Authorization
Mon Jan 19, 2015 06:51 pm
500 ఏండ్ల నుంచే మనుషులు బాతుల్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ఖండాల్లోనూ బాతులున్నాయి. వీటి ఈకలు కొంచెమైనా నీటిలో తడవవు. వాటిపై మైనం పూతలాంటిది ఉండటమే అందుకు కారణం. ఐదు నుంచి పదేళ్ల పాటు బతుకుతాయి. శాకాహారం, మాంసాహారం రెండూ తింటాయివి. గుడ్లు పెట్టే సమయంలో ఆడబాతు మెత్తటి గూడును తయారుచేస్తుంది. అందుకోసం తన శరీరం నుంచి మెత్తని ఈకల్ని ముక్కుతో లాగుతుంది. సముద్ర బాతులు తిండికోసం నీటిలో చాలా లోతుల్లోకీ వెళ్లిపోగలవు.