Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హడావిడిలో పడి చాలామంది టిఫిన్‌ను మానేస్తుంటారు. ఈ అలవాటు మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయపు ఉపాహారం మనకు కావలసిన శక్తిని ఆ రోజంతా ఇస్తుంది. రాత్రి భోజనం తర్వాత సుమారుగా 12 గంటల పాటు మనం ఏమీ తినకుండా ఉంటాము . ఉదయం లేవగానే మెదడు కండరాలు చురుగ్గా పని చేయాలంటే అత్యవసరంగా ఆహారం కావాలి. అందుకే తప్పకుండా టిఫిన్ చేయాలి. అందులో మాంసకత్తులు, పిండి పదార్థాలు, పీచు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యానికి ఉపయోగం కూడాను.