Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిలైడ్ లో పెరుగుతున్న కరోనా కేసులు
- తొలిటెస్టుకు ఢోకాలేదన్న బోర్డు
అడిలైడ్: దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ సహా ఆటగాళ్లు ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. కానీ డిసెంబర్ 17నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న చారిత్రాత్మక డే/నైట్ టెస్ట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఆస్ట్రేలియా క్రికెట్‌బోర్డు(సిఏ) సోమవారం నొక్కి చెప్పింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్లలో ఆందోళన నెలకొంది. ఆటగాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ సమయానికి కరోనా తగ్గుముఖం పట్టొచ్చనీ, కరోనా నిబంధనల ప్రకారమే ఆ టెస్ట్ జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయనున్నామని సిఏ తెలుపగా.. ముందు జాగ్రత్తగా తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ తెలిపాడు. భారతజట్టు 69 రోజుల సుదీర్ఘ పర్యటన నిమిత్తం ఇప్పటికే ఆసీస్ చేరుకొని ఆదివారం ప్రాక్టీసును మొదలెట్టింది. ఇదిలా ఉండగా.. కరోనా లోకల్ ట్రాన్స్‌మిషన్ లేనందున సిరీస్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. తొలిటెస్ట్‌కు ముందు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 3 వన్డేలు, 3టి20ల సిరీస్ జరగనుంది. ఈ వేదికలో జరిగే టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు 27వేలమంది ప్రేక్షకులకు అవకాశం కల్పిస్తూ సీఏ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇక్కడ కరోనా విజంభణ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సీఏ వెనక్కి తీసుకుంటుందో.. లేదో? దీంతో వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వం రాష్ట్రాలమధ్య సరిహద్దులను మూసివేసింది.