస్నేహమే అద్భుతం అని స్నేహ గాఢతను తెలపారు''
''అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి విద్యార్థుల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించి పాత్రదారుల్ని సమాజ సూత్రధారులుగా మలిచే విజ్ఞాన భాండగారాలని ఒక గురువుగా డా.యం.రాములు గారు గురువులకి కవితలో అగ్రతాంబూలం వేశారు.''
''ఇంటికి దీపం ఇల్లాలు ఆత్మీయత అనురాగానికి ప్రేమాభి మానాలకు నిలువెత్తు రూపం, ఆమె సేవలు అనిర్వచనీయమని సేవమూర్తి ఇల్లాలి గొప్పతనాన్ని కవితలో వర్ణించి తాను స్త్రీమూర్తి సేవకుడినని చాటుకున్న స్త్రీవాదకవి రాములు''
ఈ విధంగా ఈ కవితా ప్రస్థానంలో రాములు రాసిన ప్రతి కవిత ఒక ఆణిముత్యంగా సమాజ హితాన్ని కోరేదిగా వర్తమాన జీవితాలను ప్రభావితం చేసేదిగా యూవతరానికి మార్గ దర్శకంగా ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు
ఆయన కలం నుండి కవితా ప్రస్థానం కవిత సంపుటే కాక రామభాషితాలు, సిసింద్రుల కథలు, పాలమూరు చరిత్ర-సంస్కతి, సక్సెస్‌ఫుల్ టీచర్, జ్ఞాపకశక్తి పెరగాలంటే లాంటి ఎన్నో గ్రంథాలను రచించి సమసమాజ నిర్మాణానికి తన వంతు సహకారం అందించి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రులు రామారావు, చంద్రబాబునాయుడి నుంచి సత్కారాలు అందుకున్నారు. వీటితో పాటు ఎన్నో సన్మానాలూ పొందారు.
''ఆయన రచనల పరంపర ఇలాగే సాగుతూ కలంలోని సిరా ఇంకేదాక సమాజ కొవ్వు కరిగి సమాజ చైతన్యం జరగేదాక రాస్తూనే ఉండాలని ఎన్నో సాహితి సత్కారాలు వరించాలని ఆశిస్తూ...అభినందనలతో అక్షరాస్త్రమాల...''
- డి.అమీర్,
9642480702