Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యయిక స్థితి కాలం ఒక పీడకల. దానికి కర్తా కర్మా క్రియ మొత్తం అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అయితే, కథ అంతా నడిపించింది ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజరు గాంధీ. 1975 జూన్ 26న మొదలైన ఎమర్జెన్సీ 1977 మార్చ్ 21 న అంతమైంది. ఈ 21 నెలల కాలంలో దేశం చవి చూసిన అరాచకం ఎంతో. బిక్కుబిక్కు మంటూ కాలం గడిపిన స్వేచ్ఛాపిపాసులు ఎంతమందో. ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకు తెస్తే భయంతో వొణికి పోయే వారు చాలామంది వున్నారు. ఆకు కదల కూడదు, చిరుగాలి సితారా మీటకూడదు అని కవి శివసాగర్ అన్నట్టుగా అంతటా ఒకటే నిశ్శబ్దం. నీరవ నిశీధి లాంటి నిశ్శబ్దం.
1971లో జరిగిన ఎన్నికలలో రాయబరేలీ నియోజకవర్గం నుండి గెలిచిన ప్రధాని ఇందిరాగాంధీ మీద ఆమె ప్రత్యర్థి రాజ్ నారాయణ కేసు వేశారు. ఆమె తన అధికారాన్ని దుర్వినియోగ పర్చి అధికార యంత్రాగం మొత్తాన్ని తనకు అనుకూలంగా వాడుకున్నారని, అక్రమాలకూ పాల్పడ్డారని ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాల్సిందిగా కోర్ట్‌ను ఆశ్రయించారు. 1975 జూన్ 12 న జస్టిస్ జగ్మోహన్ లాల్ 'అవును. నిజం ఆమె ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు' అంటూ ఆమెను ఆరునెలల పాటు ఎన్నికలలో పాల్గొనరాదని తీర్పు ఇచ్చారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకి అప్పీల్‌కి వెళ్లిన ఇందిరాగాంధీకి అక్కడా చుక్కెదురుఅయింది, ఆమె ప్రధానమంత్రిగా ఉండవచ్చు కానీ పార్లమెంట్ సభ్యురాలిగా ఉండరాదని జస్టిస్ కృష్ణ అయ్యర్ అలహాబాద్ హైకోర్ట్ తీర్పును సమర్ధించారు.
ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశంలోని అత్యంత చీకటి రోజులకి అలా అంకురార్పణ జరిగింది.
అప్పటి ఎమర్జెన్సీ గురించి ఇప్పటి గ్లోబల్ తరానికి అస్సలు ఏమీ తెలియదు. దాని మంచి చెడ్డల గురించీ అసలేమాత్రం అవగాహన లేదు. అందుబాటులో కావలసినంత సాహిత్యం వుంది కానీ, వాటిని చదివే ఓపిక ఎవరికీ లేదు. ఆ చీకటి చరిత్ర గురించి ఇప్పటి తరానికి చెప్పడానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధు భండార్కర్ పూనుకున్నారు. 'ఇందు సర్కార్' పేరుతో ఆయన ఒక సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల అయి కావలసినంత రాజకీయ వేడి రగిలించింది.
కాంగ్రెస్ పార్టీ ఈ సినిమాను బి.జె.పి ప్రాయోజిత సినిమాగా వ్యాఖ్యానిస్తూ, చరిత్రను తప్పుగా చూపిస్తున్నారని ఆరోపణ చేస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా లాంటి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఈ సినిమా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.
భారతదేశంలో రాజకీయ సినిమాలకు కొదవ లేదు. అన్ని భాషలలోనూ ఎన్నో రాజకీయ సినిమాలు వచ్చాయి. ఎంతో కొంత విమర్శను, మరికొంత ప్రశంసను అందుకున్నాయి. కొన్ని సినిమాలు అయితే అసలు విడుదలకే నోచుకోలేదు. వాటన్నిటికీ భిన్నంగా 'ఇందు సర్కార్' సంచలనం రేకెత్తిస్తోది. దానికి ప్రధాన కారణం బి.జె.పి, పంకజ్ నిహలానీ.
