Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 20,2021

అద్భుతమైన శక్తి సామర్థ్యాలు

ఈ భూమ్మీద జన్మించిన ప్రతి మనిషిలోనూ ప్రతిభ ఉంటుంది. అందరిలోనూ అద్భుతమైన శక్తి సామర్థ్యాలుంటాయి. మనలో కొందరు అసమర్థులు, మరి కొందరూ సమర్ధులంటూ లేరు. మనందరిలోనూ మనం ఏనాడూ ఊహించని ప్రతిభా విశేషాలున్నాయి. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా? లేదా? అని సమీక్షించుకోవలసిన అవసరముంది. మనలో కొందరు వ్యక్తులు నిత్యజీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే తమ పనులను చక్కగా నిర్వహిస్తారు. వాటిని పూర్తిచేస్తారు. మరికొందరు వ్యక్తులు ఒత్తిడిని భరించలేమని తమ పనులను వాయిదా వేస్తారు. సోమరితనాన్ని ప్రదర్శిస్తారు. అలాంటి వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి అభివృద్ధిని కనబర్చలేరు. మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవాలంటే మనం తీవ్రంగా ప్రయత్నించాలి. నిరుత్సాహానికి గురైనపుడు వెంటనే దానిని అధిగమించే మానసిక శక్తిని అలవర్చుకోవాలి. ఏదైనా ఒక పని చేస్తున్నపుడు మనం అలసటకు లోనవుతాం. పూర్తి చేయాల్సిన పని ఇంకా చాలా ఉంటుంది. ఆ సమయంలో మనం తలపెట్టిన పనులను పూర్తి చేయలేమని భావిస్తాం. వాటిని వాయిదా వేస్తాం. మనం నిర్ణయించుకున్న పనులను పూర్తి చేయగలిగే సామర్థ్యం, ప్రతిభ మనలో ఉన్నాయని గుర్తించిన వెంటనే మనకు అదనపు బలం చేకూరుతుంది. దాంతో ఉల్లాసంగా ఆ పనిని పూర్తి చేస్తాం. ఇక్కడ మనకు కావలసింది మానసిక సంసిద్ధత, పట్టుదల. మన నిత్యజీవితంలో కొత్త కొత్త బాధ్యతలు నిర్వహించాల్సిన సమయంలో కూడా మన శక్తి సామర్థ్యాలు తెలిసి వస్తాయి. అవి మన అవసరానికి వెలికి వస్తాయి. ఉదాహరణకు కమల వివాహానికి ముందు ఇంటి వద్ద ఏ పని చేసేది కాదు. ఆమె తల్లి ఏదైనా పని చేయమని పురమాయిస్తే, ఆ పని తన వల్ల కాదని చెప్పేది. తాను ఆ పని చేయలేనని తేల్చి చెప్పేది. కానీ అత్తగారింటికి వెళ్లిన తరువాత ఆమెకు ఇంటి బాధ్యతలు పెరిగాయి. అత్తగారి మరణంతో 15మంది కుటుంబ సభ్యులున్న ఆ గృహంలో కమల కీలకపాత్ర నిర్వహించవలసి వచ్చింది. అప్పుడు తనకు తన బాధ్యతలు అర్థమయ్యాయి. అమ్మ చెప్పిన మాటలు బోధపడ్డాయి. కమల ఉదయం 5 గంటలకు నిద్రలేచేది. కుటుంబ సభ్యులకు కావలసిన పనులను వివిధ వ్యక్తులకు అప్పగించేది. తాను అలసట లేకుండా పని చేయడం అలవాటు చేసుకుంది. కమల తానీ పనులన్నీ చేయాల్సిన అవసరం వల్ల శ్రమనిపించే దశను అధిగమించి ఇప్పుడెంతో తేలిగ్గా, ఉత్సాహంగా ఇంటి పనులన్నీ పూర్తి చేయగలుగుతోంది. కేవలం క్రమశిక్షణ, దృఢ నిశ్చయం ద్వారా మనలో నిక్షిప్తమై ఉన్న శక్తిని వెలికి తెచ్చుకోవచ్చు. ఏదో అవసరం ఏర్పడినపుడు, అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు