Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలుగుబంటినే భల్లూకం అనీ, ఇంగ్లీషులో బేర్ అనీ అంటారు.
- బేర్ అనే పదం ఇంగ్లీషు భాష లోని ' బేరా' నుంచి వచ్చింది. అంటే బ్రౌన్ అని అర్థం.
- ఎలుగు బంట్లు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా ఖండాల్లో కనిపిస్తాయి.
- బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్, జెయింట్ బేర్... ఇలా వీటిలో చాలా రకాలున్నాయి. ధృవ ప్రాంతాల్లో నివశించేవాటిని పోలార్ బేర్ అంటారు.
- పాండా కూడా ఎలుగుబంటి జాతికి చెందినదే.
- ఎలుగుబంట్లు మాంసాహారులైతే, పాండాలు కేవలం శాఖాహారాన్ని మాత్రమే తింటాయి.
- ఎలుబంటి శరీరంపై వుండే వెంట్రుకలు (బొచ్చు, ఇంగ్లీషులో ఫర్) రెండు పొరలుగా ఉంటాయి. ఒక పొర శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడితే, రెండో పొర శరీరం నుండి ఎక్కువ నీటిని నష్టపోకుండా చేస్తుంది.
- బ్లాక్ బేర్ ఎప్పుడూ నలుపు రంగులోనే ఉండదు. నలుపు నుండి ముదురు గోధుమరంగు, తర్వాత లేత గోధుమరంగుకి, ఆ తర్వాత తెలుపుకి మారుతుంది.
- ధృవపు ఎలుగుబంటి తన పొట్టలో 68 కిలోల వరకు ఆహారాన్ని నిల్వచేస్తుంది. ఇలాంటి ఏర్పాటు వుండటం వల్ల చలికాలంలో ఆహారానికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
- మామూలు ఎలుగుబంట్లకంటే పాండాల చేతులకి ఒక వేలు ఎక్కువగా ఉంటుంది. ఇలా వుండటం వల్ల పాండాలు వాటి ఆహారమైన బాంబూ చెట్లని పట్టుకోడానికి వీలుగా ఉంటుంది.
- జర్మన్ సంస్కృతిలో ఎలుగు బంటిని యుద్ధ వీరునికి చిహ్నంగా భావిస్తారు.
- ఇవి పగటి పూట సంచరించే జంతువుల కోవకు చెందినవే. కానీ రాత్రి పూట కూడా చురుగ్గా తిరుగుతాయి.
- భారీ శరీరం ఉన్నాగానీ వేగంగా పరుగెత్తుతాయి.
- ధృవపు ఎలుగుబంటి ఎక్కడా ఆగకుండా వంద మైళ్ళు పరుగెత్తగలదు.
- ఎలుగుబంట్లు పగలే కాదు, రాత్రిపూట కూడా చాలా ఉత్సాహంగా ఉంటాయి.