Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలితరం తెలంగాణ రచయితల పుస్తకాలని వెలువరించే బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టింది. అందులో భాగంగా ఆనాటి కథకుల, కవుల రచనల్ని వెలుగులోకి తీసుకొస్తుంది. ఈ క్రమాన అడ్లూరి అయోధ్య రామకవి కథల్ని 'తెలంగాణ మంటల్లో...' శీర్షికన పుస్తకంగా తీసుకొచ్చింది. అలాగే ఈ పుస్తకంలో హైదరాబాద్‌పై పోలీసు చర్యలు బుర్రకథని కూడా చేర్చింది. రజాకార్ల దౌర్జన్యంతో తల్లడిల్లిన తెలంగాణ గ్రామీణ ప్రజల వ్యధల్ని రామకవి కథలుగా రాశారు. ఈ పుస్తకంలో ఆరు కథలున్నాయి. ముందుమాట రాసిన కె.పి.అశోక్‌కుమార్ చెప్పినట్లు రజాకార్ల దౌర్జన్యాలను వివరిస్తూ కథలు రాసి, వాటిని సంకలనం చేసిన ఏకైక రచయిత అడ్లూరి అయోధ్య రామకవి. 1948లో తొలిసారి ముద్రితమైన ఈ పుస్తకం ఏడు దశాబ్దాల అనంతరం వెలుగు చూడటం ముదావహం. తెలంగాణ మాటల్లో... రచన: అడ్లూరి అయోధ్యరామకవి, పేజీలు: 64, వెల: రూ. 20/-, ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్, ఫోను: 040-2970 3142