భారత ప్రజల హృదయాలలో ఇప్పటికీ కొలువై ఉన్న నెహ్రూ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసి వల్లభాయి పటేల్‌ను ప్రతిష్టించాలని ప్రయత్నాలు చేస్తున్న భా.జ.పా, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నదని, అందులో భాగంగానే ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా సాఫీగా పని జరిగేలా చూస్తూ పరోక్షంగా తన భావజాలం అంతా సినిమాలో ఉండేలా చూస్తోందని ఆరోపణలు.ఈ ఆరోపణలకి ఆజ్యం పోసేలా వున్నాయి భా.జ.పా కావాలని తీసుకుని వచ్చిన పంకజ్ నిహలానీ చర్యలు.
షారుఖ్ ఖాన్, అనుష్కాశర్మల కొత్త సినిమాలో ఇంటర్ కోర్స్ అనే పదం వినిపిస్తే దానిని తొలగించాలని, అది అసభ్యమైన పదమని వాదించి... దానిని సినిమాలో కొనసాగించాలంటే సోషల్ మీడియాలో కనీసం లక్ష మంది నుండి ఆమోద ముద్ర వేయించగలవా అని సవాల్ చేసిన పంకజ్ నిహలానీ 'ఇందు సర్కార్'కి మాత్రం తనదయిన రీతిలో మద్దతు ఇస్తున్నాడు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం మీద ఒక బయోపిక్ తీయాలని ప్రయత్నం చేసిన వారిని మన్మోహన్ సింగ్ దగ్గరనుండి 'చీశీ ఉbjవష్‌ఱశీఅ జవత్‌ీఱళషa్‌వ' తీసుకుని రమ్మని పూర్తి చట్టప్రకారం నడచుకున్న నిహలానీ, ఆమ్ పార్టీ మీద 'Aఅ ×అరస్త్రఅఱళషఅ్ వీaఅ' పేరుతో సినిమా తీయాలనుకున్న వారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నుండి, ఢిల్లీ ప్రస్తుత ముఖ్య మంత్రి అరవింద్ కేజరీవాల్ నుండి 'చీశీ ఉbjవష్‌ఱశీఅ జవత్‌ీఱళషa్‌వ' తీసుకురమ్మని అడిగిన పంకజ్ నిహలానీ 'ఇందు సర్కార్'కి మాత్రం అలాంటి 'చీశీ ఉbjవష్‌ఱశీఅ జవత్‌ీఱళషa్‌వ' అవసరం లేదు అంటున్నారు. ఈ చర్యల వెనుక భాజపా వుందన్నది కాంగ్రెస్ ఆరోపణ.
ఇప్పటివరకూ భారతదేశంలో కాంగ్రెస్ గురించి కానీ, నెహ్రూ ఫామిలీ గురించి కానీ ఎలాంటి బయోపిక్‌లూ రాలేదు. అప్పుడెప్పుడో 1975లో గుల్జార్ సుచిత్రాసేన్ కథానాయకిగా వచ్చిన 'ఆంధీ'లో సుచిత్రాసేన్ అచ్చు ఇందిరాగాంధీలా కట్టుబొట్టులతో కనిపించిందని ఒక వివాదం చెలెగింది. పైగా ఆ సినిమాలో కథానాయకి సిగరెట్ తాగే దృశ్యాలు కొన్ని కనిపించడంతో ప్రభుత్వం ఆ సినిమాను నిషేధించింది. 1977 ఎమర్జెన్సీ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఓటమి పొందిన తరువాత 'ఆంధీ'కి మోక్షం లభించి విడుదల అయి విజయం సాధించింది.
రాజకీయ సినిమాల మీద నిషేధాలు భారతదేశంలో మామూలే. మహాత్మాగాంధీ దారుణ హత్యలో ప్రధాన పాత్రదారి నాధూరాం గాడ్సే మానసిక ఉద్దేశ్యాల మీద నిర్మించిన గోకుల్ శంకర్ గురించి వినడమే కానీ నేనైతే చూడలేదు.
దేశ విభజన మీద ఎం.ఎస్.సత్యు బలరాజ్ సహానీ కథానాయకుడుగా నిర్మించిన 'గరం హవా' కూడా నిషేధానికి గురి అయి తరువాత విడుదల అయి ప్రజల నుండి నీరాజనం అందుకుంది.
