Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బార్సిలోనా: ఉరుగ్వే ఫుట్‌బాల్ ఆటగాడు లూయిస్ సురేజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్నిఉరుగ్వే ఫుట్‌బాల్ అసోసియేషన్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో భాగంంగా శుక్రవారం కొలంబియాపై ఉరుగ్వే 3-0 గోల్స్‌తో విజయం సాధించిన సురేజ్... కరోనా వల్ల బ్రెజిల్‌తో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. కరోనా పాజిటివ్ పరీక్షల ఫలితంతో సురేజ్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. ఉరుగ్వే ఫుట్‌బాల్ అసోసియేషన్ జరిపిన కరోనా పరీక్షల్లో సురేజ్‌తోపాటు రోడ్రిగో మునేజ్, మాటియాస్ ఫరాల్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. గత నెలలో క్రిస్టియానో రొనాల్డోకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.