Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినాశకాలే విపరీత బుద్ధి అనే నానుడిని నిజం చేస్తున్నారు కొంతమంది యువతీ యువకులు. ఇప్పటి యువతీ యువకులకు జీవనయానంలో చదువులు, ఉద్యోగాల వేటలో పడి ఒకరినొకరు ప్రేమించుకునేందుకు కూడా సమయం లేకుండా పోతుంది. భోజనం తయారు చేసుకోలేనోడి కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలసినట్టు.. ఇప్పుడు ప్రేమను కూడా వ్యాపారమయం చేసి సొమ్ముచేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ముంబైకి చెందిన కౌశిఖ్ అనే ఓ యువకుడు 'రెంట్ ఏ బారుఫ్రెండ్' పేర యాప్‌ను రూపొందించాడు. ఒంటరి జీవితం గడిపే మహిళలకు, ఒత్తిడితో సతమతమవుతున్న వారి జీవితాలకు భరోసా ఇచ్చేందుకు ఈ యాప్ తీసుకొచ్చామన్నాడు. ఇది శృంగారానికి సంబంధించిన యాప్ కాదు. దీనిలో చేరాలంటే అందరికీ సాధ్యం కాదు. మాటతీరు. నడవడిక, బాడీ లాంగ్వేజ్, శారీరక, మానసిన పరిస్థితులు, నేరచరిత్రను పూర్తిగా పరీక్షించిన తరువాతే అతడిని ఎంపిక చేస్తారు. మహిళలు యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న అద్దె స్నేహితుడు 3 నుండి 4 గంటల పాటు వారితో ఉంటారు. వీరికి గంటకు ఇంత అని చెల్లించాల్సి ఉంటుంది. అద్దెకు వచ్చే స్నేహితుడి ఖర్చులు మహిళలే చెల్లించాలి. ఒక వేళ ఎక్కువ సమయం కావాలంటే ముందుగానే యాప్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి సదరు మహిళను సంతోషపెట్టే పనులు మాత్రమే చేయాలి. అంతేకానీ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించకూడదు. ఒంటరితనంతో బాధపడుతున్న మహిళలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని భావిస్తున్నప్పటికీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని భయం లేకపోలేదు. - పుప్పాల