Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హత ప్రక్రియ ప్రారంభించిన ఐసీసీ, సీజీఎఫ్
దుబాయ్: కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు మళ్లీ ప్రవేశం దక్కింది. 2022లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టి20 క్రికెట్ పోటీలకు అర్హత ప్రక్రియ మొదలైంది. 2021 ఏప్రిల్ 1 నాటికి ఆతిథ్య ఇంగ్లాండ్ సహా ఐసీసీ మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆరుజట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. మిగిలిన ఒక బెర్త్‌కోసం అర్హత పోటీలు జరుగనున్నాయి. నాలుగేండ్లకొకసారి జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో 1998 కౌలాలంపూర్‌లో జరిగిన పోటీల్లో పురుషుల క్రికెట్ భాగమైంది. ఆ తర్వాత నిలిపివేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు మహిళల క్రికెట్ రూపంలో భాగస్వామ్యం లభించినట్లైంది.