మనలోని శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోగలమే గాని శాశ్వతంగా ఇలా యంత్రంలా శ్రమించగలమా? ఇంతటి శ్రమకు మన మనస్సు గాని, శరీరం గాని తట్టుకోగలదా? అని అనుమానం ఎవరికైనా రావచ్చు. ఇలా ఆలోచించడం సహజమైన విషయమే. మొదట్లో మనకు కొన్ని బరువు బాధ్యతలు నిర్వహిస్తున్నపుడు విపరీతమైన అలసట జనిస్తుంది. క్రమంగా మన శరీరం, మనస్సు ఆ పనులకు అలవాటు పడతాయి. ఆ సమయంలో మనకు అలసట అనిపించదు. పైగా మనలో ఉత్సాహం పెరుగుతుంది. ఉల్లాసం వెల్లివిరుస్తుంది. ఏ పనైనా మనం 21 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఆ పని మనకు తేలికవుతుంది.
మిత్రమా.. మనలో కొందరు 5 గంటల పనికే అలసి పోయేవారున్నారు. మరి కొందరు 16 గంటల పని చేసినా ఏమాత్రం అలసిపోరు. మన ఇండ్లలోని గృహిణులను ఒక సారి పరిశీలించండి. ముఖ్యంగా ఉద్యోగం నిర్వహించే మహిళలు ఆఫీసులో 8 గంటలు, ఇండ్లలో మరో 8 గంటలు పని చేస్తారు. వాస్తవానికి ఎక్కువ పని చేసే వారు ఎక్కువ నిద్రపోరు. వారికి 6 గంటల నుంచి 8 గంటల నిద్ర అవసరం ఉంటుంది. కొందరు సోమరి పోతులు మాత్రం 10 గంటలు నిద్రపోయినా తమకు విశ్రాంతి చాలడం లేదని ఫిర్యాదు చేస్తారు. మనలో చాలామంది దృఢ నిశ్చయం లేక పోవడం వల్ల తాము తలపెట్టిన పనులను పూర్తి చేయడం లేదు. తమకు ఎదురయ్యే అవరోధాలను అధిగమించడం లేదు. ఉదాహరణకు మనకు వెయ్యి గదులున్నా భవంతి ఉండగా, మనం నిత్య జీవితంలో 999 గదులను ఖాళీగా వినియోగించుకోకుండా వదిలి వేస్తున్నాం. మనం ఒక గదిలోనే నివసించడానికి అలవాటు పడి, విలువైన జీవితాన్ని కొన్ని పనులకే పరిమితం చేసుకుంటున్నాం. చరిత్రలో మానవ జాతి పురోగమనాన్ని ఒకసారి పరిశీలించండి. మన పూర్వీకులు ఎంతో కష్టపడి ఎన్నో కొత్త ఆవిష్కరణలను అమల్లోకి తెచ్చారు. వారు సోమరిపోతులుగా జీవించి ఉన్నట్లయితే ఈ ప్రపంచం ఇలా మారేది కాదు. మనం కష్టపడడం ద్వారా మన భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వారమవుతాం. అందువల్ల మన సోమరి తనాన్ని విడనాడి మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించే పనులను చేపట్టడం మానవాళికి అత్యవసరం.

- జి.గంగాధర్‌ సిర్ప,
8919668843

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
ఆడబిడ్డలకు భరోసానిద్దాం...
సమీక్షలు
అందుకున్నాం
చిలుకా క్షేమమా?
భారత గ్రంథపాలకుల అవస్థలు
విధేయత

తాజా వార్తలు

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

06:10 PM

26 భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు

05:54 PM

ఖమ్మం జిల్లాలో మహిళను లైంగికంగా వేధించిన కార్మిక నేత..

05:39 PM

మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.