Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేషెంటు : ఆపరేషన్ థియేటర్‌లో పూలదండ ఎందుకు పెట్టారండి.
నర్స్ : ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్‌గారికి వేయడానికి, ఫెయిలయితే నీకు వేయడానికి.
ఏమీ లేదనే
పూజ : నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు బుజ్జీ?
బుజ్జి : నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను. ఉంటే నిన్నీపాటికి ఎవరో ఒకరు ప్రేమించేసి ఉండేవారు కదా.
మిగిలేది?
టీచర్ : వినోద్, 5-5 ఎంత?
టీచర్ ప్రశ్నకు వినోద్ మౌనంగా ఉంటాడు.
టీచర్ : సరే, విను. నీ దగ్గర ఐదు ఇడ్లీలు ఉన్నాయి. ఆ ఐదు ఇడ్లీలను నేను తీసుకున్నాను. అప్పుడు నీ వద్ద ఏం ఉంటుంది?
వినోద్ : సాంబర్, చట్నీ ఉంటుంది టీచర్.
పోయింది కానీ...
వెంకట్ : ఉబ్బసం తగ్గడానికి స్వచ్ఛమైన గాలి కోసం కిటికీలు తీసి పడుకోమని చెప్పారు కదా!
డాక్టర్ : అవును... ఇంతకీ మీ ఉబ్బసం పోయిందా?
వెంకట్ : లేదు. నా లాప్‌టాప్, రోలెక్స్ వాచీ మాత్రం పోయాయి.