Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పులగం చిన్నారాయణ, వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ ఎంతో శ్రమించి 'వెండితెర నవలల'కు సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలను వెలికితీయడం అభినందించదగ్గ విషయం. ఇందులో ఏ యే సినిమాలకు వెండితెర నవలలు వచ్చాయి? ఎవరెవరు రాశారుతో పాటు, రాసిన వారి కథనాలను కూడా ఇందులో పొందుపరిచారు. డబ్బింగ్ చిత్రాలకు కూడా వెండితెర నవలలు వచ్చాయన్న సంగతి చాలా మందికి తెలియదు. కె.బి.కె.మోహన్ నవలను 'తేనె మనసులు' సినిమాగా తీస్తే, ఆ సినిమాను వెండితెర నవలగా గోటేటి రామారావు రాయడం విశేషం. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
- కె.పి.అశోక్‌కుమార్,
9700000948
వెండి చందమామలు, పులగం చిన్నారాయణ, వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ, పేజీలు : 92, వెల: 50/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు