Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలో డ్యూపాంట్ అనే రసాయనాల సంస్థ ఉంది. ఇది ఫ్రిడ్జ్‌లో వాడేందుకు ఓ సురక్షితమైన రసాయనాన్ని కనుగొనమని 'రారు ప్లంకెట్' అనే యువకుణ్ణి నియమించింది. రారు రకరకాల రసాయనాలతో ఆ పరిశోధనలు మొదలుపెట్టాడు. ఓరోజు 'టెట్రా ఫ్లోరో ఎథలీన్' అనే వాయువుని ఓ సిలిండర్‌లో నింపి ఇంటికెళ్లాడు. మర్నాడు వచ్చి మూత తీస్తే వాయువు బయటికి పోకుండా లోపలే ఉండిపోయింది. సంగతి అర్థం కాక, మిత్రుడితో కలిసి ఆ సిలిండర్‌ని రంపంతో కోశాడు. లోపల ఒక జిగురులాంటి పూత కనిపించింది.
జరిగిందేమిటంటే.. అధిక ఒత్తిడి వల్ల టెట్రా ఫ్లోరో ఎథలీన్ వాయువుకీ, సిలిండర్ ఇనుముకీ మధ్య ప్రతి చర్య జరిగి ఒక కొత్త పదార్థం ఏర్పడింది. దానివల్ల ఏదన్నా ఉపయోగం ఉందా అని మరిన్ని పరిశోధనలు చేపట్టింది డ్యూపాంట్ సంస్థ. అలా కనుగొన్నదే టెఫ్లాన్. అప్పట్నుంచి టెఫ్లాన్‌ను చాలా రకాలుగా వినియోగించడం మొదలు పెట్టారు. దోశలు అంటుకోకుండా పెనాలకు పైపూతగా వాడటం వాటిలో ఒకటి.