ఎమర్జెన్సీ మీదే నిర్మించిన 'కిస్సా కురిసీ కా'ది ప్రత్యేకమైన కథ. ఆ సినిమాను నిషేధించడమే కాదు సినిమా నెగిటివ్స్ కూడా పూర్తిగా తగుల బెట్టారు. అలా కాల్చివేసిన చోటే ప్రస్తుతం మారుతీ ఉద్యోగ్ ప్రధాన భవంతి వుంది. ఎమర్జెన్సీలో ప్రధాన పాత్రధారులు అయిన సంజరు గాంధీ, ఇందిరాగాంధీ, కోటరీ ఆర్.కె.ధావన్, ధీరేంద్ర బ్రహ్మచారి, రుక్సానా సుల్తానాల పాత్రలు, ప్రస్తావనలు ఉండటమే ప్రధాన కారణం.
రాజీవ్‌గాంధీ హత్య మీద నిర్మించిన తమిళ సినిమా 'కుట్ర పత్రికై' అయితే వివాదాల సుడిగుండంలో చిక్కుకుని విడుదలకే నోచుకోలేదు.
సారిక, నసీరుద్దీన్‌షాల 'పర్జానియా' (ఈ నేల మీదే స్వర్గమూ నరకమూ) గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో వచ్చిన సినిమా, భజరంగదళ్ ఆందోళనల నేపథ్యంలో గుజరాత్‌లో విడుదలకి నోచుకోలేదు. గుల్బార్గా హననం తరువాత కనిపించకుండా పోయిన అజహర్ మోడీ అనే పిల్లవాడి కథ ప్రేరణ తో తీసిన సినిమా పర్జానియా.
అమీర్ ఖాన్ నర్మదా బచావో ఆందోళనకి మద్దతు ఇస్తున్నాడు అన్న ఒకే ఒక కారణంతో గుజరాత్‌లో 'ఫనా' విడుదలకి నోచుకోలేదు.
తెలుగులో కూడా మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును విమర్శిస్తూ సూపర్‌స్టార్ కృష్ణ నిర్మించిన 'మండలాధీశుడు' (కోట శ్రీనివాసరావు కథానాయకుడు) మొదట్లో కొంత వివాదాస్పదమైనా ఎలాంటి ఇబ్బందీ పడలేదు. వంగవీటి మోహన రంగా జీవితం ఆధారంగా తీసిన 'వంగవీటి', పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా తీసిన 'శ్రీ రాములయ్య', జార్జిరెడ్డి జీవితం ఆధారంగా తమ్మారెడ్డి భరద్వాజ తీసిన 'అలజడి'... చెప్పుకునేందుకు కొన్ని. కానీ ఇవేవీ నిషేధాల దాకా పోలేదు.
ఇంతకూ 'ఇందు సర్కార్'లో ఏముంది?
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒక ఉద్యమ కారుడికి చెందిన ఇద్దరు పిల్లలు అల్లర్లలో ఒక కవయిత్రికి దొరుకుతారట. వారిని కాపాడటానికి ఆమె ప్రయత్నించడం ఆమె భర్తకి ఇష్టం ఉండదట. అయినా ఆమె వారిని ఎలా కాపాడింది అన్నది మిగతా కథ అట. ఎంత నిర్బంధం వున్నా ప్రజల గొంతు పెగలకుండా ఉండదు అని చెప్పటానికి ఆమెకు స్టామరింగ్ పెట్టారట.
సామాజిక వాస్తవికత తన ప్రధాన బలంగా సినిమాలు తీసే మధు భండార్కర్ ఇంతకుముందు తీసిన 'చాందినీ బార్', 'పేజ్ 3', 'కార్పొరేట్' వెండితెర మీద కాసుల వర్షంతో పాటు అవార్డులు కూడా సాధించాయి. 'చాందినీ బార్'తోనే టబు ఉత్తమ నటిగా అవార్డు పొందింది. బార్ గర్ల్స్ జీవితం లోని చీకటి కోణాలు, కార్పొరేట్ ప్రపంచం రెండో వైపు, 'పేజ్ 3' సంస్కృతి గురించిన విచికిత్స లాంటి అంశాలతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మధు భండార్కర్ ఇప్పటికే ప్రజల హృదయాలలో ఒక పీడ కలలా నిలిచిన ఎమర్జెన్సీ రెండో వైపు ఎలా చూపిస్తాడో చూడాలి.
చరిత్రను ఎవరైనా ఎలాగైనా రికార్డు చేయవచ్చు. అంతిమ తీర్పు మాత్రం ప్రజలదే.
ఈ సినిమా జులై 28 న విడుదల కానున్నది
- వంశీకృష్ణ, 9573427422