Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డాక్టర్... నేను ఆపరేషన్ చేయించుకున్నా నా భార్య నెలతప్పింది డాక్టర్' అని ఓ వ్యక్తి అడిగితే 'నీవు చేయించుకున్నావ్ సరే నీ పక్కింటాయన చేయించుకోలేదుగా' అని డాక్టర్ సమాధానం.. జనరల్‌గా ఇలాంటివి మన తెలుగు సినిమా కామెడీ సీన్స్‌లో చూస్తుంటాం. కానీ జర్మనీలో మాత్రం ఓ వ్యక్తి పక్కింటి వాడు తన భార్యను గర్భవతిని చేయలేదని ఆ యువకుడిపై కేసు పెట్టాడు. తన భార్య గర్భవతి కాకపోతే పక్కింటి వ్యక్తిపై కేసు పెట్టడం ఏంటి అని పరేషన్ అవుతున్నారా? అయితే మీరు అసలు ముచ్చట చదవాల్సిందే. జర్మనీలోని ఓ కోర్టులో జరిగిన వాదనల్లో తన భార్యను గర్భవతిని చేయడంలో పక్కింట్లో ఉంటున్న జోస్ అనే వ్యక్తి ఘోరంగా విఫలమయ్యాడని ఏకంగా కోర్టుకు ఈడ్చాడు డానీ అనే వ్యక్తి. అందుకు జోస్‌కు 2500 డాలర్లు చెల్లించినట్టు డానీ కోర్టులో చెప్పారు. ఇక అసలు మ్యాటర్‌కి పోతే డానీకి ఏదో లోపం ఉంది పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. కానీ ఎలాగైనా తన భార్యను తల్లిని చేయాలని కంకణం కట్టుకున్నాడు. పక్కింట్లో ఉంటున్న జోస్‌తో ఆరు నెలల్లో తన భార్యను గర్భవతిని చేయాలని ఒప్పదం కుదుర్చుకున్నాడు. కానీ ఆరు నెలల్లో జోస్ 72 సార్లు ప్రయత్నించినా గర్భవతి కాలేదు. దీంతో జోస్ సైతం పరీక్షలు చేయించుకోగా తనకు కూడా లోపం ఉందని, సంతానయోగం లేదని చెప్పేశారు. ఇక దాంతో డానీ కోర్టును ఆశ్రయించాడు. అయితే జోస్ మాత్రం డానీ ఇచ్చిన పైసలు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తన ప్రయత్నం తాను చేశానని.. పైవాడి దయ లేదని కోర్టులో చెప్పుకొచ్చాడు జోస్. దీంతో ఎలాంటి తీర్పు ఇస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
- పుప్పాల