Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వేకదా
మట్టివాసనలను తీసి
లోకంమీద ఎగజల్లగలవు.
నీ తాన దినుసును నెత్తికెత్తుకున్న
బబ్బెరుసాళ్ల జ్ఞాపకాలుంటాయి
గుండె అర్రల నిండా
పజ్జోన్న కర్రలలాంటి ఆకలిజెండాలూ వుంటాయి.
వరికర్రల త్యాగానికి దండంబెట్టి
అలుకుడు బోనం మెడకు
నువ్వే
ఒక బంతిపూల దండవై మెరిసిపోతావు.
నీలాగే ఇంటిని మోసిన గొడ్డు గోదను
నీ కంటిగూడు కింద మెదిలే కోటొక్క జీవరాశిని
పానానికి పానంగా జూసుకునే
నీ కన్నా విశ్వప్రేమికుడెవరు?
నిజానికి
లోకానికి ఏ పాఠమైన నీనుండే మొదలవ్వాలి.
నువ్వు దళారీలచేతిలో, రాజ్యపుచేతిలో మోసపోతున్న
మట్టి మీదున్న మట్టంత నమ్మకమే నిన్ను బతికిస్తుందని కదా!
మట్టిపెడ్డల కిందా నీ ఆత్మగింజను మళ్ళీ మళ్ళీ దాసుకుంటావు
నీవే గింజై, నీ తనువే మట్టై.
- నాగిళ్ళ రమేశ్,
73309557559